ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కూ హార్దిక్‌ పాండ్యా దూరం | ODI World Cup 2023: Hardik Pandya Ruled Out For Match Against England Due To Sprain In Ankle - Sakshi
Sakshi News home page

ODI World Cup 2023 IND Vs ENG: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కూ హార్దిక్‌ పాండ్యా దూరం

Published Thu, Oct 26 2023 1:01 AM | Last Updated on Thu, Oct 26 2023 9:23 AM

Hardik Pandya ruled out for match against England - Sakshi

స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌ క్రికెట్‌ టోర్నీలో భారత జట్టు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌  పాండ్యా మరో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఈనెల 19న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా  చీలమండ గాయానికి గురైన పాండ్యా 22న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగలేకపోయాడు.

ఈనెల 29న లక్నోలో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కూ హార్దిక్‌ దూరమయ్యాడు. నేడు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో పాండ్యా ఫిట్‌నెస్‌ పరీక్షలో పాల్గొంటాడు. ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా పాండ్యా జాతీయ జట్టుకు మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో తెలుస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement