టీమిండియా మహిళల జట్టు ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి 3-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో తన చివరి మ్యాచ్ ఆడిన జులన్ గోస్వామికి హర్మన్‌ప్రీత్ సేన సిరీస్ విజయాన్ని కానుకగా అందించింది. ఇక వచ్చే వన్డే వరల్డ్‌కప్ 2023 వరకు టీమిండియా ఉమెన్స్‌కు మరో వన్డే సిరీస్ లేదు.
ఈ నేపథ్యంలో స్వదేశానికి తిరుగుపయనమైన టీమిండియా మహిళా క్రికెటర్లు ఎయిర్‌పోర్టులో పీపీఈ కిట్లతో క్యాట్‌వాక్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని భారత మహిళా క్రికెటర్ జేమిమా రోడ్రిగ్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఈ వీడియోలో జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు జులన్ గోస్వామి, హర్లిన్ డియోల్ సహా ఇతర క్రికెటర్లు.. ఫ్యాషన్ మోడల్స్‌ను అనుకరిస్తూ ఎయిర్‌పోర్ట్‌లో క్యాట్‌వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి.
ఇక స్వదేశానికి చేరుకున్న టీమిండియా మహిళా క్రికెటర్లకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా జులన్ గోస్వామి, ఆల్‌రౌండర్ దీప్తి శర్మలకు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. కాగా ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో ఆఖర్లో దీప్తిశర్మ.. ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్‌ను మన్కడింగ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీప్తి శర్త తాను చేసింది కరెక్టేనని చెప్పింది.
‘రనౌట్ విషయంలో మేం వ్యూహంతో సిద్ధమయ్యాం. మేం ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె మళ్లీ మళ్లీ క్రీజ్ దాటి ముందుకు వెళ్లింది.ఆ విషయాన్ని అంపైర్లకు కూడా చెప్పాం. అయినా ఆమె తీరు మార్చుకోలేదు. దాంతో నిబంధనల ప్రకారమే అవుట్ చేశాం. మేం ఇంకేం చేయగలం’ అని వివరణ ఇచ్చింది.
i've never loved a team more😭
— s (@_sectumsempra18) September 26, 2022
from @JemiRodrigues Instagram post pic.twitter.com/qE5ZsgXFeB
చదవండి: ఒక శకం ముగిసింది.. బాల్‌గర్ల్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా
Comments
Please login to add a commentAdd a comment