Poonam Yadav : బిగ్‌బాష్‌ లీగ్‌లో పూనం.. ఏ జట్టుకు ఆడబోతోందంటే! | India Leg Spinner Punam Yadav To Participate In WBBL For This Team | Sakshi
Sakshi News home page

Poonam Yadav : బిగ్‌బాష్‌ లీగ్‌లో మరో భారత మహిళా క్రికెటర్‌

Published Sat, Oct 9 2021 9:26 AM | Last Updated on Sat, Oct 9 2021 10:10 AM

India Leg Spinner Punam Yadav To Participate In WBBL For This Team - Sakshi

India Leg Spinner Punam Yadav: ఆస్ట్రేలియా వేదికగా ఈనెల 14న మొదలయ్యే మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత మహిళా క్రికెటర్‌ పూనమ్‌ యాదవ్‌ బరిలోకి దిగనుంది. ఈ మేరకు ఆమె బ్రిస్బేన్‌ హీట్‌ జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సీజన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో భారత్‌ నుంచి స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్స్‌), షఫాలీ వర్మ, రాధా యాదవ్‌ (సిడ్నీ సిక్సర్స్‌),  హర్మన్‌ప్రీత్‌ కౌర్, జెమీమా రోడ్రిగ్స్‌ (మెల్‌బోర్న్‌ రెనెగెడ్స్‌), రిచా ఘోష్‌ (హోబర్ట్‌ హరికేన్స్‌) ఆడనున్నారు.    

నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టి20  
వర్షంతో రద్దయిన తొలి టి20లో కనబర్చిన బ్యాటింగ్‌ దూకుడును పునరావృతం చేసేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. గోల్డ్‌కోస్ట్‌ వేదికగా నేడు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండో టి20 జరగనుంది. ఇందులో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచేందుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీలోని భారత్‌ పట్టుదలగా ఉంది. మధ్యాహ్నం గం. 1.40 నుంచి సోనీ సిక్స్‌ చానెల్‌లో ఈ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం కానుంది.   

చదవండి: MI Vs SRH: ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన మహ్మద్‌ నబీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement