
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వైదొలిగాడు. గత డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ.6.25 కోట్ల భారీ ధరకు బ్రూక్‌ను ఢిల్లీ కొనుగోలు చేసింది.
రాబోయే సిరీస్‌లు సిద్దమయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రూక్ తెలిపాడు. కాగా ఈ ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఐపీఎల్ నుంచి వైదొలగడం ఇది వరుసగా రెండో సారి. ఐపీఎల్ 2024 సీజన్‌లో కూడా ఢిల్లీనే రూ.4 కోట్లకు హ్యారీ బ్రూక్‌ని కొనుగోలు చేసింది. అయితే వ్యక్తిగత కారణాలతో గతేడాది సీజన్ నుంచి కూడా బ్రూక్ తప్పకున్నాడు.
ఐపీఎల్-2025 సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం. కానీ భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయాన్ని ఇంగ్లండ్ క్రికెట్‌కు కేటాయించాలని అనుకుంటున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్‌కు వారి అభిమానులకు క్షమాపణలు తెలుపుతున్నాను అని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
బ్రూక్‌పై బ్యాన్..!
కాగా బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం.. వేలంలో అమ్ముడుపోయిన తర్వాత ఆటగాడు సరైన కారణంగా లేకుండా ఐపీఎల్ నుంచి తప్పుకుంటే సదరు ప్లేయర్‌పై రెండేళ్ల బ్యాన్ పడనుంది. మరి హ్యారీ బ్రూక్‌పై ఐపీఎల్ నిర్వహకులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
కాగా ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి జోస్ బట్లర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో బ్రూక్ ఇంగ్లండ్ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశముంది. కాగా ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున హ్యారీ ఆడాడు. రూ.13.25 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడిన హ్యారీ బ్రూక్, 11 మ్యాచుల్లో 190 పరుగులు చేశాడు.
ఇక ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22న నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా తమ కెప్టెన్‌ను ఎంపిక చేయలేదు. కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్ ఢిల్లీ జట్టు పగ్గాలు చేపట్టే ఛాన్స్ ఉంది.
చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment