Poonam Yadav
-
Poonam Yadav : బిగ్‌బాష్ లీగ్‌లో పూనం.. ఏ జట్టుకు ఆడబోతోందంటే!
India Leg Spinner Punam Yadav: ఆస్ట్రేలియా వేదికగా ఈనెల 14న మొదలయ్యే మహిళల బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ బరిలోకి దిగనుంది. ఈ మేరకు ఆమె బ్రిస్బేన్ హీట్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సీజన్ బిగ్‌బాష్ లీగ్‌లో భారత్ నుంచి స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్స్), షఫాలీ వర్మ, రాధా యాదవ్ (సిడ్నీ సిక్సర్స్), హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ (మెల్బోర్న్ రెనెగెడ్స్), రిచా ఘోష్ (హోబర్ట్ హరికేన్స్) ఆడనున్నారు. నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టి20 వర్షంతో రద్దయిన తొలి టి20లో కనబర్చిన బ్యాటింగ్ దూకుడును పునరావృతం చేసేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. గోల్డ్‌కోస్ట్ వేదికగా నేడు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండో టి20 జరగనుంది. ఇందులో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచేందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత్ పట్టుదలగా ఉంది. మధ్యాహ్నం గం. 1.40 నుంచి సోనీ సిక్స్ చానెల్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. చదవండి: MI Vs SRH: ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించిన మహ్మద్ నబీ -
టాప్ ర్యాంక్‌లో షఫాలీ వర్మ.. మూడో స్థానంలో స్మృతి మంధాన
ICC T20I Rankings: భారత మహిళా క్రికెట్ టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ టి20ల్లో తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన టి20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో ఆమె 759 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో ఆ్రస్టేలియా బ్యాటర్ బెత్ మూనీ (744 రేటింగ్స్)... మూడో స్థానంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (716) ఉన్నారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ ఆరో స్థానంలో... పూనమ్ యాదవ్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. చదవండి: మ్యాచ్ గెలిపించినా అక్షింతలు తప్పలేదు.. టీమిండియా కెప్టెన్‌పై బీసీసీఐ ఆగ్రహం -
ఉన్నపళంగా ఫామ్ అందుకోలేం
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత ఉన్నపళంగా ఫామ్‌ను అందుకోవడం చాలా కష్టమని భారత మహిళల క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ అభిప్రాయపడింది. వచ్చే ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్‌నకు ముందు భారత్ ఏకైక అంతర్జాతీయ టోర్నీలో ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది. కరోనా కారణంగా అది కాస్తా రద్దు కావడంతో పూనమ్ నిరాశ వ్యక్తం చేసింది. చివరగా ఈ ఏడాది మార్చిలో టి20 ప్రపంచకప్‌లో తలపడిన భారత్ కరోనా కారణంగా నాలుగు నెలలుగా ప్రాక్టీస్‌కు దూరమైంది. తాజాగా ఇంగ్లండ్ టూర్ కూడా ఆగిపోవడంతో నేరుగా వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటాలంటే అంత సులువు కాదని పూనమ్ పేర్కొంది. న్యూజిలాండ్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలో జరగాల్సిన ఈ మెగా టోర్నీ భవితవ్యంపై రానున్న రెండు వారాల్లో స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించింది. ‘ఇదో కఠిన సవాల్. నాలుగైదు నెలల విరామానంతరం మునుపటి ఫామ్ కొనసాగించలేం. చివరగా మార్చిలో బరిలో దిగాం. ఇప్పటికీ మేం ఆడబోయే తదుపరి సిరీస్‌పై స్పష్టత లేదు. ఒకవేళ అనుకున్న సమయానికి వన్డే ప్రపంచకప్ జరిగితే సన్నద్ధతకు సమయమే ఉండదు’ అని భారత్ తరఫున ఒక టెస్టు, 46 వన్డేలు, 67 టి20లు ఆడిన పూనమ్ పేర్కొంది. -
ధోని.. నా హెలికాప్టర్ షాట్లు చూడు!
-
హెలికాప్టర్ షాట్లు ఎలా కొట్టేస్తుందో చూడండి!
ఆగ్రా: ప్రపంచ క్రికెట్లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని హెలికాప్టర్ షాట్లకు చాలా క్రేజ్ ఉంది. ఈ షాట్లను చాలా మంది క్రికెటర్లు ప్రయత్నించినా పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. కొన్ని సందర్భాల్లో భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా హెలికాప్టర్ షాట్లను కొట్టడం మనం చూశాం. అయితే ఒక బాలిక ధోని తరహాలో హెలికాప్టర్ షాట్లను కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను భారత మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. (‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ని మళ్లీ చూద్దామా!) దీనికి ‘దిస్ ఈజ్ క్రేజీ’ అనే క్యాప్షన్ ఇచ్చిన పూనమ్.. ఎంఎస్ ధోనికి, సురేశ్ రైనా, బీసీసీఐలకు ట్యాగ్ చేశారు.ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా భారత్‌లోని క్రీడా ఈవెంట్లు ఇంకా పునరుద్ధరించలేదు. దాంతో క్రీడాకారులంతా తమ తమ ఇళ్లలోనే ఉంటూ సోషల్ మీడియాలో బిజీగా గడుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఘటనలపై స్పందిస్తూ తమ అభిప్రాయాల్ని షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పూనమ్ యాదవ్‌కు ఈ వీడియో తారస పడగా దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. (‘రోహిత్ కాదు.. కోహ్లినే’) -
‘అర్జున’ రేసులో రాహుల్
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ పేరును ఈ ఏడాది కేంద్ర క్రీడా పురస్కారం ‘అర్జున’ కోసం భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) నామినేట్ చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన 23 ఏళ్ల రాహుల్ 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. అంతకుముందు 2015, 2017లలో కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలు గెలిచాడు. 2015 ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం నెగ్గిన రాహుల్... 2014 యూత్ ఒలింపిక్స్ క్రీడల్లో రజతం... 2013 ఆసియా యూత్ క్రీడల్లో స్వర్ణం... 2013 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. మీరాబాయి, పూనమ్ పేర్లను కూడా... రాహుల్‌తోపాటు మీరాబాయి చాను (మణిపూర్), పూనమ్ యాదవ్ (ఉత్తరప్రదేశ్) పేర్లను ఐడబ్ల్యూఎల్ఎఫ్ కేంద్ర క్రీడా శాఖకు ప్రతిపాదించింది. అయితే మీరాబాయి ఇప్పటికే దేశ అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ను 2018లోనే అందుకుంది. వాస్తవానికి ‘ఖేల్‌రత్న’ కోసం ఎవరినైనా నామినేట్ చేయాలంటే ముందుగానే వారికి ‘అర్జున’ వచ్చి ఉండాలి. కానీ 2017లో మీరాబాయి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణం నెగ్గి విశ్వవిజేతగా నిలువడంతో ఆమె ఘనతకు గుర్తింపుగా కేంద్ర క్రీడాశాఖ నేరుగా ‘ఖేల్‌రత్న’ను అందజేసింది. ఇప్పటికే తాను అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’ అందుకున్నా ‘అర్జున’ అవార్డు ప్రత్యేకత వేరుగా ఉంటుందని మీరాబాయి వ్యాఖ్యానించింది. పూనమ్ యాదవ్ 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో 69 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. 2015లో సతీశ్ శివలింగం అర్జున అవార్డు పొందాక మరే వెయిట్‌లిఫ్టర్‌కు ‘అర్జున’ లభించలేదు. -
ఐసీసీ వరల్డ్‌కప్ జట్టులో పూనమ్
దుబాయ్: టి20 ప్రపంచకప్ ప్రదర్శన ఆధారంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన జట్టులో భారత లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్‌కు చోటు దక్కింది. టీమ్ ఫైనల్‌కు చేరినా... పూనమ్ మినహా మరెవరికీ ఈ టీమ్‌లో చోటు లేదు. టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ 12వ ప్లేయర్‌గా ఎంపికైంది. మాజీ క్రికెటర్లు ఇయాన్ బిషప్, లిసా స్తాలేకర్, అంజుమ్ చోప్రా తదితరులతో కూడిన ప్యానెల్ ఈ టీమ్‌ను ఎంపిక చేసింది. చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా నుంచి ఐదుగురు, ఇంగ్లండ్ నుంచి నలుగురు ఐసీసీ జట్టులో ఉన్నారు. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ టి20 ప్లేయింగ్ ఎలెవన్: మెగ్ లానింగ్ (కెప్టెన్), అలీసా హీలీ, బెత్ మూనీ, జెస్ జొనాసెన్, మెగాన్ షూట్ (ఆస్ట్రేలియా), నాట్ సివెర్, హెథర్ నైట్, సోఫీ ఎకెల్‌స్టోన్, అన్య ష్రబ్సోల్ (ఇంగ్లండ్), లారా వోల్వార్ట్ (దక్షిణాఫ్రికా), పూనమ్ యాదవ్ (భారత్); 12వ ప్లేయర్ షఫాలీ వర్మ (భారత్). -
ఐసీసీ అత్యుత్తమ వరల్డ్‌కప్ జట్టు ఇదే..
దుబాయ్: మహిళల టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని ఆసీస్ కైవసం చేసుకోగా, భారత్ రన్నరప్‌గా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆసీస్ మరోసారి కప్‌ను కైవసం చేసుకుని ఐదోసారి విజేతగా నిలిచింది. దీనిలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)తమ అత్యుత్తమ వరల్డ్‌కప్ టోర్నమెంట్ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది వుమెన్ క్రికెటర్లను ఎంపిక చేసింది. ఈ జట్టుకు ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన ఐసీసీ.. భారత్ నుంచి ఇద్దరికి మాత్రమే చోటు కల్పించింది.(మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ) ఇందులో స్పిన్నర్ పూనమ్ యాదవ్ కు ఐసీసీ ఎలెవన్ జాబితాలో చోటు దక్కగా, 12వ క్రీడాకారిణిగా షెఫాలీ వర్మను ఎంపిక చేసుకుంది. ప్రధానంగా వరల్డ్‌కప్ గెలిచిన ఆసీస్ జట్టు నుంచి ఐదుగురు క్రికెటర్లకు తమ జట్టులో చోటిచ్చిన ఐసీసీ.. ఇంగ్లండ్ నుంచి నలుగుర్నీ తీసుకుంది. దక్షిణాఫ్రికా జట్టు నుంచి ఒక క్రీడాకారిణికి మాత్రమే అవకాశం కల్పించింది. ఐసీసీ వరల్డ్‌కప్ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇదే.. మెగ్ లానింగ్(కెప్టెన్)(ఆస్ట్రేలియా), అలెసా హీలీ(వికెట్ కీపర్)(ఆస్ట్రేలియా), బెత్ మూనీ(ఆస్ట్రేలియా), నాట్ స్కీవర్(ఇంగ్లండ్), హీథర్ నైట్(ఇంగ్లండ్), లౌరా వాల్వార్డ్(దక్షిణాఫ్రికా), జెస్ జొనాసేన్(ఆస్ట్రేలియా), సోఫీ ఎక్సలీస్టోన్(ఇంగ్లండ్), అన్యా ష్రబ్సోల్(ఇంగ్లండ్), మెగాన్ స్కట్(ఆస్ట్రేలియా), పూనమ్ యాదవ్(భారత్), షెఫాలీ వర్మ(భారత్, 12వ మహిళ) Introducing your Women's #T20WorldCup 2020 Team of the Tournament 🌟 pic.twitter.com/Eb4wQUc7Ls — T20 World Cup (@T20WorldCup) March 9, 2020 -
అజేయంగా ముందుకెళ్తారా..!
మెల్బోర్న్: భారత అమ్మాయిల జట్టు అందరికంటే ముందుగానే సెమీస్ చేరింది. ఇప్పుడు అజేయంగా ముందుకెళ్లడంపై దృష్టిపెట్టింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో నేడు గ్రూప్‘ఎ’లో జరిగే తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వరుస విజయాలతో ఊపు మీదుంది. మొదట డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్‌పై, తర్వాత బంగ్లా, కివీస్‌లను ఓడించిన భారత్ ఇప్పుడు గ్రూప్ టాపర్‌గా ఉంది. ఇలాంటి జట్టు లంకను ఓడించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. పైగా హర్మన్ సేన అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో దుర్భేద్యంగా ఉంది. అందుకేనేమో సారథి హర్మన్ వరుసగా విఫలమవుతున్నా ఆ ప్రభావం జట్టుపై ఏమాత్రం లేదు. 16 ఏళ్ల షఫాలీ వర్మ ప్రత్యర్థుల పాలిట సింహ స్వప్నమవుతోంది. జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు మిడిలార్డర్లో తానియా, వేద కృష్ణమూర్తిలు చక్కగా రాణిస్తున్నారు. ఇక బౌలింగ్ అయితే బ్యాటింగ్‌కు దీటుగా ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లో మనం చేసిన స్కోర్లను నిలబెట్టిందే బౌలర్లు. స్పిన్నర్ పూనమ్ యాదవ్, పేసర్ శిఖా పాండేలను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఆపసోపాలు పడుతున్నారు. పేలవ ఫామ్‌ను కనబరుస్తున్న హర్మన్‌ప్రీత్ గనక ఈ మ్యాచ్‌తో గాడిన పడితే భారత్ తిరుగులేని జట్టుగా మారడం ఖాయం. మరోవైపు శ్రీలంక అమ్మాయిలది పూర్తిగా భిన్నమైన పరిస్థితి. భారత్ ఆడినవన్నీ గెలిస్తే... లంకేమో ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ లక్ష్యాల్ని బౌలర్లు కాపాడితే... లంక లక్ష్యాలన్నీ చెదిరిపోయాయి. బ్యాటింగ్‌లో కెప్టెన్ జయాంగని ఫామ్‌లో ఉంది. హర్షిత మాధవి, హాసిని పెరీరాలు కూడా మెరుగ్గా ఆడారు. కానీ బౌలింగ్ వైఫల్యం లంకను పరాజయం పాలు చేసింది. రెండు మ్యాచ్‌ల్లో లంక బౌలర్లు తీసింది 7 వికెట్లే కావడం గమనార్హం. దీనివల్లే లంక లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి. ఇప్పటికే సెమీస్‌ను కష్టం చేసుకున్న లంక... పరువుకోసమైనా గెలిచేందుకు ఆరాటపడుతోంది. ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ను స్టార్‌స్పోర్ట్స్–2 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది -
అరుంధతి మెరిస్తే.. పూనమ్ తిప్పేసింది..!
పెర్త్: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-ఎలో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ పూనమ్ యాదవ్ మరోసారి తన మ్యాజిక్‌ను ప్రదర్శించింది. మూడు వికెట్లు సాధించి బంగ్లాదేశ్ కష్టాల్లోకి నెడితే, హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి రెండు వికెట్లతో మెరిసింది. ఇక శిఖా పాండే కూడా రెండు వికెట్లతో ఆకట్టుకోవడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. రాజేశ్వరి గైక్వాడ్‌కు వికెట్ లభించింది. భారత్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఐదు పరుగుల వద్ద ఓపెనర్ షమీనా సుల్తానా(3) వికెట్‌ను కోల్పోయింది. రెండో ఓవర్ తొలి బంతికి షమీనాను ఔట్ చేసి శిఖా పాండే మంచి బ్రేక్ ఇచ్చింది. ఆపై ముర్షిదా ఖతున్(30)ను అరుంధతి రెడ్డి ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ 44 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో పూనమ్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో బంగ్లాదేశ్‌ను వణికించింది. ఈ క్రమంలోనే సంజిదా ఇస్లామ్(10)ను పూనమ్ ఔట్ చేయగా, ఫర్గానా హాక్‌ను అరుంధతి డకౌట్‌గా పెవిలియన్‌కు పంపడంతో బంగ్లాపై ఒత్తిడి పెరిగింది. అటు తర్వాత ఫహిమా ఖతున్(17), జహనారా అలామ్(10)లను వరుస విరామాల్లో పూనమ్ ఔట్ చేయగా నిగార్ సుల్తానా(35) ప్రమాదకరంగా మారిన తరుణంలో రాజశ్వేరి వికెట్‌ను తీసింది. ఇలా బంగ్లాదేశ్‌ను కడవరకూ ఒత్తిడిలోకి నెట్టడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. (ఇక్కడ చదవండి:10కే మూడు వికెట్లు.. కానీ ఈసారి వదల్లేదు!) ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. యువ క్రీడాకారిణి షెషాలీ వర్మ(39; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4సిక్స్‌లు) ధాటిగా ఆడితే, రోడ్రిగ్స్(34; 37 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకుంది. చివర్లో వేదా కృష్ణమూర్తి( 20 నాటౌట్;11 బంతుల్లో 4 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(8) మరోసారి నిరాశపరిచింది. -
17 పరుగుల తేడాతో ఆసీస్‌పై భారత్ విజయం
-
ఆసీస్‌ను హడలెత్తించిన పూనమ్
సిడ్నీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన ఆరంభపు మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసి 132 పరుగులే చేసినా, దాన్ని కాపాడుకుని చిరస్మరణీయమైన గెలుపును అందుకుంది. ఆసీస్‌ను తన స్పిన్ మ్యాజిక్‌తో పూనమ్ యాదవ్ హడలెత్తించింది. పూనమ్ యాదవ్ బౌలింగ్ దెబ్బకు ఆసీస్ దాసోహమైంది. ఆమె బౌలింగ్‌లో ఎదురుదాడి చేయడాన్ని పక్కన పెడితే అసలు వికెట్లను ఎలా కాపాడుకోవాలో తెలియక నానా తంటాలు పడింది. పూనమ్ నాలుగు ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి నాలుగు కీలక వికెట్లను సాధించి భారత్ విజయంలో ముఖ్య భూమిక పోషించింది. ఓపెనర్ అలైసా హీలే(51), రాచెల్ హెయిన్స్(6), ఎలీసె పెర్రీ(0), జొనాసెన్(2)లను స్వల్ప విరామాల్లో ఔట్ చేసి ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. పూనమ్‌కు జతగా పేసర్ శిఖా పాండే మూడు వికెట్లు సాధించగా, రాజేశ్వరి గైక్వాడ్‌కు వికెట్ దక్కింది. మరో ఇద్దరు రనౌట్ కావడంతో ఆసీస్ 19.5 ఓవర్లలో 115 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది. అంతకుముందు భారత జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. దీప్తి శర్మ(49 నాటౌట్; 46 బంతుల్లో 3 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడగా, షెఫాలీ వర్మ(29; 15 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడగా, ఆపై జెమీయా రోడ్రిగ్స్(26)లు ఫర్వాలేదనిపించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరును చేసింది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా బరిలోకి దిగిన మంధాన, షెఫాలీ వర్మ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. షెఫాలీ వర్మ ధాటిగా ఆడటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 4 ఓవర్లలో 41 పరుగులతో టీమిండియా ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో జోనాసెన్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి మంధాన ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. అనంతరం పెర్రీ ఊరిస్తూ వేసిన బంతిని షెఫాలీ వర్మ భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్ అవుతుంది. ఇక ఏడో ఓవర్లో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. జోనాసెన్ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడటానికి ముందుకు వచ్చిన హర్మన్ ప్రీత్ స్టంపౌటై తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఆ సమయంలో రోడ్రిగ్స్- దీప్తి శర్మల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 53 పరుగులు జోడించిన తర్వాత రోడ్రిగ్స్ వెనుదిరిగింది. కిమ్మిన్సె వేసిన 16 ఓవర్ ఆఖరి బంతికి వికెట్లు ముందు దొరికిపోయింది. దాంతో భారత స్కోరు 100 పరుగుల వద్ద ఉండగా నాల్గో వికెట్‌ను కోల్పోయింది. కాగా, దీప్తి శర్మ స్టైక్ రొటేట్ చేస్తూ కుదురుగా ఆడి అజేయంగా నిలిచింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)