India women cricet team
-
టీ20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
భారత మహిళా క్రికెటర్లా మజాకా!..జూలు విదిల్చిన శివంగులు (ఫొటోలు)
-
పోరాడి ఓడిన టీమిండియా.. అయ్యో హర్మన్!
మహిళల టీ20 ప్రపంచకప్-2023లో టీమిండియా ప్రయాణం ముగిసింది. కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు పోరాడి ఓడింది. ఆసీస్ చేతిలో 5 పరుగుల తేడాతో ఓటమి చవి చూసిన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. అయితే భారత విజయం ఖాయం అనుకున్న దశలో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్‌గా వెనుదిరిగడం మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 52 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ కీలక సమయంలో రనౌట్‌గా వెనుదిరిగింది. ఆమె ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కాగా ఆనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ హర్మన్ అద్భుతమైన పోరాటపటిమ కనబరిచింది. హర్మన్ పాటు జెమీమా రోడ్రిగ్స్(24 బంతుల్లో 43 పరుగులు) రాణించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రౌన్,గార్డనర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా స్కాట్, జానసెన్ తలా వికెట్ సాధించారు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా 7వసారి కావడం గమనార్హం. చదవండి: T20WC: ఆసీస్ బ్యాటర్‌పై కోపంతో ఊగిపోయిన షఫాలీ.. గట్టిగా అరుస్తూ! వీడియోవైరల్ -
సిరీస్ క్లీన్‌స్వీప్.. పీపీఈ కిట్లతో క్రికెటర్ల క్యాట్‌వాక్
టీమిండియా మహిళల జట్టు ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి 3-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో తన చివరి మ్యాచ్ ఆడిన జులన్ గోస్వామికి హర్మన్‌ప్రీత్ సేన సిరీస్ విజయాన్ని కానుకగా అందించింది. ఇక వచ్చే వన్డే వరల్డ్‌కప్ 2023 వరకు టీమిండియా ఉమెన్స్‌కు మరో వన్డే సిరీస్ లేదు. ఈ నేపథ్యంలో స్వదేశానికి తిరుగుపయనమైన టీమిండియా మహిళా క్రికెటర్లు ఎయిర్‌పోర్టులో పీపీఈ కిట్లతో క్యాట్‌వాక్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని భారత మహిళా క్రికెటర్ జేమిమా రోడ్రిగ్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఈ వీడియోలో జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు జులన్ గోస్వామి, హర్లిన్ డియోల్ సహా ఇతర క్రికెటర్లు.. ఫ్యాషన్ మోడల్స్‌ను అనుకరిస్తూ ఎయిర్‌పోర్ట్‌లో క్యాట్‌వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక స్వదేశానికి చేరుకున్న టీమిండియా మహిళా క్రికెటర్లకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా జులన్ గోస్వామి, ఆల్‌రౌండర్ దీప్తి శర్మలకు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కాగా ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో ఆఖర్లో దీప్తిశర్మ.. ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్‌ను మన్కడింగ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీప్తి శర్త తాను చేసింది కరెక్టేనని చెప్పింది. ‘రనౌట్ విషయంలో మేం వ్యూహంతో సిద్ధమయ్యాం. మేం ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె మళ్లీ మళ్లీ క్రీజ్ దాటి ముందుకు వెళ్లింది.ఆ విషయాన్ని అంపైర్లకు కూడా చెప్పాం. అయినా ఆమె తీరు మార్చుకోలేదు. దాంతో నిబంధనల ప్రకారమే అవుట్ చేశాం. మేం ఇంకేం చేయగలం’ అని వివరణ ఇచ్చింది. i've never loved a team more😭 from @JemiRodrigues Instagram post pic.twitter.com/qE5ZsgXFeB — s (@_sectumsempra18) September 26, 2022 చదవండి: ఒక శకం ముగిసింది.. బాల్‌గర్ల్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా ఇన్నింగ్స్ చివర్లో హైడ్రామా.. 'మరో అశ్విన్'లా కనబడింది -
వన్డేల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ.. తొలి భారత క్రికెటర్‌గా!
భారత మహిళా క్రికెటర్ రిచా ఘోష్ వన్డే క్రికెట్లో అరుదైన రికార్డును సాధించింది. వన్డేల్లో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ సాధించిన తొలి భారత మహిళా బ్యాటర్‌గా ఘోష్ రికార్డులకెక్కింది. న్యూజిలాండ్‌లో జరిగిన నాలుగో వన్డేలో 26 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన రిచా.. ఈ అరుదైన ఘనత సాధించింది. అంతకుమందు 2018లో దక్షిణాఫ్రికాపై వేదా కృష్ణమూర్తి 32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించింది. అదే విధంగా న్యూజిలాండ్‌లో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ కూడా రిచాదే కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత జట్టుపై 63 పరుగుల తేడాతో ఘన విజయం న్యూజిలాండ్ సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 128 పరగులకే ఆలౌటైంది. చదవండి: ICC World Cup 2023: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా అజిత్ అగార్కర్!? Richa Ghosh brings up the fastest fifty by an Indian batter in Women's ODI 🔥 She needed just 26 balls to reach the milestone 👏 Watch all the #NZvIND action LIVE or on-demand on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 pic.twitter.com/ad34maGg4A — ICC (@ICC) February 22, 2022 -
అయ్యో హర్మన్‌ప్రీత్.. ఇలా రనౌట్ అయ్యావు ఏంటి?.. వీడియో వైరల్
న్యూజిలాండ్ మహిళలతో జరగిన రెండో వన్డేలో భారత స్టార్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ అనూహ్య రీతిలో రనౌటైంది. భారత ఇన్నింగ్స్ 28 ఓవర్ వేసిన ఫ్రాన్సెస్ మాకై బౌలింగ్‌లో.. హర్మన్‌ప్రీత్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి బౌలర్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో బంతి బౌలర్ మాకై చేతికి వెళ్లింది. వెంటనే మాకై వేగంగా బంతిని కీపర్‌కి త్రో చేసింది. అయితే క్రీజులోకి తిరిగి చేరుకోవడానికి హర్మన్‌ప్రీత్ కొంచెం ఇబ్బంది పడింది. కాగా కీపర్ వెంటనే స్టంప్స్ పడగొట్టడంతో హర్మన్‌ప్రీత్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరింది. రనౌట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్‌పై న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో మేఘన(61), షఫాలీ వర్మ(51), దీప్తి శర్మ(69) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో హన్నా రోవ్, మైర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, మాకై, కేర్ చెరో వికెట్ సాధించారు. 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. చదవండి: తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా! an unfortunate wicket of Harmanpreet Kaur, team India down by 4 wickets! 🏏 #NZvIND #LiveCricketOnPrime pic.twitter.com/mjI4wbz1ou — amazon prime video IN (@PrimeVideoIN) February 18, 2022 -
మూడో టీ20లో భారత్ ఓటమి.. సిరీస్ ఆస్ట్రేలియాదే
Australia seal the T20I series Against India: గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత మహిళల జట్టుపై 14 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 2-0తో ఆస్ట్రేలియా సీరీస్‌ను కైవసం చేసుకుంది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే షఫాలీ వర్మ వికెట్ కోల్పోయినప్పటకీ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ క్రమంలో స్మృతి మంధాన ఆర్ధసెంచరీనీ పూర్తి చేసుకుంది. మంధాన 49 బంతుల్లో 8 ఫోర్లుతో 52 పరుగులు సాధించింది. మంధాన ఔటయ్యక సారథి హర్మన్‌ప్రీత్ కౌర్, పూజా వస్త్రకర్, హార్లీన్ డియోల్ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రిచా ఘోష్ (11 బంతుల్లో 22 నాటౌట్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చివరలో దూకుడుగా ఆడినా భారత్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయింది. భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో నికోలా క్యారీ రెండు వికెట్లు పడగొట్టగా, సదర్లాండ్, యాష్లే గార్డనర్, జార్జియా వారహమ్ చెరో వికెట్ సాధించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 5వికెట్లకు 149 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్స్‌లో మెక్‌గ్రాత్(61), బెత్ మూనీ(44) పరుగలుతో రాణించారు. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ రెండు వికెట్లు పడగొట్టగా, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్,రేణుకా సింగ్ చెరో వికెట్ సాధించారు. -
భారత్- ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ రద్దు..
India Women vs Australia Women 1st T20I: భారత్, ఆస్ట్రేలియా మహిళల మద్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి వచ్చిన భారత్ 15.2 ఓవర్లలో 134/4 గా ఉన్న సమయంలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను తాత్కాలింగా నిలిపివేశారు. తరువాత దాదాపు గంట సమయం ఎదురు చూసిన అంపైర్స్ .. వర్షం ఎప్పటికీ ఆగిపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. కాగా భారత్‌కు ఓపెనర్లు షఫాలి వర్మ(17), స్మృతి మంధన(18) శుభారంభాన్ని ఇచ్చారు. జెమిమా రోడ్రిగ్స్ 49 పరుగులచేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో యాష్లే గార్డనర్ రెండు వికెట్లు పడగొట్టగా, సోఫీ మోలినెక్స్, జార్జియా వారెహామ్ చెరో వికెట్ సాధించారు. దాదాపు గంట సమయం ఎదురు చూసిన అంపైర్స్ .. వర్షం ఆగిపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య శనివారం రెండో టీ20 జరగనుంది. చదవండి: CSK Vs PBKS: ధోని (12) మరోసారి విఫలం.. చెన్నై 61/5 -
తొలి వన్డేలో టీమిండియా చిత్తు.. ఆసీస్ రికార్డు విజయం
మెక్కే: 3 వన్డేల సిరీస్‌లో భాగంగా హారప్ పార్క్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు చిత్తుగా ఓడిపోయింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేయగా.. ఆసీస్ మహిళా జట్టు మరో 9 ఓవర్లు మిగిలుండగా ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ ఓపెనింగ్ బ్యాటర్ రేచల్ హేన్స్ 93 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చగా.. మరో ఓపెనర్ అలైసా హీలీ (77 బంతుల్లో 77; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మెగ్ లానింగ్ (69 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. అంతకుముందు టీమిండియా ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 107 బంతుల్లో 3 ఫోర్లతో 63 పరుగులు చేయగా.. యస్తికా భాటియా (51 బంతుల్లో 35; 2 ఫోర్లు), వికెట్ కీపర్ రిచా ఘోష్ (29 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్), గోస్వామి (24 బంతుల్లో 20; ఫోర్, సిక్స్) ఓ మోస్తరుగా రాణించడంతో టీమిండియా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్(4/33), మోలినెక్స్(2/ 39), డిర్లింగ్టన్(2/29) మిథాలీ సేనను దారుణంగా దెబ్బకొట్టారు. 4 వికెట్లతో చెలరేగిన డార్సీ బ్రౌన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా శుక్రవారం(సెప్టెంబర్ 24న) జరుగనుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌తో పలు రికార్డులు నమోదయ్యాయి. వన్డేల్లో ఆస్ట్రేలియా వరుసగా 25వ విజయం సాధించి విజయాల పరంపరను కొనసాగించింది. మరోవైపు భారత కెప్టెన్ మిథాలీ రాజ్ తన కెరీర్లో 20 వేల పరుగులు పూర్తిచేసుకుంది. ఈ మ్యాచ్‌లో 63 పరుగులు చేసిన మిథాలీకి వన్డేల్లో ఇది వరుసగా ఐదో అర్ధ సెంచరీ కావడం విశేషం. అంతకుముందు ఇన్నింగ్స్‌ల్లో ఆమె 75 నాటౌట్, 59, 72, 79 పరుగులు చేసింది. చదవండి: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు.. -
భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా జరుగనుంది..
న్యూఢిల్లీ: భారత్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని ఓ సంఘటన త్వరలో చోటు చేసుకోనుంది. పురుషుల జట్టుతో పాటు మహిళా క్రికెట్ జట్టు సభ్యులు కలిసి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ప్రయాణించనున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కోహ్లి సేన, మహిళా క్రికెట్ బృందం జూన్ 2న ముంబై నుంచి లండన్‌కు బయల్దేరనుంది. ఇలా పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఒకే విమానంలో కలిసి ప్రయాణించడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ ఈనెల 19న ముంబైలో సమావేశం కావాలని బీసీసీఐ అధికారులు సూచించారు. ఆనంతరం ఆటగాళ్లందరూ 14 రోజులు హోం క్వారంటైన్లో ఉంటారని, ఆ సమయంలో ఆటగాళ్లకు ఇంటివద్దే ఆర్టీపీసీఆర్ టెస్టులను నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలనుకున్న ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్లో ఉండి టెస్టులు చేయించుకోవాలని తెలిపింది. ఇంగ్లండ్ చేరుకున్నాక ఇరు జట్లు వారం రోజుల ఐసోలేషన్ తర్వాత ప్రాక్టీస్ ప్రారంభిస్తారని పేర్కొంది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పర్యటనలో భారత పురుషుల జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్ ఆడనుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే డబ్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూన్ 18న సౌతాంప్టన్ వేదికగా జరుగనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. మరోవైపు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జూన్ 16 నుంచి ప్రారంభంకానున్న మహిళల క్రికెట్ సమరంలో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: రీఎంట్రీ ఇచ్చిన ఆసీస్ స్టార్ ఆటగాళ్లు -
ఆఖరి వన్డేలోనూ టీమిండియా మహిళల ఓటమి
లక్నో: కెప్టెన్ మిథాలీ రాజ్(104 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించినా.. ఇతర బ్యాటర్లు దారుణంగా విఫలమవడంతో దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన ఆఖరి వన్డేలోనూ టీమిండియా మహిళలు 5 వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.3 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. మిథాలీ రాజ్ మినహా.. ప్రియా పూనియా (18), స్మృతి మంధాన (18), పూనమ్ రౌత్ (10), హేమలత (2), సుష్మ వర్మ (0) దారుణంగా విఫలమయ్యారు. హర్మన్‌ప్రీత్ కౌర్ (30) కుదురుగా ఆడుతున్న సమయంలో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగటం టీమిండియాకు భారీ నష్టమే చేకూర్చింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో నదీన్ డి క్లెర్క్ 3, షంగేస్, సేఖుకునే 2, కాప్‌కు ఒక వికెట్ దక్కింది. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా మహిళలు 48.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి 10 బంతులు మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్నందుకున్నారు. సఫారీ బ్యాటర్లలో డుప్రీజ్ (57), అన్నె బోష్(58), కాప్(36 నాటౌట్) రాణించారు. టీమిండియా బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 3, హేమలత, ప్రత్యూష తలో వికెట్ దక్కించుకున్నారు. అన్నె బోష్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కగా, లిజెల్ లీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్ దక్కించుకుంది. దీంతో 5 వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా మహిళలు 4-1తేడాతో గెలుపొందారు. ఇరు జట్ల మధ్య 3 టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఇదే వేదికగా మార్చి 20న ప్రారంభంకానుంది. -
భారత్ రికార్డ్ ఛేజింగ్; ఆసీస్‌పై గెలుపు
మెల్బోర్న్: ముక్కోణపు టి20 టోర్నీలో భారత మహిళల జట్టు రికార్డు ఛేజింగ్‌తో ఘన విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సమిష్టిగా రాణించి చివరి ఓవర్లో గెలిచింది. 174 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్మృతి మంధాన(55; 48 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించింది. 16 ఏళ్ల షెఫాలి వర్మ బ్యాట్‌తో చెలరేగింది. 18 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 49 పరుగులు చేసింది. ఒక్క పరుగు తేడాతో అర్ధసెంచరీ కోల్పోయింది. రోడ్రిగ్స్(30), కౌర్(20) నాటౌట్‌గా నిలిచారు. భారత మహిళల జట్టుకు టి20ల్లో ఇదే అతిపెద్ద ఛేజింగ్ కావడం విశేషం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు సాధించింది. గార్డ్నర్ విజృంభించి ఆడి 57 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 93 పరుగులు చేసింది. లానింగ్ 37 పరుగులతో ఫర్వాలేదనిపించింది. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు రెండు గెలిచి, రెండు ఓడింది. 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మూడు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచిన ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది. -
భారత మహిళలకు మరో ఓటమి
మెల్బోర్న్: ముక్కోణపు టి20 టోర్నీలో భారత మహిళల జట్టుకు వరుసగా మరో పరాజయం ఎదురైంది. తొలి ముఖాముఖిలో ఇంగ్లండ్‌ను ఓడించిన హర్మన్ సేన ఇప్పుడు రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు తలవంచింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్లతో భారత్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. స్మృతి మంధాన (40 బంతుల్లో 45; 7 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడగా, జెమీమా రోడ్రిగ్స్ (23) ఫర్వాలేదనిపించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అన్యా ష్రబ్సోల్ (3/31) భారత్‌ను దెబ్బ తీయగా, బ్రంట్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది. నటాలియా స్కివర్ (38 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో జట్టును గెలిపించింది. ఇతర ఆటగాళ్లంతా విఫలమైనా... స్కివర్ ఆటతో ఇంగ్లండ్ గట్టెక్కింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 3 వికెట్లు పడగొట్టింది. గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 4 వికెట్లతో ఓడిన భారత్... తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నేడు మళ్లీ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. -
భారత మహిళల జోరు
నార్త్‌సౌండ్: వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో తొలి వన్డేలో ఓడిన భారత మహిళల జట్టు వెంటనే కోలుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో వన్డేలో భారత్ 53 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ (128 బంతుల్లో 77; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కెప్టెన్ మిథాలీ రాజ్ (67 బంతుల్లో 40; 4 ఫోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (52 బంతుల్లో 46; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం వెస్టిండీస్ 47.2 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. క్యాంప్‌బెల్ (90 బంతుల్లో 39; 2 ఫోర్లు) టాప్‌స్కోరర్ కాగా...ముగ్గురు విభిన్న శైలి గల భారత స్పిన్నర్లు దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ తలా 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని పడగొట్టారు. భారత్ 17 పరుగులకే ఓపెనర్లు ప్రియా పూనియా (5), జెమీమా (0) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పూనమ్ రౌత్, మిథాలీ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. తొలి 9 ఓవర్లలో భారత్ ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్ కూడా లేకపోగా, మిథాలీ తాను ఎదుర్కొన్న మూడో బంతిని బౌండరీకి తరలించి బోణీ చేసింది. పూనమ్ మరీ నెమ్మదిగా ఆడుతూ వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేసింది. తన 70వ బంతికి గానీ ఆమె తొలి ఫోర్ కొట్టలేకపోయింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. అనంతరం పూనమ్‌తో జత కలిసిన హర్మన్ దూకుడుగా ఆడింది. పూనమ్ కూడా ధాటిని పెంచడంతో పరుగులు వేగంగా వచ్చాయి. 17.5 ఓవర్లలోనే వీరిద్దరు నాలుగో వికెట్‌కు 93 పరుగులు జత చేయడం విశేషం. ఆరు బంతుల వ్యవధిలో పూనమ్, హర్మన్ అవుటయ్యారు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ మొదటినుంచి తడబడుతూనే సాగింది. ఎవరూ భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (20) విఫలం కావడంతో ఆ జట్టు విజయంపై ఆశలు కోల్పోయింది. సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా చివరి వన్డే ఇదే వేదికపై బుధవారం జరుగుతుంది. -
భారత మహిళలదే ఎమర్జింగ్ కప్
కొలంబో: ఆసియా కప్ మహిళల ఎమర్జింగ్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. శ్రీలంక మహిళల జట్టుతో మంగళవారం జరిగిన ఫైనల్లో దేవిక వైద్య నాయకత్వంలోని టీమిండియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 14 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. తనుశ్రీ సర్కార్ (47; 4 ఫోర్లు), సిమ్రన్ బహదూర్ (34; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. భారత ఇన్నింగ్స్ తర్వాత వర్షం రావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతితో శ్రీలంక లక్ష్యాన్ని 35 ఓవర్లలో 150 పరుగులుగా సవరించారు. శ్రీలంక 34.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో తనుజా కన్వర్ (4/15), దేవిక వైద్య (4/29) నాలుగేసి వికెట్లు తీసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
వడోదర : ఐసీసీ చాంపియన్ షిప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే మొదటి వన్డేలో ఓడిపోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి, సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. అస్వస్థత కారణంగా మొదటి వన్డేకు దూరం అయినా కెప్టెన్ మిథాలి రాజ్ అందుబాటులోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం. -
ఇండియాతో మ్యాచ్; బంగ్లాదేశ్ ఫీల్డింగ్
బెంగళూరు: మహిళల టీ20 ప్రపంచప్ ఆరంభ మ్యాచ్ లో భారత్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పటిష్టమైన ఆస్ట్రేలియా, శ్రీలంకపై సిరీస్ విజయాలు సాధించిన భారత మహిళల జట్టు ప్రపంచప్ లోనూ జోరు కొనసాగించాలని భావిస్తోంది. గతంలో ఆడిన వరల్డ్‌కప్ టోర్నీల్లో రెండుసార్లు సెమీస్‌కు చేరిన భారత్... చివరి రెండుసార్లు మాత్రం గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. అయితే ఈసారి ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ టోర్నమెంట్లో మరోసారి సెమీస్‌కు చేరుకోవాలన్న లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. కెప్టెన్ మిథాలీ రాజ్‌తో పాటు ఏడుగురు క్రీడాకారిణిలకు 2014 టోర్నీలో ఆడిన అనుభవం ఉండడం భారత్ టీమ్ కు సానుకూలాశం. మరోవైపు జహనరా నేతృత్వంలోని బంగ్లా జట్టు కూడా ఈ మధ్య కాలంలో బాగానే ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు షాకిచ్చి టోర్నీలో ముందంజ వేయాలని బంగ్లాదేశ్ ప్రయత్నాలు చేస్తోంది.