నవీ ముంబై వేదికగా వెస్టిండీస్ మహిళా జట్టుతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి విండీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. స్మృతి మంధన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెజ్ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది.
భారత ఇన్నింగ్స్‌లో ఉమా ఛెత్రి 24, రిచా ఘోష్ 20 పరుగులు చేసి ఔట్ కాగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (13), సంజీవన్ సజనా (1) అజేయంగా నిలిచారు. విండీస్ బౌలర్లలో కరిష్మ రామ్‌హరాక్ రెండు వికెట్లు పడగొట్టగా.. డియాండ్రా డొట్టిన్ ఓ వికెట్ దక్కించుకుంది.
కాగా, మూడు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో టీ20 మ్యాచ్‌లు డిసెంబర్ 15, 17, 19 తేదీల్లో జరుగనుండగా.. వన్డేలు 22, 24, 27 తేదీల్లో జరుగనున్నాయి. టీ20 మ్యాచ్‌లన్నీ నవీ ముంబైలో జరుగనుండగా.. మూడు వన్డే మ్యాచ్‌లకు వడోదర వేదిక కానుంది.
ఇదిలా ఉంటే, భారత మహిళల క్రికెట్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత్ మూడు మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలు ఎదుర్కొంది. తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్.. రెండో వన్డేలో 122 పరుగుల తేడాతో, మూడో వన్డేలో 83 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment