
టీమిండియా పేసర్ ఝులన్ గోస్వామి ప్రపంచ రికార్డు(PC: ICC)
టీమిండియా వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి ప్రపంచ రికార్డు సాధించింది. వన్డే ఫార్మాట్‌లో 250 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ ఓపెనర్ టామీ బీమౌంట్‌ను అవుట్ చేసి ఈ ఘనత సాధించింది. ఎల్బీడబ్ల్యూగా ఆమెను వెనక్కి పంపి.. తద్వారా 250వ వికెట్ మైలురాయిని చేరుకున్న ఝులన్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.
కాగా 198 ఇన్నింగ్స్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. ఇక వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్ల జాబితాలో ఝులన్ తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్ కాథరిన్ ఫిజ్‌పాట్రిక్(180 వికెట్లు), వెస్టిండీస్ బౌలర్ అనీసా మహ్మద్(180 వికెట్లు), దక్షిణాఫ్రికా క్రికెటర్ షబ్నమ్ ఇస్మాయిల్(168 వికెట్లు), ఇంగ్లండ్ బౌలర్ కేథరీన్ బ్రంట్(164 వికెట్లు), ఆస్ట్రేలియా బౌలర్ ఎలిస్ పెర్రీ(161 వికెట్లు) ఉన్నారు.
ఇక బీమౌంట్ వికెట్‌ను కూల్చడం ద్వారా ఝులన్ మరో రికార్డు కూడా సాధించింది. వన్డేల్లో 250 వికెట్ల మైలురాయిని అందుకున్న ఏడో భారత బౌలర్(పురుషులు, మహిళా క్రికెటర్లు కలిపి)గా నిలిచింది. అనిల్ కుంబ్లే(334),జవగళ్ శ్రీనాథ్(315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), హర్భజన్ సింగ్ (265), కపిల్‌దేవ్(253)ల సరసన నిలిచింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే భారత్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్ 2022 టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది.
చదవండి: Ruturaj Gaikwad - IPL 2022: సీఎస్‌కేకు బిగ్‌షాక్.. ఆరంభ మ్యాచ్‌లకు స్టార్ ఆటగాడు దూరం!
Comments
Please login to add a commentAdd a comment