మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా.. ఆస్ట్రేలియన్ మహిళా బౌలర్ లిన్ ఫుల్‌స్టన్‌తో కలిసి గోస్వామి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ ఉమెన్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 9 ఓవర్లో కేటీ మార్టిన్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ ఫీట్‌ను అందుకుంది. ఇప్పటివరకు ఐదు ప్రపంచకప్‌లు ఆడిన గోస్వామి.. కేటీ మార్టిన్ వికెట్‌తో కలిపి 39 వికెట్లు తీసింది. ఆస్ట్రేలియాకు చెందిన లిన్ ఫుల్‌స్టన్ 39 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. తాజాగా గోస్వామి ఆమె సరసన చేరింది. రాబోయే మ్యాచ్‌ల్లో గోస్వామి ఒక వికెట్ తీస్తే చాలు.. మెగాటోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కనుంది.
ఇక 37 వికెట్లతో ఇంగ్లండ్ మహిళ క్రికెటర్ కరోల్ హోడ్జెస్ రెండో స్థానంలో.. క్లేరీ టేలర్(ఇంగ్లండ్) 36 వికెట్లతో మూడో స్థానంలో.. ఆస్ట్రేలియాకు చెందిన క్యాథరిన్ ఫిట్జ్ పాట్రిక్ 33 వికెట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఉమెన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అమీ సాథర్‌వెయిట్ 75, అమిలియా కెర్ 50 పరుగులతో రాణించారు.
చదవండి: Virat Kohli: రికార్డులన్ని కోహ్లి ఖాతాలోకే.. ఎవరు టచ్ చేయలేరు
Comments
Please login to add a commentAdd a comment