
భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో విశ్వరూపమే చూపెట్టింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (197 బంతుల్లో 205; 23 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించింది.

మరో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (161 బంతుల్లో 149; 27 ఫోర్లు, 1 సిక్స్) కూడా సఫారీ బౌలర్లను చితగ్గొట్టి మరీ శతకాన్ని పూర్తి చేసుకుంది.

టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్లు స్మృతి, షఫాలీ పరుగులు మొదలుపెట్టారు.































