Indian women cricketer
-
‘క్రికెట్ వదిలెయ్.. పిల్లల్ని చూసుకో.. మా అమ్మను పట్టించుకుంటావా? లేదా?’
భారత మహిళా క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న మేటి బ్యాటర్ మిథాలీ రాజ్. అంతర్జాతీయ స్థాయిలో తన ఆట తీరుతో జట్టుకు ఎన్నో విజయాలు అందించిన సారథి. క్రికెట్ కోసం తన వ్యక్తిగత జీవితాన్ని సైతం పణంగా పెట్టిన ఈ దిగ్గజ ప్లేయర్.. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.అయితే, అందరు ఆడపిల్లలాగే తనకు కూడా సమాజం నుంచి వివాహం విషయంలో ఎదురైన ఇబ్బందులు, అబ్బాయిల ఆలోచనా విధానం గురించి మిథాలీ రాజ్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. రణ్వీర్ అల్హాబాదియా షోలో మాట్లాడుతూ.. ‘‘మా అమ్మ, పిన్ని పదే పదే పెళ్లి గురించి ప్రస్తావించేవారు. అందుకే కొన్నిసార్లు వాళ్ల మాటలు విని.. అబ్బాయి(పెళ్లి కొడుకు)లతో మాట్లాడేందుకు సిద్ధమయ్యాను.అందులో చాలా మంది.. ఎంత మంది పిల్లల్ని కనాలి?! వారి ఆలనాపాలనా చూసుకునేందుకు ఇంట్లోనే ఉంటావా? ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు. పెళ్లి తర్వాత క్రికెట్ వదిలేయాలనేది వారి ఉద్దేశం. ఇవన్నీ నా ఊహకు కూడా అందని విషయాలు. అంతకుముందు ఎప్పుడూ ఎవరితో నేను ఇలాంటివి చర్చించనూ కూడా లేదు.మా అమ్మను చూసుకుంటావా? లేదంటే..నా ధ్యాస ఎల్లప్పుడూ క్రికెట్ మీదే. అప్పట్లో నేను భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నాను. ఆ సమయంలో ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అతడు నన్ను ఓ వింత ప్రశ్న అడిగాడు. ‘పెళ్లైన తర్వాత నువ్వు మా అమ్మను చూసుకుంటావా? లేదంటే క్రికెట్ ఆడటానికి వెళ్తావా?’ అన్నాడు. అందుకు నేను వెంటనే.. ‘ఇదేం ప్రశ్న’ అన్నాడు.అతడు బదులిస్తూ.. ‘ఒకవేళ మా అమ్మకు ఏదైనా జరిగితే నువ్వు ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా చూసుకుంటావా? లేదంటే ఆ కోసం వెళ్తావా? రెండింటిలో నీకు ఏది అత్యంత ముఖ్యమైనదో తెలుసుకోవాలనుకుంటున్నా’ అన్నాడు. ‘పరిస్థితిని బట్టి నా ప్రవర్తన ఉంటుంది’ అని నేను సమాధానమిచ్చాను.కొన్నిసార్లు జీవితంలో అడ్జస్ట్ అవ్వాలని..క్రికెటర్లలో నా ఫ్రెండ్ ఒకరు కూడా ఇదే మాట అన్నారు. కొన్నిసార్లు జీవితంలో అడ్జస్ట్ అవకతప్పదని.. ఎదుటి వ్యక్తికి అనుగుణంగా జీవనశైలిని మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పింది. సాధారణంగా మగవాళ్లంతా ఇలాంటి ప్రశ్నలే అడుగుతారని.. పెళ్లి తర్వాత పిల్లలు, ఇల్లు చూసుకోవడమే మన మొదటి ప్రాధాన్యం అయి ఉండాలని కోరుకుంటారని చెప్పింది.అలాంటి వాడి కోసం నేనెందుకు మారాలి?కానీ మనసులో మాత్రం ఒకటే మెదిలింది. క్రికెటర్‌ను అయ్యే క్రమంలో నా తల్లిదండ్రులు, నేను ఎన్నో త్యాగాలు చేశాం. కానీ ఎవరో ఒక వ్యక్తి.. అది కూడా నా కెరీర్‌ను వదిలేసి.. ఇంటిని చూసుకోవడానికి మాత్రమే పరిమితం కావాలనే వ్యక్తి.. అలాంటి వాడి కోసం నేనెందుకు ఆటను వదిలేయాలని గట్టిగా అనుకున్నాను’’ అని మిథాలీ రాజ్ తన మనసులోని భావాలను పంచుకుంది. సింగిల్‌గానే సంతోషంగా ఉన్నామరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యుక్త వయసులో ఉన్నపుడు పెళ్లి సంబంధాలు ఎక్కువగా వచ్చేవని.. ఇప్పట్లో మాత్రం తనకు అలాంటి ఆలోచనలేవీ లేవని మిథాలీ రాజ్ చెప్పుకొచ్చింది. పెళ్లైన వాళ్లను చూస్తూ ఉంటే.. తానిలా సింగిల్‌గా ఉండటమే మంచిదనే భావన బలపడుతోందని నవ్వులు చిందించింది 42 ఏళ్ల మిథాలీ రాజ్. అన్నట్లు చెప్పలేదు కదూ నేడు ఈ లెజెండరీ క్రికెటర్ పుట్టినరోజు(డిసెంబరు 3). హ్యాపీ బర్త్‌డే క్రికెట్ క్వీన్! 👉మిథాలీ రాజ్ కెరీర్ విశేషాలు.. ఐదు ఆసక్తికర విశేషాలు! -
టైమ్ 100 నవ్య సారథుల జాబితాలో హర్మన్‌ప్రీత్
న్యూయార్క్: భిన్న రంగాల్లో విశేష కృషిచేస్తూ ప్రపంచ గతిని మార్చే కొత్త తరం సారథుల జాబితా అంటూ ప్రఖ్యాత మ్యాగజైన్ టైమ్ తీసుకొచ్చిన జాబితాలో భారతీయ మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ స్థానం దక్కించుకున్నారు. 2023 టైమ్ 100 నెక్స్ట్: ది ఎమర్జింగ్ లీడర్స్ షేపింగ్ ది వరల్డ్ పేరిట 100 పేర్లతో ఈ జాబితాను సిద్ధంచేశారు. ‘ఆటలో పోటీతత్వం, రగిలిపోయే క్రీడాసక్తితో హర్మన్‌ప్రీత్.. మహిళా క్రికెట్‌ను ప్రపంచంలో విలువైన క్రీడా ఆస్తిగా మలిచారు’ అని టైమ్ పొగిడింది. క్షయ వ్యాధి సోకడంతో అతిగా ఔషధాలు వాడి, వాటి దుష్ప్రభావంతో వినికిడి శక్తిని కోల్పోయినా మెరుగైన డ్రగ్ కోసం పోరాడి విజయం సాధించిన నందితా వెంకటేశన్ పేరూ ఈ జాబితాలో ఉంది. ఈమె కృషి ఫలితంగానే భారత్‌లో క్షయ చికిత్సకు మరింత మెరుగైన జనరిక్ మందులు అందుబాటులోకి వచ్చాయి. పర్యావరణహిత నిర్మాణాలతో మంచి పేరు తెచ్చుకున్న వినూ డేనియల్ పేరూ ఈ జాబితాలో ఉంది. -
Poonam Yadav : బిగ్‌బాష్ లీగ్‌లో పూనం.. ఏ జట్టుకు ఆడబోతోందంటే!
India Leg Spinner Punam Yadav: ఆస్ట్రేలియా వేదికగా ఈనెల 14న మొదలయ్యే మహిళల బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ బరిలోకి దిగనుంది. ఈ మేరకు ఆమె బ్రిస్బేన్ హీట్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సీజన్ బిగ్‌బాష్ లీగ్‌లో భారత్ నుంచి స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్స్), షఫాలీ వర్మ, రాధా యాదవ్ (సిడ్నీ సిక్సర్స్), హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ (మెల్బోర్న్ రెనెగెడ్స్), రిచా ఘోష్ (హోబర్ట్ హరికేన్స్) ఆడనున్నారు. నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టి20 వర్షంతో రద్దయిన తొలి టి20లో కనబర్చిన బ్యాటింగ్ దూకుడును పునరావృతం చేసేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. గోల్డ్‌కోస్ట్ వేదికగా నేడు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండో టి20 జరగనుంది. ఇందులో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచేందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత్ పట్టుదలగా ఉంది. మధ్యాహ్నం గం. 1.40 నుంచి సోనీ సిక్స్ చానెల్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. చదవండి: MI Vs SRH: ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించిన మహ్మద్ నబీ -
'నువ్వు చెప్పేది వినొద్దంటా'; కార్తీక్‌ను ట్రోల్ చేసిన మహిళా క్రికెటర్
లండన్: టీమిండియా వుమెన్స్ క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ దినేశ్ కార్తీక్‌ను ట్రోల్ చేసింది. క్రికెటర్‌గా కొనసాగుతున్న కార్తీక్ ఇటీవలే కామెంటేటర్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కార్తీన్ లండన్‌లో కౌంటీ క్రికెట్లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక జేమిమా రోడ్రిగ్స్ హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్ టోర్నీలో నార్తన్ సూపర్ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. కాగా మంగళవారం ఆమె కామెంటేటర్ అవతారం ఎత్తారు. నాసిర్ హుస్సేన్, రాబ్ కీతో కలిసి కామెంటరీ చేశారు. ఈ సందర్భంగా రోడ్రిగ్స్‌ను ఉద్దేశించి దినేశ్ కార్తీక్ ట్విటర్లో ఫన్నీగా కామెంట్ చేశాడు. ''ఇంగ్లీష్ కామెంటేటర్లయిన నాసిర్ హుస్సేన్, రాబ్ కీలు ఏం చెప్పినా వినకుండా నీ స్టైల్లో కామెంటరీ చేయ్..'' అంటూ తెలిపాడు. కార్తీక్ ట్వీట్‌పై స్పందించిన రోడ్రిగ్స్ తనదైన శైలిలో బదులిచ్చింది. '' హహ్హహ.. నువ్వు ఇప్పుడు ఏం చెప్పావో.. వాళ్లు కూడా అదే చెప్పారు.. నువ్వు చెప్పేది ఏది వినకూడదని.. అవన్నీ అబద్దాలేనని'' అంటూ లాఫింగ్ ఎమోజీతో కామెంట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక వుమెన్స్ హండ్రెడ్ 2021 కాంపీటీషన్లో జెమిమా రోడ్రిగ్స్ మంచి ప్రదర్శన కనబరుస్తుంది. వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 92 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఆమె లండన్ స్పిరిట్, ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో అర్థ శతకాలతో మెరిసింది. ఇక ఈ టోర్నీలో నార్తన్ సూపర్ చార్జర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక టీమిండియా తరపున 2018లో అరంగేట్రం చేసిన ఆమె 47 టీ20ల్లో 976 పరుగులు.. 21 వన్డేల్లో 394 పరుగులు చేసింది. HAHAHAHAHAHA!! Interestingly enough, that's EXACTLY what they told me about anything you say! 😂😂😂 https://t.co/Z4G4HU5r8B — Jemimah Rodrigues (@JemiRodrigues) August 11, 2021 -
మంధన అందానికి ఫిదా!
ఇంగ్లండ్ లో జరుగుతున్న మహిళల వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లను అభిమానులు క్రమం తప్పకుండా చూస్తున్నారట. అందులోనూ భారత్ ఆడే మ్యాచ్‌లను అస్సలు మిస్ కావడం లేదట. అంటే, మన మహిళా క్రికెట్ కు మంచి రోజులు వచ్చినట్లే అనుకుంటున్నారా. అయితే ఇక్కడ మీరు పొరబడినట్లే. ఆ మ్యాచ్‌లను చూసేది భారత మహిళా ఓపెనర్ స్మృతి మంధనా కోసమట. వన్డే వరల్డ్ కప్ లో ప్రత్యర్థి జట్లకు కొరకరాని కొయ్యగా తయారైన మంధనకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. భారత జట్టు మ్యాచ్ గెలిచినా, గెలవకపోయినా.. ఆమె కనిపించి ఒక నవ్వు నవ్వితే చాలు డబుల్ సెంచరీ కొట్టినంత ఆనందంగా ఉందని అంటున్నారు అభిమానులు.. ప్రస్తుతం కుర్రకారు అమితంగా ఇష్టపడే జాబితాలో మంధనకు కూడా చేరిపోయింది. ఇక్కడ సోషల్ మీడియాలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ నటి దిషా పటానిని సైతం మంధన అధిగమించేసింది. ఇప్పటి వరకూ దిషా పటాని హాట్ లుక్స్‌కు ఫిదా అయిపోయిన ఫ్యాన్స్.. మంధన అమాయకపు చూపులకు తమను తాము మైమరిచిపోతున్నారు. మరికొంతమందైతే అసలు దిషా పటానికి, మంధనకు పోలికా లేదని తేల్చిపారేస్తున్నారు. 'నాకు దిషా వద్దు.. మంధననే ముద్దు' అనేంతగా ఊహల్లో ఊరిగేపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహిళా వన్డే వరల్డ్ కప్ లో తన పవర్ ఫుల్ బ్యాటింగ్ తో మంధన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 90 పరుగులు చేయగా, వెస్టిండీస్ తో మ్యాచ్ లోఅజేయంగా 106 పరుగులు చేసి విజయాల్లో కీలక పాత్ర పోషించింది. Sorry to all girls and heroines... Coz #SmritiMandhana is my new crush.. #INDvPAK pic.twitter.com/puJCwaes4G — Ch rahul (@Chrahul7) 4 July 2017 Admit it that Smriti mandhana has became the new national crush of India #INDvPAK #SmritiMandhana pic.twitter.com/geJn5KcyY0 — Anonymous (@Anonymu06393546) 3 July 2017 Admit it... She's the national Crush now beating Disha Patani!!!#INDvPAK #SmritiMandhana pic.twitter.com/f6Ipyy7ZC9 — Trendz Now (@TrendzNowYT) 2 July 2017 Smiriti Mandhana New Crush #INDvPAK #ICCWomensWorldCup pic.twitter.com/M43E03hEtg — Troll Master (@imTrollmaster) 2 July 2017 Right NoW India NeW Crush Smriti Mandhana #INDvPAK #PakvInd #INDWvPAKW #ICCWomensWorldCup @mandhana_smriti pic.twitter.com/6iyWi4nteV — Troll Master (@imTrollmaster) 2 July 2017 -
జులన్ గోస్వామి అరుదైన ఫీట్
పోచెస్ట్రూమ్: భారత మహిళా క్రికెట్ జట్టు ప్రధాన పేసర్ జులన్ గోస్వామి అరుదైన ఫీట్ ను సొంతం చేసుకుంది. మహిళల క్రికెట్ లో భాగంగా వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఘనతను గోస్వామి తాజాగా తన ఖాతాలో వేసుకుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న క్వాడ్రాంగులర్ సిరీస్ లో భాగంగా మంగళవారం సఫారీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో గోస్వామి అత్యధిక వికెట్ల ఘనతను సాధించింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లోమూడు వికెట్లు సాధించిన గోస్వామి.. ఓవరాల్ గా వన్డేల్లో 181 వికెట్లను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మహిళా బౌలర్ కాథరిన్ ఫిట్జ్పాట్రిక్స్ ను రికార్డును అధిగమించింది. దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ట్విట్టర్ లో ఆమెకు అభినందనలు తెలియజేసింది. ఇప్పటికే జులన్ ఎన్నో ఘనతల్ని సాధించిందని కొనియాడింది. ఈ మ్యాచ్ లో గోస్వామితో పాటు శిఖా పాండే మూడు వికెట్లతో రాణించడంతో దక్షిణాఫ్రికా 39.3 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది.