యుజువేంద్ర చహల్ (ఫైల్ ఫోటో)
డబ్లిన్ : గత విజాయాలు తలుచుకుంటూ సంబరపడటం, భవిష్యత్ సిరీస్‌ల గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందే అవసరం తమకు లేదని టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చహల్ పేర్కొన్నాడు. ఐర్లాండ్‌తో జరిగే టీ20 మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న చహల్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టీ20 సిరీసుల్లో టీమిండియా గెలిచింది అది గతమని, వచ్చే సంవత్సరం ప్రపంచకప్ ఉంది అది భవిష్యత్తు వీటిలో దేని గురించి ఆలోచించమని, కేవలం ప్రస్తుత మ్యాచ్ గురించే ఆలోచిస్తూ ప్రణాళికలు రూపోందిస్తామని ఈ మణికట్టు స్పిన్నర్ తెలిపాడు.
ఇంగ్లండ్‌లో తన తొలి పర్యటన కావడంతో కొంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని, తాను ఆడేది ఎన్నో మ్యాచ్ అని చూడనని, ఆడే ప్రతీ మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తానని పేర్కొన్నాడు. ఇప్పుడే ప్రపంచకప్ గురించి ఆలోచించటంలేదని, ఆ మెగా ఈవెంట్‌కు ముందు టీమిండియా ఎన్నో సిరీస్‌లు ఆడుతుందని చెప్పాడు. టీమిండియా ఆటగాళ్లు తాము ఆడేది చిన్న జట్టా లేక పెద్ద జట్టా అని ఆలోచించదని, ఆడే ప్రతీ మ్యాచ్ ఆస్వాదించాలని కోరుకుంటాం అని చహల్ తెలిపాడు.
ఇంగ్లండ్‌తో సిరీస్‌పై
‘ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ భారీ స్కోర్‌లు సాధించింది కానీ భారత్‌పై అది సాధ్యం కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లతో పోల్చితే టీమిండియాతో జరిగే మ్యాచ్‌లకు భిన్నమైన పిచ్‌లు ఆతిథ్య జట్టు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. టీమిండియాతో జరిగే మ్యాచ్‌ల్లో ఇంగ్లీష్ స్పిన్నర్లు కూడా వికెట్లు సాధిస్తారు. కానీ అదీ మాకు ఎంతో అనుకూలం. మణికట్టు మాయతో ప్రతీ సారీ మ్యాచ్‌లు గెలిపించలేము, కానీ ప్రస్తుతం మణికట్టు స్పిన్నర్లదే ట్రెండ్.
మామూలు స్పిన్నర్లతో పోల్చితే మణికట్టు స్పిన్నర్లలో వైవిధ్యం ఉంటుంది. అందుకే తమను బ్యాట్స్‌మెన్ సరిగా అంచనా వేయక వికెట్ పారేసుకుంటారు. ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20ల మ్యాచ్‌లు గ్రౌండ్‌లు చాలా చిన్నవి, కానీ మాకు చిన్న స్వామి స్టేడియంలో ఆడిన అనుభవంతో మా పని తేలకవుతుంది. మేము మరో రెండు మూడు నెలలు ఇంగ్లడ్‌లోనే గడపాల్సిఉంది. ఇంగ్లండ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంద’ ని చాహల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment