జులన్ గోస్వామి అరుదైన ఫీట్ | jhulan Goswami becomes leading wicket-taker in women's ODIs | Sakshi
Sakshi News home page

జులన్ గోస్వామి అరుదైన ఫీట్

Published Tue, May 9 2017 7:18 PM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

జులన్ గోస్వామి అరుదైన ఫీట్

జులన్ గోస్వామి అరుదైన ఫీట్

పోచెస్ట్రూమ్: భారత మహిళా క్రికెట్ జట్టు ప్రధాన పేసర్ జులన్ గోస్వామి అరుదైన ఫీట్ ను సొంతం చేసుకుంది. మహిళల క్రికెట్ లో భాగంగా వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఘనతను గోస్వామి తాజాగా తన ఖాతాలో వేసుకుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న క్వాడ్రాంగులర్ సిరీస్ లో భాగంగా మంగళవారం సఫారీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో గోస్వామి అత్యధిక వికెట్ల ఘనతను సాధించింది.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లోమూడు  వికెట్లు సాధించిన గోస్వామి.. ఓవరాల్ గా వన్డేల్లో 181 వికెట్లను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మహిళా బౌలర్ కాథరిన్ ఫిట్జ్పాట్రిక్స్ ను రికార్డును అధిగమించింది. దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ట్విట్టర్ లో ఆమెకు అభినందనలు తెలియజేసింది. ఇప్పటికే జులన్ ఎన్నో ఘనతల్ని సాధించిందని కొనియాడింది. ఈ మ్యాచ్ లో గోస్వామితో పాటు శిఖా పాండే మూడు వికెట్లతో రాణించడంతో దక్షిణాఫ్రికా 39.3 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement