
మేము ఎవరూ ఊహించలేదు:జులన్
మహిళల ప్రపంచకప్ ఫైనల్లో ఓడి నిరాశపరిచినా మరింత మెరుగ్గా రాణించగల సత్తా భారత జట్టుకు ఉందని పేసర్ జులన్ గోస్వామి అభిప్రాయపడింది.
లండన్: మహిళల ప్రపంచకప్ ఫైనల్లో ఓడి నిరాశపరిచినా మరింత మెరుగ్గా రాణించగల సత్తా భారత జట్టుకు ఉందని పేసర్ జులన్ గోస్వామి అభిప్రాయపడింది. ‘టోర్నీ ప్రారంభమైన తొలి రోజున మా జట్టు ఫైనల్ చేరుతుందని ఎవరూ ఊహించలేదు.
తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌ను ఓడించిన అనంతరం మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. జట్టుగా సమష్టి పోరాటం చేస్తే ఫలితం దక్కుతుందని మేం నమ్మాం. ఈ ప్రయాణాన్ని మేం ఆస్వాదిస్తున్నాం. ఒక్క ఫైనల్ తప్ప మా ఆటతీరు గర్వించే స్థాయిలోనే ఉంది’ అని గోస్వామి పేర్కొంది.