ముంబై: ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత మహిళలతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. జులన్ గోస్వామి, శిఖా పాండేల బౌలింగ్ ధాటికి విలవిల్లాడింది. వీరిద్దరూ చెరో నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. ఇంగ్లండ్ మహిళల‍్లో నటలీ స్కీవర్(85) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది.
ఓ దశలో 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో స్కీవర్ ఆదుకున్నారు. కాగా, భారత మహిళా బౌలర్ల విజృంభణకు మిగతా వారు వరుస పెట్టి క్యూకట్టారు. దాంతో ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 161 పరుగులకే చాపచుట్టేసింది. ప్రధానంగా జులన్, శిఖాల పదునైన బంతులకు ఇంగ్లండ్ దాసోహమైంది. మరొక బౌలర్ పూనమ్ యాదవ్‌కు రెండు వికెట్లు లభించాయి. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
ఇక్కడ చదవండి: ఏక్తా మాయాజాలం
Comments
Please login to add a commentAdd a comment