Tri Series tournament
-
సంయుక్తంగా రాణించిన బ్యాటర్లు.. పాకిస్తాన్‌దే ట్రై సిరీస్
న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో జరిగిన ముక్కోణపు టి20 టోర్నీలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. టి20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌కు ఈ విజయం మంచి ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రై సిరీస్‌కు ముందు ఆసియా కప్ ఫైనల్.. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ల్లో పాకిస్తాన్ ఓటమిపాలయింది. ఇక శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. పాక్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 34 పరుగులు), మహ్మద్ నవాజ్(22 బంతుల్లో 38 పరుగులు), హైదర్ అలీ(15 బంతుల్లో 31 పరుగులు).. చివర్లో ఇప్తికర్ అహ్మద్(14 బంతుల్లో 25 నాటౌట్) సంయుక్తంగా రాణించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 59 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. గ్లెన్ పిలిప్స్ 29, మార్క్ చాప్మన్ 25 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో నసీమ్ షా, హారిస్ రౌఫ్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్, నవాజ్‌లు చెరొక వికెట్ తీశారు. రేపు(శనివారం) ఆస్ట్రేలియాకు బయలుదేరనున్న పాకిస్తాన్ జట్టు టి20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో అక్టోబర్ 23న(ఆదివారం)తమ తొలి మ్యాచ్ ఆడనుంది. Nawaz and Iftikhar finish it for Pakistan in the final over 🏆#NZvPAK — ESPNcricinfo (@ESPNcricinfo) October 14, 2022 చదవండి: జర్నలిస్ట్ తిక్క ప్రశ్న.. బాబర్ ఆజం దిమ్మతిరిగే కౌంటర్ -
భారత్ రికార్డ్ ఛేజింగ్; ఆసీస్‌పై గెలుపు
మెల్బోర్న్: ముక్కోణపు టి20 టోర్నీలో భారత మహిళల జట్టు రికార్డు ఛేజింగ్‌తో ఘన విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సమిష్టిగా రాణించి చివరి ఓవర్లో గెలిచింది. 174 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్మృతి మంధాన(55; 48 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించింది. 16 ఏళ్ల షెఫాలి వర్మ బ్యాట్‌తో చెలరేగింది. 18 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 49 పరుగులు చేసింది. ఒక్క పరుగు తేడాతో అర్ధసెంచరీ కోల్పోయింది. రోడ్రిగ్స్(30), కౌర్(20) నాటౌట్‌గా నిలిచారు. భారత మహిళల జట్టుకు టి20ల్లో ఇదే అతిపెద్ద ఛేజింగ్ కావడం విశేషం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు సాధించింది. గార్డ్నర్ విజృంభించి ఆడి 57 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 93 పరుగులు చేసింది. లానింగ్ 37 పరుగులతో ఫర్వాలేదనిపించింది. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు రెండు గెలిచి, రెండు ఓడింది. 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మూడు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచిన ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది. -
భారత మహిళలకు మరో ఓటమి
మెల్బోర్న్: ముక్కోణపు టి20 టోర్నీలో భారత మహిళల జట్టుకు వరుసగా మరో పరాజయం ఎదురైంది. తొలి ముఖాముఖిలో ఇంగ్లండ్‌ను ఓడించిన హర్మన్ సేన ఇప్పుడు రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు తలవంచింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్లతో భారత్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. స్మృతి మంధాన (40 బంతుల్లో 45; 7 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడగా, జెమీమా రోడ్రిగ్స్ (23) ఫర్వాలేదనిపించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అన్యా ష్రబ్సోల్ (3/31) భారత్‌ను దెబ్బ తీయగా, బ్రంట్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది. నటాలియా స్కివర్ (38 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో జట్టును గెలిపించింది. ఇతర ఆటగాళ్లంతా విఫలమైనా... స్కివర్ ఆటతో ఇంగ్లండ్ గట్టెక్కింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 3 వికెట్లు పడగొట్టింది. గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 4 వికెట్లతో ఓడిన భారత్... తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నేడు మళ్లీ ఆస్ట్రేలియాతో తలపడుతుంది.