చరిత్ర సృష్టించిన భారత మహిళా బౌలర్‌ | India’sJhulan Goswami becomes first woman cricketer to take 200 wickets | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 7 2018 7:33 PM | Last Updated on Wed, Feb 7 2018 9:08 PM

 India’sJhulan Goswami becomes first woman cricketer to take 200 wickets - Sakshi

జులాన్‌ గోస్వామి

కింబేర్లీ : భారత మహిళా బౌలర్‌ జులన్‌ గోస్వామి ప్రపంచ రికార్డు నమోదు చేశారు. మహిళల అంతర్జాతీయ వన్డేల్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా గోస్వామి గుర్తింపు పొందారు. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో గోస్వామి ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. తొలి వన్డేలో 4 వికెట్లు పడగొట్టిన గోస్వామి ప్రస్తుతం జరుగుతున్న రెండో వన్డేలో ఐదో ఓవర్‌ చివరి బంతికి దక్షిణాఫ్రికా ఓపెనర్‌ లూరాను అవుట్‌ చేసి ఈ అరుదైన రికార్డును నమోదు చేశారు.

166 వన్డేలాడిన గోస్వామి 3.23 ఎకానమీతో 200 వికెట్లు పడగొట్టారు. ఆమె అద్భుత బౌలింగ్‌ (6/31 ) ప్రదర్శన న్యూజిలాండ్‌పై 2011లో నమోదు చేశారు. ఈ సీనియర్‌ మహిళా క్రికెటర్‌ 10 టెస్టు మ్యాచ్‌ల్లో  40 వికెట్లు, 60 టీ20 మ్యాచుల్లో 50 వికెట్లు పడగొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement