
బెంగళూరు: టీమిండియా క్రికెటర్లకు యో-యో టెస్టు ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు. మైదానంలో మెరుగైన ఆట ప్రదర్శించినా, యో యో టెస్టులో విఫలమైతే జట్టులో చోటు దక్కదు. ఇటీవల మహ్మద్ షమీ, అంబటి రాయుడు యో యో టెస్టులో విఫలం కావడంతో జట్టులో స్థానాన్ని కోల్పోయారు.
తాజాగా భారత మహిళల జట్టు సభ్యులందరూ యో యో పాసయ్యారట. ఈ విషయాన్ని బౌలర్ జులన్ గోస్వామి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన యో యో టెస్టులో జట్టు సభ్యులందరం పాసయ్యాం అని గోస్వామి పేర్కొంది. ఈ క్రమంలోనే జట్టులోని తన సహచర క్రీడాకారిణులను ‘వెల్‌డన్ గర్ల్స్’ అంటూ అభినందించింది. ప్రస్తుతం కొందరు క్రీడాకారిణీలు ఇతర దేశాల్లో క్రికెట్ లీగ్‌లు ఆడుతున్నారు. ఈ కారణంగా వీరు యో యో టెస్టుకు హాజరుకాలేదు. త్వరలో వీరు కూడా హాజరవుతారని అకాడమీ నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment