NZW vs INDW: Harmanpreet Kaur gets dismissed in a bizarre manner, Video Viral - Sakshi
Sakshi News home page

IND vs NZ: అయ్యో హర్మన్‌ప్రీత్.. ఇలా రనౌట్‌ అయ్యావు ఏంటి?.. వీడియో వైరల్‌

Published Fri, Feb 18 2022 4:13 PM | Last Updated on Fri, Feb 18 2022 4:51 PM

Harmanpreet Kaur gets dismissed in a bizarre manner - Sakshi

న్యూజిలాండ్‌ మహిళలతో జరగిన రెండో వన్డేలో భారత స్టార్‌ బ్యాటర్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ అనూహ్య రీతిలో రనౌటైంది. భారత ఇన్నింగ్స్‌ 28 ఓవర్‌ వేసిన ఫ్రాన్సెస్ మాకై బౌలింగ్‌లో..  హర్మన్‌ప్రీత్  ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి బౌలర్‌ దిశగా షాట్‌ ఆడటానికి ప్రయత్నించింది.  ఈ క్రమంలో బంతి  బౌలర్‌ మాకై చేతికి వెళ్లింది. వెంటనే మాకై వేగంగా బంతిని కీపర్‌కి త్రో చేసింది. అయితే క్రీజులోకి తిరిగి చేరుకోవడానికి హర్మన్‌ప్రీత్ కొంచెం ఇబ్బంది పడింది. కాగా కీపర్‌ వెంటనే స్టంప్స్‌ పడగొట్టడంతో హర్మన్‌ప్రీత్ రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరింది. రనౌట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. భారత్‌పై న్యూజిలాండ్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో మేఘన(61), షఫాలీ వర్మ(51), దీప్తి శర్మ(69) పరుగులతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో హన్నా రోవ్, మైర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, మాకై, కేర్‌ చెరో వికెట్‌ సాధించారు. 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 7 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.

చదవండి: తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement