బ్రిస్టల్ : భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న నిర్ణాయత్మక మూడో టీ20లో ఇంగ్లండ్ భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్, బట్లర్ దాటిగా ఆడటంతో స్కోర్ 7 ఓవర్లలోనే 82 పరుగులకు చేరింది. 8 ఓవర్లో సిదార్థ్ కౌల్ బట్లర్(34)ను అవుట్ చేయడంతో పరుగుల దాటికి అడ్డుకట్ట పడింది. ఆ తర్వాత 103 పరుగుల వద్ద జాసన్(67) వెనుదిరగడంతో పరుగుల వేగం కాస్త తగ్గింది. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ హేల్స్ (30), బెయిర్‌స్టో(25), స్టోక్స్(14) పరుగులతో రాణించడంతో ఇంగ్లండ్ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కొల్పోయి 198 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యా నాలుగు వికెట్లు, కౌల్ రెండు వికెట్లు తీయగా, దీపక్ చాహర్, ఉమేశ్ యాదవ్‌లకు చెరో వికెటు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment