IPL 2025: ముంబై ఇండియన్స్‌తో జతకట్టిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ | CORBIN BOSCH REPLACES LIZAAD WILLIAMS IN MUMBAI INDIANS FOR IPL 2025 | Sakshi
Sakshi News home page

IPL 2025: ముంబై ఇండియన్స్‌తో జతకట్టిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌

Published Sat, Mar 8 2025 6:19 PM | Last Updated on Sat, Mar 8 2025 7:30 PM

CORBIN BOSCH REPLACES LIZAAD WILLIAMS IN MUMBAI INDIANS FOR IPL 2025

సౌతాఫ్రికా ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కార్బిన్‌ బాష్‌ ఫైవ్‌ టైమ్‌ ఐపీఎల్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో జతకట్టాడు. సహచరుడు లిజాడ్‌ విలియమ్స్‌ గాయం కారణంగా తదుపరి సీజన్‌కు దూరం కావడంతో అతని స్థానాన్ని బాష్‌ భర్తీ చేస్తున్నాడు. 30 ఏళ్ల బాష్‌ను ముంబై ఇండియన్స్‌ తమ హ్యామిలీలోకి ఆహ్వానించింది. రైట్‌ హ్యాండ్‌ బ్యాట్‌, రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ వేసే బాష్‌ సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్‌, 2 వన్డేలు ఆడాడు. బాష్‌ గతేడాది డిసెంబర్‌లో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేశాడు.

బాష్‌ తన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బాష్‌ తొలి ఇన్నింగ్స్‌లో అజేయమైన 81 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 4 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో బాష్‌ అద్భుత ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కారణంగా సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

ఈ మ్యాచ్‌కు ముందు బాష్‌ అదే పాకిస్తాన్‌పైనే వన్డే అరంగేట్రం చేశాడు. బాష్‌ ఇప్పటివరకు 2 వన్డేలు ఆడి 2 వికెట్లు సహా 55 పరుగులు చేశాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లో బాష్‌ 44 బంతుల్లో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదే అతనికి వన్డేల్లో అత్యధిక స్కోర్‌. బాష్‌ తన రెండో వన్డేను కూడా పాక్‌తోనే ఆడాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు జరిగిన ట్రై సిరీస్‌లో బాష్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌లో ఆడాడు.

అంతర్జాతీయ అరంగేట్రం అనంతరం బాష్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది బాష్‌ ఎంఐ కేప్‌టౌన్‌ తరఫున బరిలో నిలిచాడు. ఈ సీజన్‌లో బాష్‌ 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి ఎంఐ కేప్‌టౌన్‌ తమ తొలి టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

బాష్‌ సౌతాఫ్రికా 2014 అండర్‌-19 వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాడు పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో చెలరేగి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో బాష్‌ 4 వికెట్లు తీశాడు. 

బాష్‌ తన కెరీర్‌లో వివిధ ఫార్మాట్లలో ఇప్పటివరకు 2500కు పైగా పరుగులు చేసి 150కిపైగా వికెట్లు తీశాడు. బాష్‌ టీ20ల్లో 86 మ్యాచ్‌లు ఆడి 59 వికెట్లు తీశాడు. బాష్‌ చేరికతో ముంబై ఇండియన్స్‌లో ఆల్‌రౌండర్ల సంఖ్య 9కి చేరింది. ఇప్పటికే ఆ జట్టులో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, బెవాన్‌ జాకబ్స్‌, మిచెల్‌ సాంట్నర్‌, విల్‌ జాక్స్‌, అర్జున్‌ టెండూల్కర్‌ తదితర ఆల్‌రౌండర్లు ఉన్నారు. 

త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌-2025 ఎడిషన్‌లో ముంబై తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై సీఎస్‌కేను ఢీకొంటుంది.

ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియన్స్‌..
రోహిత్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార​ యాదవ్‌, నమన్‌ ధిర్‌, బెవాన్‌ జాకబ్స్‌, రాజ్‌ బవా, విల్‌ జాక్స్‌, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), విజ్ఞేశ్‌ పుథుర్‌, సత్యనారాయణ రాజు, కార్బిన్‌ బాష్‌, మిచెల్‌ సాంట్నర్‌, అర్జున్‌ టెండూల్కర్‌, ర్యాన్‌ రికెల్టన్‌, కృష్ణణ్‌ శ్రీజిత్‌, రాబిన్‌ మింజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అశ్వనీ కుమార్‌, కర్ణ్‌ శర్మ, ట్రెంట్‌ బౌల్ట్‌, దీపక్‌ చాహర్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement