న్యూయార్క్: భిన్న రంగాల్లో విశేష కృషిచేస్తూ ప్రపంచ గతిని మార్చే కొత్త తరం సారథుల జాబితా అంటూ ప్రఖ్యాత మ్యాగజైన్ టైమ్ తీసుకొచ్చిన జాబితాలో భారతీయ మహిళా క్రికెటర్ హర్‌మన్‌ప్రీత్ స్థానం దక్కించుకున్నారు. 2023 టైమ్ 100 నెక్స్ట్: ది ఎమర్జింగ్ లీడర్స్ షేపింగ్ ది వరల్డ్ పేరిట 100 పేర్లతో ఈ జాబితాను సిద్ధంచేశారు. ‘ఆటలో పోటీతత్వం, రగిలిపోయే క్రీడాసక్తితో హర్‌మన్‌ప్రీత్.. మహిళా క్రికెట్‌ను ప్రపంచంలో విలువైన క్రీడా ఆస్తిగా మలిచారు’ అని టైమ్ పొగిడింది.
క్షయ వ్యాధి సోకడంతో అతిగా ఔషధాలు వాడి, వాటి దుష్ప్రభావంతో వినికిడి శక్తిని కోల్పోయినా మెరుగైన డ్రగ్ కోసం పోరాడి విజయం సాధించిన నందితా వెంకటేశన్ పేరూ ఈ జాబితాలో ఉంది. ఈమె కృషి ఫలితంగానే భారత్‌లో క్షయ చికిత్సకు మరింత మెరుగైన జనరిక్ మందులు అందుబాటులోకి వచ్చాయి. పర్యావరణహిత నిర్మాణాలతో మంచి పేరు తెచ్చుకున్న వినూ డేనియల్ పేరూ ఈ జాబితాలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment