దుబాయ్: వన్డే వరల్డ్ కప్ ప్రధాన పోరుకు ముందు సన్నాహకంగా జరిగే వామప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. మూడు వేదికలు హైదరాబాద్, తిరువనంతపురం, గువహటి నగరాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీలో పాల్గొంటున్న 10 జట్లూ సెపె్టంబర్ 29 నుంచి అక్టోబర్ 3 మధ్య రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఆడతాయి.
సెప్టెంబర్ 30న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో గువహటిలో తలపడే భారత్... అక్టోబర్ 3న తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌ను ఎదుర్కొంటుంది. మూడు ప్రధాన మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో రెండు వామప్ మ్యాచ్‌లు కూడా జరుగుతాయి. సెప్టెంబర్ 29న పాకిస్తాన్, న్యూజిలాండ్...అక్టోబర్ 3న పాకిస్తాన్, ఆ్రస్టేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో వామప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
టికెటింగ్ పార్ట్‌నర్‌గా బుక్ మై షో...
వరల్డ్ కప్ కోసం ‘బుక్ మై షో’ను తమ టికెటింగ్ భాగస్వామిగా బీసీసీఐ ప్రకటించింది. ప్రధాన మ్యాచ్‌లు, వామప్ మ్యాచ్‌లు కలిపి మొత్తం 58 మ్యాచ్‌ల టికెట్లను బుక్ మై షో ద్వారా కొనుగోలు చేయవచ్చు.
భారత్ మినహా ఇతర జట్ల వామప్ మ్యాచ్‌లకు ఈ నెల 25 నుంచి, భారత్ ఆడే వామప్ మ్యాచ్‌లకు ఈ నెల 30 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి. అయితే బోర్డు స్పాన్సర్లలో ఒకరైన ‘మాస్టర్ కార్డ్’ వినియోగదారులకు మాత్రం ఒకరోజు ముందుగానే (నేటి సాయంత్రం 6 గంటల నుంచి, 29 సాయంత్రం 6 గంటల నుంచి) టికెట్లు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment