లండన్: టీమిండియా వుమెన్స్ క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ దినేశ్ కార్తీక్‌ను ట్రోల్ చేసింది. క్రికెటర్‌గా కొనసాగుతున్న కార్తీక్ ఇటీవలే కామెంటేటర్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కార్తీన్ లండన్‌లో కౌంటీ క్రికెట్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక జేమిమా రోడ్రిగ్స్ హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్ టోర్నీలో నార్తన్ సూపర్ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. కాగా మంగళవారం ఆమె కామెంటేటర్ అవతారం ఎత్తారు. నాసిర్ హుస్సేన్, రాబ్ కీతో కలిసి కామెంటరీ చేశారు.
ఈ సందర్భంగా రోడ్రిగ్స్‌ను ఉద్దేశించి దినేశ్ కార్తీక్ ట్విటర్‌లో ఫన్నీగా కామెంట్ చేశాడు. ''ఇంగ్లీష్ కామెంటేటర్లయిన నాసిర్ హుస్సేన్, రాబ్ కీలు ఏం చెప్పినా వినకుండా నీ స్టైల్లో కామెంటరీ చేయ్..'' అంటూ తెలిపాడు. కార్తీక్ ట్వీట్‌పై స్పందించిన రోడ్రిగ్స్ తనదైన శైలిలో బదులిచ్చింది. '' హహ్హహ.. నువ్వు ఇప్పుడు ఏం చెప్పావో.. వాళ్లు కూడా అదే చెప్పారు.. నువ్వు చెప్పేది ఏది వినకూడదని.. అవన్నీ అబద్దాలేనని'' అంటూ లాఫింగ్ ఎమోజీతో కామెంట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక వుమెన్స్ హండ్రెడ్ 2021 కాంపీటీషన్‌లో జెమిమా రోడ్రిగ్స్ మంచి ప్రదర్శన కనబరుస్తుంది. వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 92 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఆమె లండన్ స్పిరిట్, ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో అర్థ శతకాలతో మెరిసింది. ఇక ఈ టోర్నీలో నార్తన్ సూపర్ చార్జర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక టీమిండియా తరపున 2018లో అరంగేట్రం చేసిన ఆమె 47 టీ20ల్లో 976 పరుగులు.. 21 వన్డేల్లో 394 పరుగులు చేసింది.
HAHAHAHAHAHA!! Interestingly enough, that's EXACTLY what they told me about anything you say! 😂😂😂 https://t.co/Z4G4HU5r8B
— Jemimah Rodrigues (@JemiRodrigues) August 11, 2021
Comments
Please login to add a commentAdd a comment