
జులన్ గోస్వామి విజృంభణ
లండన్: మహిళల వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఫైనల్లో భారత జట్టు దూకుడును కొనసాగిస్తోంది. ప్రధానంగా పేసర్ జులన్ గోస్వామి తన పదునైన బంతులతో ప్రత్యర్థి ఇంగ్లండ్ ను హడలెత్తిస్తోంది. ఇంగ్లండ్ జట్టు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వరుసగా సారా టేలర్(45), ఫ్రాన్ విల్సన్(0)లను అవుట్ చేసి మంచి బ్రేక్ ఇచ్చిన జులన్.. ఆపై కొద్ది సేపటికీ హాఫ్ సెంచరీ చేసిన స్కీవర్(51) ను ఎల్బీగా పెవిలియన్ కు పంపింది.
జులన్ గోస్వామి విజృంభణతో ఇంగ్లండ్ 164 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. తన 10 ఓవర్ల బౌలింగ్ ను పూర్తి చేసుకున్న జులన్ మూడు మెయిడిన్లు సాయంతో 23 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించింది. 40.0 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 168/6.