ఇంగ్లండ్‌తో టీ20 : కుల్దీప్‌ తిప్పేశాడు | England Sets India 160 Runs Target In 1st T20 | Sakshi
Sakshi News home page

టీమిండియా విజయ లక్ష్యం 160 

Published Wed, Jul 4 2018 12:05 AM | Last Updated on Wed, Jul 4 2018 12:06 AM

England Sets India 160 Runs Target In 1st T20 - Sakshi

కుల్దీప్‌ అభినందిస్తున్న సహచర ఆటగాళ్లు

మాంచెస్టర్ ‌: చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌(5/24) మ్యాజిక్‌ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ 159 పరుగులకే పరిమితమైంది. భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్‌ తడబడింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం జాసన్‌ రాయ్‌ (30; 20 బంతుల్లో 5ఫోర్లు) ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. మరో వైపు ఐపీఎల్‌ హీరో జోస్‌ బట్లర్‌(69; 46 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు) భారత బౌలర్లపై విరుచుకపడ్డాడు. ఆకాశమే హద్దుగా బౌలర్లపై దాడి చేశాడు. దీంతో పది ఓవర్లలకే స్కోర్‌ 77 పరుగులు దాటింది. 

కుల్డీప్‌ కూల్చేశాడు.. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ చేలరేగుతుండంతో భారీ స్కోర్‌ చేస్తుందనుకున్న సమయంలో బంతి అందుకున్న కుల్డీప్‌ మాయ చేశాడు. హేల్స్‌ను ఔట్‌ చేసి తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్న కుల్దీప్‌.. 14 ఓవర్లో మ్యాజిక్‌ చేశాడు.  కుల్దీప్‌ అద్భుతమైన బౌలింగ్‌తో పాటు ధోని మాస్టర్‌ కీపింగ్‌తో ఏకంగా ఈ ఓవర్‌లో ఇంగ్లండ్‌  మూడు వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్‌లో మోర్గాన్‌(8), బెయిర్‌ స్టో(0), రూట్‌(0) వెనుదిరగడంతో ఇంగ్లండ్‌ కష్టాల్లోపడింది. మరో వైపు వికెట్లు పడుతున్నా బట్లర్‌ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు.  చివర్లో డేవిడ్‌ విల్లీ (29; 15 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్‌కు పనిచెప్పడంతో ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ ఐదు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్‌ రెండు, హార్దిక్‌ ఒక్క వికెట్‌ సాధించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement