Jhulan Goswami
-
టీమిండియా మాజీ బౌలర్‌కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక కమిటీలో చోటు
లండన్: ప్రతిష్టాత్మక మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వరల్డ్ క్రికెట్ కమిటీలో భారత మాజీ పేసర్ జులన్ గోస్వామికి స్థానం లభించింది. ఆమెతో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు ఇయాన్ మోర్గాన్, హీతర్ నైట్లను కూడా కమిటీలోకి తీసుకున్నట్లు ఎంసీసీ చైర్మన్ మైక్ గ్యాటింగ్ వెల్లడించారు. క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీలో భాగమైన వరల్డ్ క్రికెట్ కమిటీ కొత్తగా వచ్చే సాంకేతిక అంశాలను, వాటిని ఉపయోగించడానికి సంబంధించి తగిన సూచనలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎంసీసీ ప్రధాన కేంద్రం లార్డ్స్ మైదానంలో ఉంది. లార్డ్స్‌లోనే జరిగిన ఫైనల్ మ్యాచ్‌లలో 2019 వన్డే వరల్డ్ కప్, 2017 వన్డే వరల్డ్ కప్‌లలో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ఈ టీమ్‌లకు మోర్గాన్, హీతర్ నైట్ కెప్టెన్లుగా వ్యవహరించారు. గత ఏడాది ఇదే లార్డ్స్ మైదానంలో తన ఆఖరి వన్డే ఆడి జులన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి 355 వికెట్లు పడగొట్టిన జులన్‌కు ఈ ఏడాదే ఎంసీసీ గౌరవ సభ్యత్వం దక్కింది. -
క్రికెటర్లుగా మారిన సినీతారలు.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉందండోయ్!
ఆటకు వేళాయె అంటూ కొందరు స్టార్స్ ప్లేయర్స్‌గా మారారు. క్రికెటర్లుగా, కోచ్‌లుగా మౌల్డ్ అయిపోయారు. అయితే ఈ ఆట అంతా సినిమాల కోసమే. ప్రస్తుతం క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో కొన్ని చిత్రాలు రూపొందుతున్నాయి. కొన్ని కాల్పనిక కథలు కాగా, కొన్ని బయోపిక్స్ కూడా ఉన్నాయి. ఇక వెండితెరపై క్రికెటర్లుగా అలరించనున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. ► సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహణ మీద ఉన్నారు. ‘లాల్ సలామ్’ చిత్రం కోసమే ఇదంతా. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విష్ణువిశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో, రజనీకాంత్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ క్రికెట్ కోచ్ పాత్రలో కనిపిస్తారనీ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధిగా కనిపిస్తారనీ ప్రచారం జరుగుతోంది. మరి.. రజనీ ఏ పాత్రలో కనిపిస్తారో చూడాలి. ‘లాల్ సలామ్’ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ► క్రికెట్ గ్రౌండ్లో బిజీగా ఉంటున్నారు మాధవన్, సిద్ధార్థ్, నయనతార. ఈ ముగ్గురూ కలిసి సిల్వర్ స్క్రీన్‌పై ఆడనున్న మ్యాచ్ ‘ది టెస్ట్’. తమిళ నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ఇది. ఈ చిత్రంలో నయనతార, మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ► శ్రీలంక మాజీ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంలో సలీమ్ మాలిక్ పాత్ర చేసిన మధుర్ మిట్టల్ ఈ చిత్రంలో మురళీధరన్ పాత్ర చేస్తున్నారు. ముత్తయ్య భార్య మదిమలర్ పాత్రను మహిమా నంబియార్ చేస్తున్నారు. ‘‘మురళీధరన్ జీవితంలోని పలు కోణాలను ఈ చిత్రంతో వెండితెరపై ఆవిష్కరించనున్నాం. 800 వికెట్లు తీసిన ఏకైక ఆఫ్ స్పిన్ బౌలర్‌గా మురళీధరన్ పేరిట రికార్డు ఉంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ► భారత ప్రముఖ మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా రూపొందిన వెబ్ మూవీ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’. ఇందులో జులన్ గోస్వామిగా అనుష్కా శర్మ నటించారు. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. పశ్చిమ బెంగాల్ చక్దా ప్రాంతానికి చెందిన జులన్ గోస్వామి దాదాపు రెండు దశాబ్దాలు మహిళా క్రికెటర్‌గా, కెప్టెన్‌గా సక్సెస్ఫుల్ కెరీర్‌ను లీడ్ చేశారు. ఉమెన్స్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా జులన్ రికార్డు సాధించారు. ► యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ సైతం క్రికెట్ బ్యాట్ పట్టారు. ‘మిస్టర్ అండ్ మిస్ట్రస్ మహి’ సినిమాలో జాన్వీ కపూర్ క్రికెటర్‌గా నటిస్తున్నారు. రాజ్‌కుమార్ రావ్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. రియల్ క్రికెటర్స్ దగ్గర శిక్షణ తీసుకుని జాన్వీ కపూర్ ఈ సినిమా చేశారు. వీరితోపాటు మరికొందరు క్రికెటర్ల బయోపిక్‌లు, క్రికెట్ ఆధారంగా సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. -
ముంబై జట్టు హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
డబ్ల్యూపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ తమ జట్టు హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్‌ను ఎంపిక చేసింది. . 2017లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 43 ఏళ్ల చార్లెట్‌కు కోచింగ్‌లో విశేష అనుభవం ఉంది. మూడు ఫార్మాట్లలో కలిపి 309 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన చార్లెట్ 10,273 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్లో సదరన్ వైపర్స్ జట్టుకు, సదరన్ బ్రేవ్ (హండ్రెడ్ టోర్నీ) జట్టుకు, ఆస్ట్రేలియాలో మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ జట్టు హెడ్ కోచ్‌గా పనిచేసిన చార్లెట్ అమెరికా క్రికెట్ జట్టుకు కూడా కొంతకాలం శిక్షణ అందించారు. మరోవైపు డబ్ల్యూపీఎల్ వేలం కార్యక్రమం ఈనెల 13న ముంబైలో జరుగుతుంది. ఒక్కో జట్టు కనిష్టంగా 15 మందిని గరిష్టంగా 18 మంది క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు వీలుంది. ఒక్కో జట్టు వేలంలో రూ. 12 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా భారత బౌలింగ్ దిగ్గజం జులన్ గోస్వామిని తమ జట్టు మెంటార్, బౌలింగ్ కోచ్‌గా ముంబై నియమించుకుంది. మరోవైపు భారత మాజీ ఆల్‌రౌండర్ దేవిక పల్షికార్‌ను బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. చదవండి: టాపార్డరే కీలకం: మిథాలీ -
