
భారత వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి అరుదైన రికార్డు సాధించింది. ప్రపంచంలోనే 200 వన్డేలు ఆడిన తొలి బౌలర్‌గా గోస్వామి రికార్డులకెక్కింది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో గోస్వామి ఈ ఘనత సాధించింది. అంతేకాకుండా 200 వన్డే మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్‌గా గోస్వామి నిలిచింది. ఇక భారత కెప్టెన్ మిథాలీ రాజ్ 230 వన్డేలు ఆడి తొలి స్ధానంలో ఉంది.
ఇక వన్డే ఫార్మాట్‌లో 250 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా గోస్వామి నిలిచిన సంగతి తెలిసిందే. కాగా గోస్వామి వరుసగా ఐదో వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె 2005లో తొలి వరల్డ్‌కప్ భారత తరుపున ఆడింది. అదే విధంగా మహిళల ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు (40 వికెట్లు) తీసిన బౌలర్‌గా కూడా గోస్వామి రికార్డు సృష్టించింది.
చదవండి: Jhulan Goswami: చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్