మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు (40 వికెట్లు) తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కింది. విండీస్ బ్యాటర్ అనిసా మహ్మద్‌ను ఔట్ చేయడం ద్వారా ఝులన్ ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా బౌలర్ లిన్ ఫుల్‌స్టన్ (39 వికెట్లు)ను అధిగమించి వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు సాధించిన క్రికెటర్‌గా అవతరించింది.
🚨 RECORD ALERT 🚨
— BCCI Women (@BCCIWomen) March 12, 2022
Wicket No. 4⃣0⃣ in the WODI World Cups for @JhulanG10! 🔝 🙌
What a champion cricketer she has been for #TeamIndia ! 👏 👏 #CWC22 | #WIvIND
Follow the match ▶️ https://t.co/ZOIa3L288d pic.twitter.com/VIfnD8CnVR
ఫుల్‌స్టన్ 20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 39 వికెట్లు పడగొట్టగా, ఝులన్ 31 వన్డేల్లో ఫుల్‌స్టన్ రికార్డును బద్దలు కొట్టింది. ఇప్పటివరకు ఐదు ప్రపంచకప్‌లు ఆడిన 39 ఏళ్ల ఝులన్, వన్డే ఫార్మాట్‌లో 198 మ్యాచ్‌ల్లో 249 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతుంది.
ఇదిలా ఉంటే, సెడాన్‌పార్కు వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 155 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన(119 బంతుల్లో 123; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్(107 బంతుల్లో 109; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. స్నేహ్ రాణా(3/22), మేఘనా సింగ్ (2/27)ల ధాటికి 40.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. విండీస్ జట్టులో ఓపెనర్ డియాంద్ర డొటిన్(62) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
చదవండి: World Cup 2022: శెభాష్ స్మృతి, హర్మన్.. ఇదే అత్యధిక స్కోరు!
Comments
Please login to add a commentAdd a comment