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో జత కట్టనున్న టీమిండియా దిగ్గజం
టీమిండియా దిగ్గజ బౌలర్, భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ పేసర్ ఝులన్ గోస్వామి మహిళల ఐపీఎల్ (WPL)లో కాలు మోపనుంది. గతేడాది క్రికెట్లోకి అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న ఝులన్.. WPLలో ముంబై ఫ్రాంచైజీ మెంటార్‌గా, బౌలింగ్ కోచ్‌గా నియమితురాలైంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం ఆదివారం (ఫిబ్రవరి 5) అధికారికంగా ప్రకటించింది. ముంబై యాజమాన్యం ఝులన్‌తో పాటు మరో ముగ్గురిని కూడా కోచింగ్, ఇతరత్రా సిబ్బందిలో చేర్చుకుంది. చార్లెట్ ఎడ్వర్డ్స్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకున్న ముంబై ఫ్రాంచైజీ.. భారత మహిళల జట్టు మాజీ ఆల్‌రౌండర్ దేవిక పల్షికార్‌ను బ్యాటింగ్ కోచ్‌గా, భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ మేనేజర్ తృప్తి భట్టాచార్యను టీమ్ మేనేజర్‌గా అపాయింట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్ మహిళల టీమ్ చార్లెట్ నేతృత్వంలో, ఝులన్ మెంటార్షిప్లో, దేవిక బ్యాటింగ్ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవుతూ ముంబై ఇండియన్స్ మెన్స్ టీమ్ లెగసీని కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, 43 ఏళ్ల చార్లెట్ ఎడ్వర్డ్స్ ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా దాదాపు రెండు దశాబ్దాల పాటు సేవలందించారు. రిటైర్మెంట్ తర్వాత ఆమె ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో పలు జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. 2022లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్‌గా ఎంపికైన ఎడ్వర్డ్స్ మహిళల బిగ్‌బాష్ లీగ్ (ఆస్ట్రేలియా), ద హండ్రెడ్ (ఇంగ్లండ్) లీగ్‌ల్లో వివిధ జట్లకు కోచ్‌గా పని చేశారు. ఝులన్ విషయానికొస్తే.. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక వికెట్ల ఘనత ఈమె పేరిటే ఉంది. మూడు ఫార్మాట్లలో కలిపి ఆమె ఖాతాలో 350కి పైగా వికెట్లున్నాయి. గతేడాది ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత ఝులన్ ఆట నుంచి తప్పుకుంది. మరోవైపు, WPLలో అదానీ ఫ్రాంచైజీ గుజరాత్ కూడా కోచింగ్ సిబ్బందిని నియమించుకుంది. ఆ ఫ్రాంచైజీ రేచల్ హేన్స్‌ను హెడ్ కోచ్‌గా.. ఇటీవల అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టు హెడ్ కోచ్ నూషిన్ అల్ ఖాదిర్‌ను బౌలింగ్ కోచ్.. తుషార్ అరోథ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా.. గవన్ ట్వినింగ్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేసుకుంది. -
చక్దా ఎక్స్‌ప్రెస్.. క్రికెటర్‌తో కేక్ కట్ చేసిన అనుష్క శర్మ (ఫొటోలు)
-
చక్దా ఎక్స్‌ప్రెస్.. స్పెషల్ స్టోరీ ఆన్ ఇండియన్ టైగ్రెస్ ఝులన్ గోస్వామి
కళ్లల్లో లక్ష్యం.. పరుగులో వేగం.. వెరసి స్టేడియంలో మెరుపు.. పిచ్‌లో స్టంప్ అవుట్స్! ఆ టైగ్రెస్ పేరు ఝులన్ గోస్వామి! ఆమె ఉంటే సొంత జట్టుకి ఉత్సాహం.. ప్రత్యర్థి జట్టుకి ఇరకాటం! విమెన్ క్రికెట్‌కు ఆమె ఓ సిగ్నేచర్! 2022 సెప్టెంబర్ 24.. లండన్‌లోని లార్డ్స్ స్టేడియం.. 39 ఏళ్ల లెజండరీ క్రికెటర్ ఝులన్ గోస్వామి రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ సమయం! టాస్ వేయాల్సిందిగా ఆమెనే పిలిచింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కన్నీళ్లతో. ఆ మ్యాచ్‌లో ఝులన్ తన కెరీర్లోనే ఆఖరి బాల్ వేస్తున్నప్పుడు టీమ్‌తో పాటు ప్రేక్షకుల మనసూ బరువెక్కింది. మ్యాచ్ అయిపోయాక ఇంగ్లండ్ టీమ్.. ఇండియా టీమ్ ఆమెకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. క్రికెటే జీవితంగా భావించిన ఝులన్‌కు అది కోరుకున్న నిష్క్రమణే అయినా.. తన శరీరం నుంచి హృదయాన్ని వేరు చేస్తున్న వేదన.. ఆమె బౌలింగ్ అంత వేగంగా పొట్టలోంచి ఉబికి వస్తున్న దుఃఖం కన్నీళ్లుగా కారకుండా కష్టంగా ఆపుకొంది! తన ఎడబాటుతో ఝులన్‌ను అంత వేదనకు గురిచేసిన ఆ ఆట ఆమెకు పరిచయమై ఆసక్తి కలిగిన సందర్భం.. 1992.. వరల్డ్ కప్! ఝులన్ వాళ్ల అన్న, కజిన్స్ క్రికెట్‌కు పెద్ద ఫ్యాన్స్. దాంతో టీవీలో వస్తున్న 1992 వరల్డ్ కప్ మ్యాచెస్‌ను ఉత్కంఠతో చూస్తున్నారు. వాళ్లతోపాటు పదేళ్ల ఝులన్ కూడా చూడాల్సి వచ్చింది అనివార్యంగా. అప్పటిదాకా ఆమె దృష్టిలో ఆటంటే ఫుట్‌బాలే. కానీ ఆ వరల్డ్ కప్ ఆమె దృష్టిని మార్చేసింది. క్రికెట్ మీదకు మళ్లించింది. ఆసక్తిని కలిగించింది. నాటినుంచి గల్లీలో అబ్బాయిలతో కలసి ఆడడం స్టార్ట్ చేసింది. బౌలింగ్ అంటే ఇష్టం. కానీ స్లోగా చేసేది. దాంతో అబ్బాయిలంతా ఆమెను గేలి చేసేవాళ్లు. ఆ హేళన ఆమెలో కసిని పెంచింది.. ఎంతలా అంటే బౌలింగ్ వేగం గంటకు 120 కిలోమీటర్లకు చేరి వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఆమెను నిలబెట్టేంతగా! క్రికెటే లక్ష్యంగా మారిన సమయం.. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్.. 1997మహిళా క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతోంది. ఆ స్టేడియంలో ఝులన్ బాల్ గర్ల్. అమ్మాయిలు క్రికెట్ ఆడుతుంటే చూడటం అదే తొలిసారి. బెలిండా క్లార్క్ ఆట ఆమెను కట్టిపడేసింది.. క్రికెట్‌ను ప్రేమించేలా చేసింది. అంతే అప్పటికప్పుడు ఝులన్ నిర్ణయించేసుకుంది ఏది ఏమైనా తాను కూడా భారతదేశం తరపున ఆడాలని! కానీ తనుంటున్న చక్దా పల్లెటూరు. బడి అంటే ఓకే కానీ ఆటలను నేర్పించేంత సౌకర్యాలు తన ఊళ్లో లేవు. శిక్షణ కోసం కోల్‌కతా వెళ్లాల్సిందే. ఝులన్ నోటి వెంట ఆ మాట వినడమే ఆలస్యం ‘వద్దు’ అని చెప్పేశారు అమ్మా, నాన్న ముక్త కంఠంతో. ఆడపిల్లకు చదువుతో పాటు ఆట, పాట ఉండాలి అంటే ఏకంగా క్రికెట్‌కే గురి పెడతావా? పెళ్లికావాల్సిన పిల్లవి.. రేప్పొద్దున ఏదన్నా తేడా జరిగితే పెళ్లి అవుతుందా? అంటూ ఆందోళనా వ్యక్తం చేశారు. కాని దేశానికి స్వాతంత్య్రం సిద్ధించకముందు పుట్టిన ఝులన్ నానమ్మకు తెలుసు ఆడపిల్లకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు ఎంత అవసరమో! అందుకే ‘ఆడపిల్లలు అన్నిట్లో ముందుండాలి. దేనికీ అధైర్యపడొద్దు. నచ్చిన పని చేయాలి’ అంటూ ఝులన్‌ను ప్రోత్సహించింది. ‘నాకు రెండేళ్లు టైమ్ ఇవ్వండి.. క్రికెట్లో ఝులన్‌ను స్టార్‌ను చేస్తా’ అంటూ కోచ్ స్వపన్ సాధు కూడా ఆమె కుటుంబాన్ని ఒప్పించాడు. ‘ఎంతో మంది ఆడ పిల్లలకు శిక్షణ నిచ్చా.. కాని నీలాగా హై ఆర్మ్ బౌలింగ్ చేసేవాళ్లను చూడలేదు. ఇంత టాలెంట్‌ని వృథా పోనివ్వను. క్రికెట్‌కే నిన్ను ఓ అసెట్‌లా తీర్చిదిద్దుతా’ అంటూ కోచ్‌గానే కాదు గైడ్, ఫిలాసఫర్‌గా ఆమెకు అండగా నిలిచాడు స్వపన్ సాధు. అలా ఝులన్ తన క్రికెట్ కలను నేరవేర్చుకోవడానికి.. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కోల్‌కతా ప్రయాణమైంది. 2007– 08 నుంచి ఆటగాళ్లకి ర్యాంకింగ్ సిస్టమ్ మొదలైంది. బౌలర్లలో ఝులన్ది నంబర్ వన్ ర్యాంక్. ఐసీసీ ఆమెకు గోల్డెన్ ఆర్మ్ బ్యాండ్‌ను బహుకరించింది. అలా కోచ్ ఊహించినట్టుగానే క్రికెట్ స్టార్ అయింది. ఓ ‘అద్భుతం’గా రికార్డ్ అయింది! ‘ప్రతిరోజూ ఉదయం ఏడున్నర కల్లా గ్రౌండ్లో ఉండాల్సిందే. లేకపోతే ఆరోజు ఆడనిచ్చేవాడు కాదు కోచ్. అందుకే పొద్దున్నే ఐదింటికల్లా సీల్దా నుంచి బాలిగంజ్ ట్రైన్లో బయలుదేరేదాన్ని. అందులో అందరూ స్పోర్ట్స్పర్సన్సే ఉండేవారు. అబ్బాయిలు, అమ్మాయిలం ఒక గ్రూప్‌గా బోల్డు కబుర్లు చెప్పుకుంటూ వెళ్లేవాళ్లం. పొరపాటున ట్రైన్ మిస్ అయితే జీవితంలో ఒకరోజు కోల్పోయిన ఫీల్ ఉండేది. ఏమైనా అవి బంగారు రోజులు’ అంటూ తన కోచింగ్ రోజులను గుర్తు చేసుకుంటుంది ఝులన్. ‘మా ఆటకు స్టేడియం ఖాళీగా ఉంటుంది. జనం కొట్టే జేజేలు, కేరింతలు లేకున్నా మా ఉత్సాహం ఏ మాత్రం తగ్గదు. నాకైతే ఎదురుగా బ్యాట్‌తో సిద్ధంగా ఉన్న ప్రత్యర్థి, స్టంప్స్ మాత్రమే కనిపించేవి. ప్రత్యర్థిని ఎలా ఔట్ చేయాలన్న ఏకైక లక్ష్యంతో దూసుకుపోయేదాన్ని’ అంటూ తన ఆట తీరును నెమరువేసుకుంటుంది ఝులన్. రిటైర్మెంట్ తర్వాత.. మ్యాచెస్లేని రోజులను ఊహించడం కష్టమే అయినా క్రికెట్ వల్ల వాయిదా పడ్డ పనులెన్నిటినో చేసుకోవడానికి కావల్సినంత సమయం దొరికింది అని తన మనసుకు నచ్చజెప్పుకుంటోంది ఝులన్. ‘ఇప్పుడిక దేనికీ ఏ రోక్టోక్ (ఆటంకం) లేదు. బిందాస్‌గా స్ట్రీట్ ఫుడ్ తింటా.. చక్కగా దుర్గా పూజను ఆస్వాదిస్తా’నంటూ తనేం చేయాలను కుందో చెప్పు కొచ్చింది. ‘2009 ప్రపంచ కప్ తర్వాత రిటైర్ అయిపోవాలి అనుకున్నా. ఇప్పటికి ఆ నిర్ణయం తీసుకోగలిగా. ఇండియా జెర్సీ వేసుకుని గ్రౌండ్లోకి వెళ్లడం, బౌలింగ్ చేయడం, నేషనల్ యాంథమ్ పాడటం వంటి అనుభూతులన్నిటినీ మిస్ అవుతాను’ అంటూ రిటైర్మెంట్ మిగిల్చే లోటునూ పంచుకుంది. ‘నా తొలి టెస్ట్ మ్యాచ్, తొలి వన్ డే మ్యాచ్, టీ20 డెబ్యూ కూడా ఇంగ్లండ్‌తోనే. చిత్రమేంటంటే నా ఆఖరి మ్యాచ్ కూడా ఇంగ్లండ్‌తోనే. బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలించిన చరిత్ర వింటూ పెరిగినందువల్లో ఏమో ఇంగ్లండ్ అంటే నాకు కోపం. ఆ సంగతి మా కెప్టెన్‌కీ తెలుసు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ అప్పుడు ‘నీ కసికొద్దీ బాల్ని కొట్టిరా’ అంటూ బౌలింగ్‌కు పంపించేది’ అని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది ఝులన్. గ్రాఫ్ అండ్ గ్రేస్ 2007–ఐసిసి విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా గౌరవం పొందింది. (2008–2011)–విమెన్స్ క్రికెట్ కెప్టెన్ 204 మ్యాచుల్లో 255 వికెట్లతో అత్యధికంగా వికెట్లు తీసుకున్న ప్లేయర్‌గా నిలిచింది. 2010–అర్జున, 2012–పద్మశ్రీ అవార్డులను అందుకుంది. అనుష్క శర్మ నటిస్తున్న ఝులన్ బయోపిక్ చక్దా ఎక్స్‌ప్రెస్ నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతోంది. ఆటకు అన్యాయం చేస్తానేమో అనే భయంతో పెళ్లి కూడా వద్దనుకుంది. కొన్ని ఫ్యాషన్ షోల్లోనూ పాల్గొంది. ఝులన్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది ప్రభుత్వం. జె.. పాజీ.. బాబుల్ టీమ్‌లో నేనే వరస్ట్ డాన్సర్‌నని ఆట పట్టిస్తారంతా. నేను క్రికెటర్ని మరి.. డాన్సర్‌ని కాదుగా! టీమ్‌లో అల్లరిపిల్ల అంటే వేద. ఝులన్ దీదీ.. ఝులన్ దీ.. ఝులన్ నుంచి ఇప్పుడు జె అని పిలిచేవరకు వచ్చింది ఆ పిల్ల తీరు. ‘నా పేరుమొత్తం కట్ చేసేశావ్, నన్ను టీమ్ నుంచి బయటకు మాత్రం పంపకు’ అని జోక్ చేసేదాన్ని. హర్మన్ పూర్తిగా పంజాబీ యాక్సెంట్లోనే మాట్లాడుతుంటుంది. నాకొచ్చిన ఒకేఒక్క పంజాబీ పదం పాజీ. నేను తనని పాజీ అనేదాన్ని. అలా తను నాకు పాజీ అని పేరు పెట్టేసింది. చాలామంది బాబుల్ అని కూడా పిలుస్తారు. ఝులన్ గురించి మిథాలి.. ‘నాకు ఝులన్ అండర్ 19లో రాయ్ బరేలీలో ఆడినప్పటి నుంచి తెలుసు. అప్పుడు గ్రౌండ్ వెనుక ఉన్న హాస్టల్లో మాకు బస. నా గది కిటికీ నుంచి ఝులన్‌ను మొదటిసారి చూశా. బోరింగ్ పంప్ కొట్టి బకెట్లో నీళ్లు నింపి అక్కడే కూర్చుని బ్రష్ చేసుకుంటోంది. తన మొదటి బంతి క్యాచ్ చేయడం కూడా నాకు గుర్తు. చాలా కష్టపడి ఆడే అమ్మాయి. ప్రాక్టీస్ టైమ్‌లో కూడా తనతో పోటీ పడటం కష్టమే. ఎవరిలో లేని లక్షణం ఒకటి ఆమెలో ఉంది. మేం ఆటలో ఓడుతున్నా, గెలుస్తున్నా ఝులన్ ఏదో ఒక కార్నర్లో ఉండి టీమ్‌ని ఎంకరేజ్ చేస్తూ కనిపిస్తుంటుంది.’ గెలిచే వరకు.. పద్దెనిమిదేళ్ల పాటు నేను, మిథాలీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. వరల్డ్ కప్ గెలవలేకపోయాం. మన విమెన్ టీమ్ ప్రపంచ కప్ గెలవాలి. విమెన్ టీం ప్రపంచ కప్ గెలిస్తే చాలు. గెలిచే వరకు ఆ కలను కంటూనే ఉంటాను. -
Asia Cup 2022: తల్లి అంపైర్.. కూతురు ఆల్‌రౌండర్.. ఇద్దరూ ఒకేసారి!
అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికితే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదని అంటుంటారు. నలుగురికీ భిన్నంగా ఎంచుకున్న రంగంలో అనుకున్న లక్ష్యాలు చేరాలంటే కచ్చితంగా కుటుంబం.. ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ ప్రోత్సాహం ఉంటేనే సాధ్యమవుతుంది. భార్యైనా.. భర్తైనా పరస్పరం సహకరించుకుంటేనే ఇటు వ్యక్తిగత.. అటు వృత్తిగత జీవితం బాగుంటుంది. పాకిస్తాన్‌కు చెందిన తల్లీకూతుళ్లు సలీమా ఇంతియాజ్, కైనత్ ఇంతియాజ్‌కు ఇలాంటి భాగస్వాములే దొరికారు. భర్త ఖవాజా ఇంతియాజ్ ప్రోత్సాహంతో సలీమా అంపైర్‌గా ఎదగగా.. క్రికెటర్ కావాలన్న తమ కూతురు కైనత్ తన కలను నిజం చేసుకోవడంతో సహాయపడ్డారు ఈ దంపతులు. ఇక తండ్రిలాగే భర్త వకార్ సైతం తనకు అండగా నిలుస్తూ ఉండటంతో కైనత్ పాకిస్తాన్ ఆల్‌రౌండర్‌గా ఎదిగింది. విశేషమేమిటంటే.. ఈ తల్లీకూతుళ్లు ఇద్దరూ ఇప్పుడు ఆసియా కప్-2022 వంటి మెగా టోర్నీలో తమ వంతు బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. 41 ఏళ్ల వయసులో కల సాకారం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా భారత్- శ్రీలంక మ్యాచ్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్‌గా అరంగేట్రం చేసింది సలీమా. మరోవైపు సలీమా కూతురు కైనత్ పాకిస్తాన్ మహిళా జట్టులో సభ్యురాలిగా ఉంది. ఇలా ఇద్దరూ ఒకేసారి ప్రతిష్టాత్మక ఈవెంట్లో భాగం కావడంతో ఇంతియాజ్ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. భర్తతో కైనత్(PC: Kainat Imtiaz Instagram) నాకు గర్వకారణం.. కైనత్ భావోద్వేగం ముఖ్యంగా 41 ఏళ్ల వయసులో తన తల్లి అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదుర్కొన్న అనుభవాలు గుర్తుచేసుకుంటూ కైనత్ ఉద్వేగానికి లోనైంది.ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా భావోద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. ‘‘ఏసీసీ ఆసియా కప్ -2022లో అంపైర్‌గా మా మామ్! మా అమ్మ సాధించిన విజయం పట్ల నాకెంతో గర్వంగా ఉంది. పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాలన్న ఆమె కల, ఆమెతో పాటు నా కల కూడా నేడు నెరవేరింది. మేమిద్దరం మా దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఆ భగవంతుడి దయ. మా అమ్మ ఈ స్థాయికి చేరుకోవడంలో అడుగడుగునా అండగా నిలబడ్డ మా నాన్నకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు. మమ్మల్ని ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. నిరాశతో మేము వెనుదిరగకుండా నిరంతరం స్ఫూర్తి నింపుతూనే ఉంటారు. మా లోపాలు సరిదిద్దే క్రమంలో తనే మొదటి క్రిటిక్. వీళ్లందరూ మా జీవితాల్లో ఉండటం వల్లే ఆయన నా తండ్రి కావడం నిజంగా నా అదృష్టం. ఈ ప్రపంచంలో అందరికంటే నేనే అదృష్టవంతురాలిని అనిపిస్తోంది. అలాగే నా సోదరుడు.. మా నాన్నలానే నన్ను ప్రోత్సహించే భర్త.. వీళ్లందరూ నా జీవితంలో ఉండటం.. నా అదృష్టం’’ అంటూ కైనత్ ఉద్వేగానికి లోనైంది. ఆమె పోస్టుకు స్పందించిన నెటిజన్లు.. సలీమా, కైనత్‌లకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అదే విధంగా పాకిస్తాన్ వంటి దేశంలో కట్టుబాట్లను దాటుకుని వారు ఎదిగేలా ప్రోత్సహించిన కైనత్ తండ్రిని ప్రశంసిస్తున్నారు. కాగా కైనత్ తండ్రి ఖవాజా స్పో టీచర్‌గా పనిచేశాడు. ఇక పాక్ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన కైనత్.. భారత మహిళా పేసర్ ఝులన్ గోస్వామి తనకు స్ఫూర్తి అంటూ 2017 వరల్డ్‌కప్ సందర్భంగా తన మనసులోని మాట వెల్లడించింది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్-2022లో ఆడిన పాకిస్తాన్ జట్టులో చోటుదక్కించుకున్న కైనత్.. ఆసియా కప్-2022 టీ20 టోర్నీకి ఎంపికైన జట్టులో స్థానం సంపాదించుకుంది. చదవండి: RSWS 2022 Final: శ్రీలంకను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడిన ఇండియా లెజెండ్స్.. వరుసగా రెండోసారి National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. View this post on Instagram A post shared by Kainat Waqar (@kainatimtiaz23) -
జులన్... ఐదో ర్యాంక్‌తో ముగింపు
గతవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మహిళల జట్టు పేస్ బౌలర్ జులన్ గోస్వామి తన కెరీర్‌ను ఐదో ర్యాంక్‌తో ముగించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో 39 ఏళ్ల జులన్ బౌలర్ల విభాగంలో 698 పాయింట్లతో తన ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఐదో ర్యాంక్‌లో... స్మృతి మంధాన ఆరో ర్యాంక్‌లో నిలిచారు. -
సిరీస్ క్లీన్‌స్వీప్.. పీపీఈ కిట్లతో క్రికెటర్ల క్యాట్‌వాక్
టీమిండియా మహిళల జట్టు ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి 3-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో తన చివరి మ్యాచ్ ఆడిన జులన్ గోస్వామికి హర్మన్‌ప్రీత్ సేన సిరీస్ విజయాన్ని కానుకగా అందించింది. ఇక వచ్చే వన్డే వరల్డ్‌కప్ 2023 వరకు టీమిండియా ఉమెన్స్‌కు మరో వన్డే సిరీస్ లేదు. ఈ నేపథ్యంలో స్వదేశానికి తిరుగుపయనమైన టీమిండియా మహిళా క్రికెటర్లు ఎయిర్‌పోర్టులో పీపీఈ కిట్లతో క్యాట్‌వాక్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని భారత మహిళా క్రికెటర్ జేమిమా రోడ్రిగ్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఈ వీడియోలో జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు జులన్ గోస్వామి, హర్లిన్ డియోల్ సహా ఇతర క్రికెటర్లు.. ఫ్యాషన్ మోడల్స్‌ను అనుకరిస్తూ ఎయిర్‌పోర్ట్‌లో క్యాట్‌వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక స్వదేశానికి చేరుకున్న టీమిండియా మహిళా క్రికెటర్లకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా జులన్ గోస్వామి, ఆల్‌రౌండర్ దీప్తి శర్మలకు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కాగా ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో ఆఖర్లో దీప్తిశర్మ.. ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్‌ను మన్కడింగ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీప్తి శర్త తాను చేసింది కరెక్టేనని చెప్పింది. ‘రనౌట్ విషయంలో మేం వ్యూహంతో సిద్ధమయ్యాం. మేం ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె మళ్లీ మళ్లీ క్రీజ్ దాటి ముందుకు వెళ్లింది.ఆ విషయాన్ని అంపైర్లకు కూడా చెప్పాం. అయినా ఆమె తీరు మార్చుకోలేదు. దాంతో నిబంధనల ప్రకారమే అవుట్ చేశాం. మేం ఇంకేం చేయగలం’ అని వివరణ ఇచ్చింది. i've never loved a team more😭 from @JemiRodrigues Instagram post pic.twitter.com/qE5ZsgXFeB — s (@_sectumsempra18) September 26, 2022 చదవండి: ఒక శకం ముగిసింది.. బాల్‌గర్ల్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా ఇన్నింగ్స్ చివర్లో హైడ్రామా.. 'మరో అశ్విన్'లా కనబడింది -
ఈడెన్ గార్డెన్స్ స్టాండ్‌కు ఝులన్ గోస్వామి పేరు!
భారత సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో తన అఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. కాగా భారత జట్టు ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్‌కు క్లీన్ స్వీప్ చేసి జూలన్కు ఘనమైన విడ్కోలు ఇచ్చారు. తన అఖరి మ్యాచ్‌లో గో స్వామి రెండు వికెట్లు పడగొట్టింది. దీంతో 355 వికెట్లతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఝులన్ తన కెరీర్‌ను ముగించింది. కాగా పశ్చిమబెంగాల్‌కు చెందిన జులన్ 2002లో ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేయగా.. ఇప్పడు అదే ఇంగ్లీష్ జట్టుపై తన కెరీర్‌ను ముగించడం గమానార్హం. ఇక ఇది ఇలా ఉండగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఒక స్టాండ్‌కు ఝులన్ పేరును పెట్టి ఆమెను గౌరవించాలని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ యోచిస్తోంది. "మేము ఈడెన్ గార్డెన్స్‌లో ఒక స్టాండ్‌కు ఝులన్ గోస్వామి పేరు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. ఆమె ఒక లెజెండరీ క్రికెటర్. కాబట్టి దిగ్గజ క్రికెటర్లతో పాటుగా ఆమె కూడా పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఉండాలి అనుకుంటున్నాము. అదే విధంగా ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించాలని భావిస్తున్నాము" అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు. చదవండి: Jhulan Goswami: ఒక శకం ముగిసింది.. బాల్‌గర్ల్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా -
ఒక శకం ముగిసింది.. బాల్‌గర్ల్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా
భారత మహిళా క్రికెట్లో ఒక శకం ముగిసింది. మిథాలీరాజ్ తర్వాత భారత మహిళా క్రికెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రికెటర్‌గా జులన్ గోస్వామి గుర్తింపు పొందింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత మహిళల జట్టు పేస్ బౌలింగ్ విభాగాన్ని తన భుజాలపై మోసింది. జనవరి 6, 2002లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన జులన్ గోస్వామి.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఇంగ్లండ్‌పై తన చివరి మ్యాచ్ ఆడడం విశేషం. క్రికెటర్‌గా ఎన్నో రికార్డులు అందుకున్న ఆమె జీవితం ఇప్పటి యువతరానికి ఒక ఆదర్శం పశ్చిమబెంగాలోని నదియా జిల్లా చక్డా.. జులన్ సొంత గ్రామం. చక్డా నుంచి కోల్‌కతాకు 80 కిలోమీటర్ల దూరం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన జులన్‌కు బెంగాల్ లో అందరి మాదిరే ఫుట్‌బాల్ అంటే ఇష్టం. కానీ టీవీలలో వచ్చే క్రికెట్ మ్యాచ్‌లను చూసి ఆమె దృష్టి బంతి మీద పడింది. చిన్నప్పటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి పెంచుకున్న జులన్.. చిన్నప్పుడు స్కూల్లో, తన ఉరిలో అబ్బాయిలతోనే క్రికెట్ ఆడేది. అప్పటికీ అమ్మాయిల క్రికెట్‌కు ఇప్పుడున్నంత ఆదరణ కూడా లేదు. ‘ఆడపిల్లలకు ఆటలెందుకు.. అది కూడా క్రికెట్. అవసరమా..?’ అని అవమానించినప్పటికి క్రికెట్ ఆడాలనే తన పట్టుదలను మాత్రం విడవలేదు. బాల్‌గర్ల్ నుంచి క్రికెటర్ దాకా అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న ఆమె కోరిక బలంగా నాటుకుపోయింది 1997లో. ఆ ఏడాది కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మహిళల మధ్య వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో జులన్ గోస్వామి బాల్ గర్ల్‌గా పనిచేసింది. ఆ మ్యాచ్ చూసిన జులన్.. 'భారత్ తరఫున కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాలి. ఒక్క వికెట్ అయినా తీయాలి..' అని మనసులో నిశ్చయించుకుంది. అప్పుడు ఆమె వయసు 15 ఏండ్లు. అయితే ఆమె నివసిస్తున్న చక్డాలో, నదియాలో క్రికెట్ అకాడమీలు లేవు. క్రికెట్ కోచింగ్ తీసుకోవాలంటే 80 కిమీ ఆవల ఉన్న కోల్‌కతాకు వెళ్లాల్సిందే. అందుకోసం రోజూ ఉదయం 5 గంటలకు చక్డాలో ట్రైన్ ఎక్కి సీల్దాలో ప్రాక్టీస్ కోసం వచ్చేది. 19 ఏండ్ల వయసులో జులన్ గోస్వామి 2002 జనవరి 14న చెన్నైలో ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్ ఆడింది. అప్పటికింకా బీసీసీఐ మహిళా విభాగం లేకపోవడంతో అప్పుడు భారత మహిళల జట్టు ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ (డబ్ల్యూసీఎఐ) కింద ఆడారు. అప్పట్లో భారత పురుషుల క్రికెట్ కు ఉన్న ఆదరణ మహిళా క్రికెట్ కు లేదు. ఏదో ఒక జట్టు ఉందా..? అంటే ఉన్నదన్నట్టుగానే ఉమెన్ క్రికెట్ టీమ్ ఉండేది. బీసీసీఐ కూడా మహిళా క్రికెట్ మీద అంత ఆసక్తి చూపలేదు. దీంతో పురుష క్రికెటర్లు అనుభవించిన లగ్జరీలు మహిళా క్రికెటర్లకు దక్కలేదు. భారత్ లో మ్యాచ్ లు ఆడేందుకు జులన్.. సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్స్ లలో ప్రయాణించేది. డార్మెటరీలలో అతి సాధారణ వాష్ రూమ్ లు ఉన్నచోట కూడా సర్దుబాటు అయింది. కనీసం మ్యాచ్‌లలో అమ్మాయిలకు ప్రత్యేక జెర్సీలు కూడా లేని రోజులనూ చూసింది జులన్. లెక్కకు మించి రికార్డులు భారత జట్టు తరఫున ఆడుతూ ఒక్క వికెట్ తీసినా చాలు అని కలలు కన్న జులన్ గోస్వామి.. తన కెరీర్ లో ఇన్ని ఘనతలు సాధిస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఇప్పటికీ జులన్ పేరిటే ఉంది. తన సుదీర్ఘ కెరీర్ లో మొత్తం 353 వికెట్లు పడగొట్టింది. ప్రపంచ క్రికెట్ (మహిళల) లో మరే బౌలర్ ఇన్ని వికెట్లు తీయలేదు. ముఖ్యంగా వన్డేలలో ఆమె రికార్డులు చేరుకునే బౌలర్ అయితే దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. జులన్ తన కెరీర్ లో 12 టెస్టులలో 44 వికెట్లు, 203 వన్డేలలో 253 వికెట్లు, 68 టీ20లలో 56 వికెట్లు తీసింది. జులన్ సాధించిన రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. ►వన్డేలలో 200, 250 వికెట్లు తీసుకున్న తొలి మహిళా బౌలర్. ►జులన్ బౌలరే కాదు.. మంచి బ్యాటర్ కూడా. వన్డేలలో ఆమె 1,228 పరుగులు చేసింది. వన్డే ఫార్మాట్ లో వెయ్యికి పైగా పరుగులు, వంద వికెట్లు సాధించిన భారత క్రికెటర్. ►మహిళల ప్రపంచకప్ (34 మ్యాచ్ లు) లో అత్యధిక వికెట్లు : 43 ►ఉమెన్స్ క్రికెట్ లో మిథాలీ రాజ్ (22 ఏండ్ల 274 రోజులు) తర్వాత అత్యధిక కెరీర్ కలిగిన (20 ఏండ్ల 260 రోజులు) రెండో క్రికెటర్. ►అత్యధిక క్యాచ్ లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానం. తన కెరీర్ లో ఆమె 68 క్యాచ్ లు అందుకుంది. న్యూజిలాండ్ కు చెందిన సూజీ బేట్స్ 78 క్యాచ్ లు పట్టింది. ►2006 లో ఇంగ్లాండ్ లో ఆడుతూ ఒక టెస్టులో పది వికెట్ల (78-10) ప్రదర్శన చేసిన ఏకైక భారత బౌలర్. A long list of special performances 📝 Some of Jhulan Goswami's finest moments in international cricket 👇 https://t.co/Mb2eBIYS1N — ICC (@ICC) September 24, 2022 చదవండి: 'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరించిన గోస్వామి.. జులన్‌కు క్లీన్‌స్వీప్ కానుక -
జులన్‌కు క్లీన్‌స్వీప్ కానుక
లండన్: అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి కెరీర్ విజయంతో ముగిసింది. ఇంగ్లండ్ జట్టుతో శనివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా 16 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 3–0తో నెగ్గి కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన 39 ఏళ్ల జులన్ గోస్వామికి క్లీన్‌స్వీప్ కానుకగా ఇచ్చింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 45.4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన (50; 5 ఫోర్లు), దీప్తి శర్మ (68 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను స్మృతి, దీప్తి శర్మ ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు వీరిద్దరు 58 పరుగులు జత చేశారు. స్మృతి అవుటయ్యాక ఒకవైపు వికెట్లు పడుతుంటే మరోవైపు దీప్తి పట్టుదలతో ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో కేటీ క్రాస్ (4/26), ఫ్రేయా కెంప్ (2/24), ఎకిల్‌స్టోన్ (2/27) రాణించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన జులన్ గోస్వామి బ్యాటింగ్‌లో ‘డకౌట్’కాగా... బౌలింగ్‌లో 10 ఓవర్లలో మూడు మెయిడెన్లు వేసి 30 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (4/29), స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ (2/38) కూడా ఇంగ్లండ్‌ను దెబ్బ తీశారు. మొత్తం 340 పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. 355: జులన్ గోస్వామి మూడు ఫార్మాట్లలో కలిపి తీసిన వికెట్ల సంఖ్య. జులన్ 12 టెస్టుల్లో 44 వికెట్లు... 204 వన్డేల్లో 255 వికెట్లు... 68 టి20ల్లో 56 వికెట్లు పడగొట్టింది. 7: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం భారత జట్టుకిది ఏడోసారి (బంగ్లాదేశ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లపై ఒకసారి... శ్రీలంకపై మూడుసార్లు). ఇంగ్లండ్‌పై తొలిసారి. -
'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరించిన గోస్వామి..
లార్డ్స్ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలో ఇంగ్లండ్ మహిళలతో భారత జట్టు తలపడుతోంది. కాగా భారత మహిళా జట్టు వెటరన్ పేసర్ జులాన్ గోస్వామి తన కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ క్రికెటర్ల నుంచి జులాన్ గోస్వామి 'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరిచింది. భారత ఇన్నింగ్స్‌లో గోస్వామి బ్యాటింగ్ సమయంలో ఇంగ్లండ్ క్రికెటర్లు వరుస క్రమంలో నిలబడి ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు. దీంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఒక్క సారిగా చప్పట్లు కొడుతూ అభినందించారు. కాగా ఈ మ్యాచ్‌లో గోస్వామి తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేసింది. "20 ఏళ్లుగా ఝులన్ గోస్వామి తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఆమె వన్డే క్రికెట్లో దాదాపు 10,000 బంతులు వేసింది. ఎంతో మంది యువ క్రికెటర్లు అత్యుత్తమంగా తాయారు చేయడంలో జులాన్ కీలక పాత్ర పోషించింది. జులాన్ ఎంతో మంది క్రికెటర్లకు ఆదర్శం" అని ఇంగ్లండ్ క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. కాగా 2002లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన 40 ఏళ్ల జులన్ 201 వన్డేల్లో 253 వికెట్లు, 68 టి20ల్లో 56 వికెట్లు తీసింది. 12 టెస్టుల్లో 44 వికెట్లు కూడా పడగొట్టింది. చదవండి: Womens T20 World Cup 2023: అర్హత సాధించిన ఐర్లాండ్, బంగ్లాదేశ్ -
‘ప్రపంచకప్ గెలవకపోవడమే లోటు’
లండన్: రెండు దశాబ్దాలకు పైగా భారత మహిళా క్రికెట్ మూలస్థంభాల్లో ఒకరిగా నిలిచిన దిగ్గజ పేస్ బౌలర్ జులన్ గోస్వామి ఆటకు ముగింపు పలుకుతోంది. నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే చివరి వన్డేతో రిటైర్ కానున్న జులన్ ఆఖరిసారిగా లార్డ్స్ మైదానంలో బరిలోకి దిగనుంది. భారత్ ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకున్న నేపథ్యంలో అందరి దృష్టీ జులన్పైనే ఉంది. ఆమెకు విజయంతో ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని హర్మన్ బృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తన కెరీర్ విశేషాల గురించి జులన్ శుక్రవారం మీడియాతో మాట్లాడింది. వన్డే లేదా టి20 ప్రపంచకప్‌లలో తాము ఒకటి గెలిచి ఉంటే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించింది. ‘2005, 2017 వన్డే వరల్డ్‌కప్‌లలో మేం ఫైనల్ చేరాం. వీటిలో ఒకటి గెలిచి ఉండాల్సింది. ప్రతీ క్రికెటర్‌కి అదే లక్ష్యం ఉంటుంది. నాలుగేళ్ల పాటు ఎంతో కష్టపడి అక్కడి దాకా వచ్చాక కప్ గెలిస్తే కల నిజమయ్యేది. టి20 ప్రపంచకప్ సహా మేం మూడు ఫైనల్స్ ఆడినా ఒక్కటి గెలవలేకపోయాం. అది చాలా బాధిస్తుంది. నా కెరీర్లో అదే లోటు’ అని జులన్ చెప్పింది. గత రెండేళ్లుగా చాలా సార్లు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తూ వచ్చానని, చివరకు ఇప్పుడు తప్పుకుంటున్నానని జులన్ భావోద్వేగంతో చెప్పింది. ‘రెండేళ్లుగా ప్రతీ సిరీస్ నాకు చివరి సిరీస్‌లాగానే అనిపించేది. కోవిడ్ వల్ల మ్యాచ్‌లు వాయిదాపడుతూ రావడంతో పాటు వరుసగా గాయాలపాలయ్యాను. శ్రీలంక సిరీస్‌తోనే ముగిద్దామనుకున్నా. అయితే ఫిట్‌గా లేక ఆ సిరీస్ ఆడలేదు. దాంతో మళ్లీ ఎన్సీఏకు వెళ్లాను. రాబోయే టి20 వరల్డ్‌కప్‌కు ముందు ఇదే చివరి వన్డే సిరీస్ కాబట్టి ఆటను ముగిస్తున్నా’ అని ఈ బెంగాల్ పేసర్ పేర్కొంది. కోల్‌కతాలో 1997 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో బాల్‌బాయ్‌గా పని చేసిన తర్వాత దేశానికి ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇన్నేళ్లు కొనసాగగలనని అనుకోలేదన్న జులన్... కెరీర్లో తొలి మ్యాచే అన్నింటికంటే ప్రత్యేకమైందని గుర్తు చేసుకుంది. వచ్చే ఏడాది జరి గే తొలి మహిళల ఐపీఎల్లో పాల్గొనడం గురించి తాను ఇప్పుడే చెప్పలేనని జులన్ స్పష్టం చేసింది. -
చరిత్ర సృష్టించిన ఝులన్ గోస్వామి.. తొలి మహిళా క్రికెటర్‌గా!
ఇంగ్లండ్ మహిళలలతో వన్డే సిరీస్‌ను భారత్ విజయంతో ఆరంభించింది. హోవ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా తన కెరీర్లో చివరి సిరీస్ ఆడుతున్న భారత భారత వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఈ మ్యాచ్‌లో గోస్వామి తన 10 ఓవర్ల కోటాలో 20 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టింది. తద్వారా ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లీస్ జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా గోస్వామి రికార్డులకెక్కింది. అంతుకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ పేసర్ కేథరిన్ ఫిట్జ్‌ప్యాట్రిక్(23 వికెట్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఝులన్(24 వికెట్లు) కేథరిన్ రికార్డురు బ్రేక్ చేసింది. అదే విధంగా భారత్ తరపున వన్డేల్లో ఆడిన అతి పెద్ద వయష్కరాలుగా కూడా గోస్వామి నిలిచింది. 39 ఏళ్ల 297 రోజుల వయస్సులో ఆమె ఈ మ్యాచ్ ఆడింది. అంతకుముందు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 39 ఏళ్ల 114 రోజుల వయసులో తన చివరి వన్డే మ్యాచ్ ఆడింది. ఇక ఈ సిరీస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు గోస్వామి గుడ్‌బై చెప్పనుంది. లార్డ్స్ వేదికగా జరగనున్న అఖరి వన్డేలో గోస్వామికి ఘనంగా విడ్కోలు పలకాలని భారత జట్టు భావిస్తోంది. చదవండి: IND-W vs ENG-W: శభాష్ మంధాన.. తనకు దక్కిన అవార్డును! -
IND-W vs ENG-W: శభాష్ మంధాన.. తనకు దక్కిన అవార్డును!
హోవ్ వేదికగా ఇంగ్లండ్ మహిళలలతో జరిగిన తొలి వన్డేలో భారత్ 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 95 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోసింది. దీంతో మంధాన అద్భుత ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే మంధాన మరో సారి తన క్రీడా స్పూర్తిని ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో తన దక్కిన ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డును భారత వెటరన్ ఝులన్ గోస్వామికి అంకితం చేసింది. కాగా గోస్వామి తన కెరీర్లో చివరి అంతర్జాతీయ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా జరగనున్న అఖరి వన్డేలో గోస్వామికి ఘనంగా విడ్కోలు పలకాలని భారత జట్టు భావిస్తోంది. ఇక పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో మంధాన మాట్లాడూతూ.. "ఈ మ్యాచ్‌లో నా ఇన్నింగ్స్ పట్ల సంతృప్తిగా ఉన్నాను. అయితే అఖరి వరకు క్రీజులో నిలిచి ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేయాలని అనుకున్నాను. ముఖ్యంగా మ్యాచ్‌ను వీక్షించచడానికి వచ్చిన భారత అభిమానులకు ప్రత్యేక దన్యావాదాలు. అదే విధంగా టీ20 క్రికెట్ కంటే వన్డే క్రికెట్ ఆడటానికి ఎక్కువగా ఇష్టపడతాను. ఇక ఈ మ్యాచ్‌లో నాకు దక్కిన ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డును ఝులన్ గోస్వామికి అంకితం చేయాలనుకుంటున్నాను. అదే విధంగా ఈ సిరీస్‌ను గెలిచి మేము గోస్వామికి అంకితం ఇస్తాము" అని పేర్కొంది. చదవండి: T20 WC 2022: తుది జట్టులో డీకే లేదంటే పంత్? నేనైతే ఏం చేస్తానంటే: టీమిండియా దిగ్గజం -
జులన్‌కు ఘనమైన వీడ్కోలే లక్ష్యంగా...
హోవ్: పొట్టి ఫార్మాట్లో నిరాశపరిచిన భారత మహిళల జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌లో రాణించాలనే పట్టుదలతో ఉంది. టి20ల్లో పేలవమైన ఆటతీరుతో హర్మన్‌ప్రీత్ జట్టు 1–2తో ఆతిథ్య జట్టుకు సిరీస్‌ను అప్పగించింది. కానీ ఇప్పుడు దిగ్గజ బౌలర్ జులన్ గోస్వామికి ఇది ఆఖరి సిరీస్ కావడంతో సిరీస్ గెలిచి తమ సహచర క్రీడాకారిణికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సేన భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అమ్మాయిలంతా బాధ్యత కనబరిస్తే గత వైఫల్యాల్ని అధిగమించవచ్చు. ముందుగా ఆదివారం జరిగే తొలి వన్డేలో శుభారంభం చేస్తే సిరీస్‌పై పట్టుసాధించవచ్చని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. టాపార్డర్‌లో స్మృతి, షఫాలీ సహా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఇంగ్లండ్ బౌలింగ్‌కు ఎదురొడ్డితే మిగతా వారికి పని సులువవుతుంది. మరోవైపు ఆతిథ్య జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ హీథెర్‌నైట్ గాయంతో దూరమవడం ఇబ్బందికరం. అయితే ఇంగ్లండ్ మంచి ఆల్‌రౌండ్ జట్టు. పైగా టి20 సిరీస్ గెలిచిన ఊపు మీదుంది. ఇదే జోరుతో సొంతగడ్డపై వరుసగా మరో సిరీస్‌పై కన్నేసింది. ఓపెనర్లు సోఫియా డంక్లే, డానీ వ్యాట్, మూడోస్థానంలో అలైస్ కాప్సీ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసివస్తోంది. బౌలింగ్‌లోనూ సోఫీ ఎకిల్‌స్టోన్, ఫ్రెయా డెవిస్ భారత బ్యాటర్లపై ప్రభావం చూపగలరు. -
‘లార్డ్స్’లో టీమిండియా సీనియర్‌కు ఘనంగా వీడ్కోలు
బెంగళూరు: ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ జులన్ గోస్వామి లార్డ్స్ మైదానంలో పరుగు ముగించనుంది. రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచిన పేస్ బౌలర్ జులన్ గోస్వామి ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత రిటైర్ కానుంది. సెప్టెంబర్ 24న జరిగే మూడో వన్డే ఆమె కెరీర్లో చివరిది అవుతుంది. మార్చిలో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆడిన జులన్ పక్కటెముకల గాయంతో దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి పోరులో బరిలోకి దిగలేకపోయింది. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలతోనే శ్రీలంకతో సిరీస్‌కు దూరమైంది. అయితే జులన్‌లాంటి స్టార్‌కు గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వాలని భావించిన బీసీసీఐ ఆమెను ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసింది. మహిళల వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జులన్ ఆటకు తెర పడనుంది. 2002లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన 40 ఏళ్ల జులన్ 201 వన్డేల్లో 252 వికెట్లు, 68 టి20ల్లో 56 వికెట్లు తీసింది. మరో 12 టెస్టుల్లో 44 వికెట్లు కూడా పడగొట్టింది. ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2009లో అంత ర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినప్పుడు ఆమె తొలి కెప్టెన్ జులన్ గోస్వామినే కావడం విశేషం. విజయంతో జులన్‌కు వీడ్కోలు పలుకుతామని హర్మన్ వ్యాఖ్యానించింది. ‘జులన్ చివరి మ్యాచ్ కు నేను కెప్టెన్ కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నేను వచ్చినప్పుడు ఆమెనుంచి ఎంతో నేర్చుకున్నాను. జులన్ స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. ఆట పట్ల ఆమె అంకితభావం, పట్టుదల అసమానం. ప్రతీ మ్యాచ్‌లో బాగా ఆడేందుకు ఇప్పటికీ కొత్త ప్లేయర్‌గా ప్రతీరోజు 2–3 గంటలు బౌలింగ్ చేయడం మామూలు విషయం కాదు. ఆమె స్ఫూర్తితో ఎంతో మంది అమ్మాయిలు క్రికెట్లోకి వచ్చారు’ అని ఆమె తన గౌరవాన్ని ప్రదర్శించింది. -
టీమిండియా సీనియర్ పేసర్ రీఎంట్రీ.. లార్డ్స్‌లో ఫేర్వెల్!
ఇంగ్లండ్ గడ్డపై మూడు టి20లు, 3 వన్డేల్లో తలపడే భారత మహిళల జట్టును సెలక్టర్లు గురువారం ప్రకటించారు. గత శ్రీలంక సిరీస్‌కు దూరంగా ఉండి రిటైర్మెంట్పై అనుమానాలు పెంచిన సీనియర్ పేసర్ జులన్ గోస్వామి ఇప్పుడు జట్టులోకి పునరాగమనం చేయడం విశేషం. అయితే ఇదే సిరీస్‌లో సెప్టెంబర్ 24న లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే ఆమెకు ఆఖరి మ్యాచ్ కానుందనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ప్లాన్‌లో భాగంగానే ఝులన్ గోస్వామికి వీడ్కోలు మ్యాచ్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇక 39 ఏళ్ల ఝులన్ గోస్వామి 2018లో టి20 క్రికెట్ నుంచి తప్పుకొని కేవలం వన్డేలకు పరిమితమైంది. మహిళా క్రికెట్లో వన్డే ఫార్మాట్లో 200, 250 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా ఝులన్ గోస్వామి చరిత్ర సృష్టించింది. 2007లో ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన ఝులన్ గోస్వామి 2008 నుంచి 2011 వరకు టీమిండియా మహిళా జట్టుకు నాయకత్వం వహించింది. ఇక ఝులన్ గోస్వామి టీమిండియా తరపున 12 టెస్టుల్లో 291 పరుగులు.. 44 వికెట్లు, 199 వన్డేల్లో 1226 పరుగులు.. 250 వికెట్లు.. 68 టి20ల్లో 405 పరుగులు.. 56 వికెట్లు పడగొట్టింది. ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఏడాది తర్వాత వన్డే టీమ్‌లో జెమీమా రోడ్రిగ్స్‌కు చోటు దక్కగా, దేశవాళీ క్రికెట్లో మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తా చాటిన నాగాలాండ్ బ్యాటర్ కిరణ్ ప్రభు నవ్‌గిరేకు తొలిసారి భారత టి20 జట్టులో చోటు లభించింది. రెండేళ్ల తర్వాత హేమలత మళ్లీ వన్డే టీమ్‌కు ఎంపిక కాగా, లెగ్‌స్పిన్నర్ పూనమ్ యాదవ్‌కు రెండు టీమ్‌లలోనూ స్థానం లభించలేదు. ఆంధ్ర క్రికెటర్ సబ్బినేని మేఘన వన్డే, టి20 టీమ్‌లలోనూ అవకాశం దక్కించుకోగలిగింది. Jhulan Goswami's 20-year international career is set to conclude at Lord's, after the third and final ODI of India's tour of England on September 24 — ESPNcricinfo (@ESPNcricinfo) August 20, 2022 చదవండి: అంపైర్ల నియామకానికి రాత పరీక్ష.. పిచ్చి ప్రశ్నలతో విసిగించిన బీసీసీఐ Eugenie Bouchard: ఐడీకార్డుపై బికినీతో ఫోటో.. షాకైన టెన్నిస్ స్టార్ -
బెంగాల్ క్రికెట్లో టీమిండియా సీనియర్ పేసర్‌కు కీలక పదవి
టీమిండియా సీనియర్ బౌలర్ ఝులన్ గోస్వామి బెంగాల్ క్రికెట్లో కొత్త పదవి చేపట్టనుంది. బెంగాల్ మహిళల జట్టు ఆటగాళ్లకు మెంటార్ కమ్ ప్లేయర్‌గా వ్యవహరించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) పేర్కొంది. టీమిండియా సీనియర్ పేసర్‌గా సేవలందిస్తున్న ఝులన్ గోస్వామి బెంగాల్ వుమెన్స్ టీమ్‌లో అన్ని ఫార్మాట్లకు మెంటార్‌గా వ్యవహరిస్తుందని క్యాబ్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా పేర్కొన్నారు. గురువారం సాయంత్రంజరిగిన అధ్యక్షత సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.ఇక అండర్-16 కోచ్‌గా అరిన్దామ్ దాస్ బాధ్యతలు చేపట్టనున్నాడని.. అతనికి అసిస్టెంట్ కోచ్ ఎవరనేది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. కాగా అండర్-25 కోచ్‌గా ఉన్న ప్రణబ్ రాయ్‌కు పార్థసారథి భట్టాచార్య అసిస్టెంట్‌గా వ్యవహరిస్తాడని స్పష్టం చేశాడు. ఇక అండర్-19 కోచ్‌గా ఉన్న దెవాంగ్ గాంధీకి సంజీబ్ సన్యాల్ అసిస్టెంట్‌గా ఉండనున్నాడు. 39 ఏళ్ల ఝులన్ గోస్వామి 2018లో టి20 క్రికెట్ నుంచి తప్పుకొని కేవలం వన్డేలకు పరిమితమైంది. మహిళా క్రికెట్లో వన్డే ఫార్మాట్లో 200, 250 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా ఝులన్ గోస్వామి చరిత్ర సృష్టించింది. 2007లో ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన ఝులన్ గోస్వామి 2008 నుంచి 2011 వరకు టీమిండియా మహిళా జట్టుకు నాయకత్వం వహించింది. ఇక ఝులన్ గోస్వామి టీమిండియా తరపున 12 టెస్టుల్లో 291 పరుగులు.. 44 వికెట్లు, 199 వన్డేల్లో 1226 పరుగులు.. 250 వికెట్లు.. 68 టి20ల్లో 405 పరుగులు.. 56 వికెట్లు పడగొట్టింది. చదవండి: Washington Sundar: సుందర్ 'నమ్మశక్యం కాని బౌలింగ్'.. నోరెళ్లబెట్టిన ప్రత్యర్థి బ్యాటర్ -
గోస్వామి బౌలింగ్.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్.. వీడియో వైరల్!
గాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. గాయం కారణంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాల్సిన రాహుల్ ఆఖరి నిమిషంలో దూరమైన విషయం తెలిసిందే. అనంతరం అతడు గత నెలలో స్పోర్ట్స్ హెర్నియాకు జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. కాగా త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో భారత జట్టులోకి రాహుల్ పునరాగమనం చేయనున్నాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌కు కాకుండా టీ20 సిరీస్‌కు రాహుల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే అతడు తన ఫిట్నెస్ నిరూపించుకుంటూనే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాహుల్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చెమటోడ్చుతున్నాడు. సన్నాహాల్లో భాగంగా భారత మహిళా ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి బౌలింగ్‌లో రాహుల్ ప్రాక్టీస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గత కొన్ని నెలలగా గాయం కారణంగా జట్టుకు దూరమైన ఝులన్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. జూలన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై ఆడింది. చదవండి: Lendl Simmons : అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వెస్టిండీస్ ఓపెనర్..! K L Rahul is batting and Jhulan Goswami is bowling. He is fully fit for West Indies tour 💙🔥 #MenInBlue 📍NCA, Bangalore#KlRahul #IndvsWI #INDvsEND pic.twitter.com/UAfCxhdimc — 𝘛𝘶𝘴𝘩𝘢𝘳 ⚡ (@TUSHARBAGGA1M) July 18, 2022 -
Ind Vs Eng: అరంగేట్రంలోనే అర్ష్‌దీప్ అదుర్స్.. 16 ఏళ్ల రికార్డు బద్దలు
India Vs England 1st T20- Arshdeep Singh: టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కల నెరవేరింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేపథ్యంలో తొలి మ్యాచ్‌తో అతడు అరంగేట్రం చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా క్యాప్ అందుకుని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇక మొదటి మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు 23 ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్. అరంగేట్ర మ్యాచ్‌లోనే మెయిడెన్ వేసి 16 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టాడు. భారత మహిళా జట్టు బౌలర్ ఝులన్ గోస్వామి, అజిత్ అగార్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. 2006లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఝులన్.. అదే ఏడాది దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అగార్కర్ టీ20 ఫార్మాట్లో ఈ ఫీట్ నమోదు చేశారు. FIRST wicket for @arshdeepsinghh in International cricket 🙌 #ENGvIND pic.twitter.com/irEjeZeHz5 — Doordarshan Sports (@ddsportschannel) July 7, 2022 రెండు వికెట్లు పడగొట్టి.. ఇంగ్లండ్‌తో మొదటి టీ20 మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ 3.3 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అదే విధంగా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రీస్ టోప్లే, మాథ్యూ పార్కిన్సన్‌లను అవుట్ చేశాడు. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్ సింగ్‌పై టీమిండియా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘టీమిండియాకు ఆడగల అన్ని అర్హతలు ఉన్న ఆటగాడివి. నీ ఎంట్రీ అదిరిపోయింది’’ అని సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు. WICKET!! Moeen Ali gone for 36 🙌 #ENGvIND pic.twitter.com/7Huolk9wu8 — Doordarshan Sports (@ddsportschannel) July 7, 2022 కాగా ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అర్ష్‌దీప్ 14 ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో భారత జట్టు సెలక్టర్ల దృష్టి ఆకర్షించి జట్టులోకి వచ్చాడు. ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ 50 పరుగుల తేడాతో బట్లర్ బృందాన్ని మట్టికరిపించింది. చదవండి: Ind Vs Eng 1st T20: టీమిండియా.. మరీ ఇంత చెత్తగానా.. ఇదేం బాలేదు! Fantastic first over at the international level by Arshdeep singh. Way to go buddy. — Irfan Pathan (@IrfanPathan) July 7, 2022 -
అరుదైన రికార్డు సాధించిన గోస్వామి.. తొలి భారత బౌలర్‌గా!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత స్టార్ అరుదైన రికార్డు సాధించింది. ప్రపంచకప్‌లో 30 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా ఝులన్ గోస్వామి నిలిచింది. హామిల్టన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన గోస్వామి ఈ ఘనత సాధించింది. ఇక వన్డే ఫార్మాట్లో 250 వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా గోస్వామి నిలిచిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌పై 110 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 119 పరగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను దెబ్బతీసింది. అదే విధంగా ఝులన్ గోస్వామి,పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు సాధించి తమ వంతు పాత్ర పోషించారు.అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) రాణించగా.. యస్తికా భాటియా అర్ధ శతకంతో జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. చదవండి: World Cup 2022: ఎదురులేని ఆసీస్.. కెప్టెన్ 15వ సెంచరీ.. అద్భుత విజయం -
టీమిండియా బౌలర్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా!
భారత వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి అరుదైన రికార్డు సాధించింది. ప్రపంచంలోనే 200 వన్డేలు ఆడిన తొలి బౌలర్‌గా గోస్వామి రికార్డులకెక్కింది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో గోస్వామి ఈ ఘనత సాధించింది. అంతేకాకుండా 200 వన్డే మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్‌గా గోస్వామి నిలిచింది. ఇక భారత కెప్టెన్ మిథాలీ రాజ్ 230 వన్డేలు ఆడి తొలి స్ధానంలో ఉంది. ఇక వన్డే ఫార్మాట్లో 250 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా గోస్వామి నిలిచిన సంగతి తెలిసిందే. కాగా గోస్వామి వరుసగా ఐదో వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె 2005లో తొలి వరల్డ్‌కప్ భారత తరుపున ఆడింది. అదే విధంగా మహిళల ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు (40 వికెట్లు) తీసిన బౌలర్‌గా కూడా గోస్వామి రికార్డు సృష్టించింది. చదవండి: Jhulan Goswami: చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
Jhulan Goswami: టీమిండియా పేసర్ ప్రపంచ రికార్డు.. అరుదైన ఘనత
టీమిండియా వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి ప్రపంచ రికార్డు సాధించింది. వన్డే ఫార్మాట్లో 250 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ ఓపెనర్ టామీ బీమౌంట్‌ను అవుట్ చేసి ఈ ఘనత సాధించింది. ఎల్బీడబ్ల్యూగా ఆమెను వెనక్కి పంపి.. తద్వారా 250వ వికెట్ మైలురాయిని చేరుకున్న ఝులన్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. కాగా 198 ఇన్నింగ్స్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. ఇక వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్ల జాబితాలో ఝులన్ తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్ కాథరిన్ ఫిజ్పాట్రిక్(180 వికెట్లు), వెస్టిండీస్ బౌలర్ అనీసా మహ్మద్(180 వికెట్లు), దక్షిణాఫ్రికా క్రికెటర్ షబ్నమ్ ఇస్మాయిల్(168 వికెట్లు), ఇంగ్లండ్ బౌలర్ కేథరీన్ బ్రంట్(164 వికెట్లు), ఆస్ట్రేలియా బౌలర్ ఎలిస్ పెర్రీ(161 వికెట్లు) ఉన్నారు. ఇక బీమౌంట్ వికెట్‌ను కూల్చడం ద్వారా ఝులన్ మరో రికార్డు కూడా సాధించింది. వన్డేల్లో 250 వికెట్ల మైలురాయిని అందుకున్న ఏడో భారత బౌలర్(పురుషులు, మహిళా క్రికెటర్లు కలిపి)గా నిలిచింది. అనిల్ కుంబ్లే(334),జవగళ్ శ్రీనాథ్(315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), హర్భజన్ సింగ్ (265), కపిల్‌దేవ్(253)ల సరసన నిలిచింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే భారత్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్ 2022 టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. చదవండి: Ruturaj Gaikwad - IPL 2022: సీఎస్కేకు బిగ్‌షాక్.. ఆరంభ మ్యాచ్‌లకు స్టార్ ఆటగాడు దూరం! View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc)