IPL 2023: Matthew Short Replaces Jonny Bairstow In PBKS Squad, More Info Inside - Sakshi
Sakshi News home page

IPL 2023, PBKS: బెయిర్‌స్టో స్థానాన్ని భర్తీ చేయనున్న ఆసీస్‌ విధ్వంసకర బ్యాటర్‌

Published Sat, Mar 25 2023 6:18 PM | Last Updated on Fri, Mar 31 2023 10:09 AM

IPL 2023: Matthew Short Replaces Jonny Bairstow In PBKS squad - Sakshi

పంజాబ్‌ కింగ్స్‌.. గాయపడిన తమ డాషింగ్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టో స్థానాన్ని ఆస్ట్రేలియా విధ్వంసకర ప్లేయర్‌తో భర్తీ చేసింది. గత బిగ్‌బాష్‌ లీగ్‌ సీజన్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌ అవార్డు గెలుచుకున్న అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ ఆల్‌రౌండర్‌ మాథ్యూ షార్ట్‌ను పంజాబ్‌ కింగ్స్‌ బెయిర్‌స్టో రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యం ఇవాళ (మార్చి 25) అధికారికంగా వెల్లడించింది.  

గోల్ఫ్‌ ఆడుతూ కిందపడిన బెయిర్‌స్టో.. పాత గాయం తిరగబెట్టడంతో కొద్ది రోజులుగా రిహాబ్‌లో ఉన్నాడు. గాయం ఎంతకీ మానకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పంజాబ్‌ అతన్ని తప్పించి షార్ట్‌ను ఎంపిక చేసింది. పంజాబ్‌ కింగ్స్‌.. 2022 మెగా వేలంలో బెయిర్‌స్టోను రూ. 9.75 భారీ ధర వెచ్చింది సొంతం చేసుకుంది. తనకు చెల్లించిన డబ్బుకు న్యాయం చేస్తూ.. బెయిర్‌స్టో గత సీజన్‌లో మెరుగ్గా రాణించాడు.

2022 ఐపీఎల్‌లో 11 ఇన్నింగ్స్‌లు ఆడిన బెయిర్‌స్టో 144.57 స్ట్రయిక్‌ రేట్‌తో 253 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక, మాథ్యూ షార్ట్‌ విషయానికొస్తే.. ఈ అడిలైడ్‌ బ్యాటర్‌ గత బీబీఎల్‌ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌ల్లో 144 స్ట్రయిక్‌ రేట్‌తో 458 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement