ముంబై: ఈనెల 28 నుంచి ముంబైలో ఆ్రస్టేలియా మహిళల జట్టుతో జరిగే మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. ఎడంచేతి వాటం స్పిన్నర్లు సైకా ఇషాక్ (బెంగాల్), మన్నత్ కశ్యప్ (పంజాబ్), ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ (కర్ణాటక), మీడియం పేస్ బౌలర్ టిటాస్ సాధు (బెంగాల్)లకు తొలిసారి భారత వన్డే జట్టులో చోటు లభించింది. ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన టి20 సిరీస్‌లో తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపికైన 21 ఏళ్ల శ్రేయాంక, 28 ఏళ్ల సైకా ఇషాక్ మూడు మ్యాచ్‌ల్లో ఐదేసి వికెట్ల చొప్పున పడగొట్టి ఆకట్టుకున్నారు.
మన్నత్, టిటాస్ సాధు ఈ ఏడాది అండర్–19 ప్రపంచకప్ టైటిల్ సాధించిన భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఆ్రస్టేలియాతో మూడు వన్డేలు డిసెంబర్ 28, 30, జనవరి 2న వాంఖెడె స్టేడియంలో... మూడు టి20 మ్యాచ్‌లు జనవరి 5, 7, 9 తేదీల్లో నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతాయి. ఈ రెండు సిరీస్‌లలో భారత జట్లకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన వ్యవహరిస్తారు. వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన 16 మంది బృందంలో రెండు మార్పులతో టి20 జట్టును ఎంపిక చేశారు. వన్డే జట్టులో ఉన్న స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్ స్థానాల్లో టి20 జట్టులో కనిక అహూజా, మిన్ను మణి వచ్చారు.
భారత మహిళల వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యస్తిక, రిచా ఘోష్, అమన్‌జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుక సింగ్, టిటాస్ సాధు, పూజ వస్త్రకర్, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్.
Comments
Please login to add a commentAdd a comment