భారత మహిళలకు మరో ఓటమి  | England Womens Team Won Against India Team | Sakshi
Sakshi News home page

భారత మహిళలకు మరో ఓటమి 

Published Sat, Feb 8 2020 2:24 AM | Last Updated on Sat, Feb 8 2020 2:24 AM

England Womens Team Won Against India Team - Sakshi

మెల్‌బోర్న్‌: ముక్కోణపు టి20 టోర్నీలో భారత మహిళల జట్టుకు వరుసగా మరో పరాజయం ఎదురైంది. తొలి ముఖాముఖిలో ఇంగ్లండ్‌ను ఓడించిన హర్మన్‌ సేన ఇప్పుడు రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు తలవంచింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 4 వికెట్లతో భారత్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. స్మృతి మంధాన (40 బంతుల్లో 45; 7 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడగా, జెమీమా రోడ్రిగ్స్‌ (23) ఫర్వాలేదనిపించింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అన్యా ష్రబ్‌సోల్‌ (3/31) భారత్‌ను దెబ్బ తీయగా, బ్రంట్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్‌ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది. నటాలియా స్కివర్‌ (38 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీతో జట్టును గెలిపించింది. ఇతర ఆటగాళ్లంతా విఫలమైనా... స్కివర్‌ ఆటతో ఇంగ్లండ్‌ గట్టెక్కింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్‌ 3 వికెట్లు పడగొట్టింది. గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 4 వికెట్లతో ఓడిన భారత్‌... తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో నేడు మళ్లీ ఆస్ట్రేలియాతో తలపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement