మంధన అందానికి ఫిదా! | Smriti Mandhana is India’s Crush Along With Disha Patani: Stop Comparing Indian Cricket Player With Bollywood Actress | Sakshi
Sakshi News home page

మంధన అందానికి ఫిదా!

Published Thu, Jul 6 2017 1:43 PM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

మంధన అందానికి ఫిదా!

మంధన అందానికి ఫిదా!

ఇంగ్లండ్ లో జరుగుతున్న మహిళల వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లను అభిమానులు క్రమం తప్పకుండా చూస్తున్నారట. అందులోనూ భారత్ ఆడే మ్యాచ్లను అస్సలు మిస్ కావడం లేదట. అంటే, మన మహిళా క్రికెట్ కు మంచి రోజులు వచ్చినట్లే అనుకుంటున్నారా. అయితే ఇక్కడ మీరు పొరబడినట్లే. ఆ మ్యాచ్లను చూసేది భారత మహిళా ఓపెనర్ స్మృతి మంధనా కోసమట. వన్డే వరల్డ్ కప్ లో ప్రత్యర్థి జట్లకు కొరకరాని కొయ్యగా తయారైన మంధనకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. భారత జట్టు మ్యాచ్ గెలిచినా, గెలవకపోయినా.. ఆమె కనిపించి ఒక నవ్వు నవ్వితే చాలు డబుల్ సెంచరీ కొట్టినంత ఆనందంగా ఉందని అంటున్నారు అభిమానులు..


ప్రస్తుతం కుర్రకారు అమితంగా ఇష్టపడే జాబితాలో మంధనకు కూడా చేరిపోయింది. ఇక్కడ సోషల్ మీడియాలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ నటి దిషా పటానిని సైతం మంధన అధిగమించేసింది. ఇప్పటి వరకూ దిషా పటాని హాట్ లుక్స్కు ఫిదా అయిపోయిన ఫ్యాన్స్.. మంధన అమాయకపు చూపులకు తమను తాము మైమరిచిపోతున్నారు. మరికొంతమందైతే అసలు దిషా పటానికి, మంధనకు పోలికా లేదని తేల్చిపారేస్తున్నారు. 'నాకు దిషా వద్దు.. మంధననే ముద్దు' అనేంతగా ఊహల్లో ఊరిగేపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహిళా వన్డే వరల్డ్ కప్ లో తన పవర్ ఫుల్ బ్యాటింగ్ తో మంధన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 90 పరుగులు చేయగా, వెస్టిండీస్ తో మ్యాచ్ లోఅజేయంగా 106 పరుగులు చేసి విజయాల్లో కీలక  పాత్ర పోషించింది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement