భారత్‌పై ఓటమి.. ఇంగ్లండ్‌ పండుగ..!! | England Cricket Team Celebrated After Lossing To India | Sakshi
Sakshi News home page

భారత్‌పై ఓటమి.. ఇంగ్లండ్‌ పండుగ..!!

Published Thu, Jul 5 2018 5:36 PM | Last Updated on Thu, Jul 5 2018 5:50 PM

England Cricket Team Celebrated After Lossing To India - Sakshi

వేడుక చేసుకుంటున్న ఇంగ్లండ్‌ ఆటగాళ్లు

భారత్‌ చేతిలో ఓటమి పాలైన తర్వాత ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు ఆ రాత్రి పండుగ చేసుకుంది

సాక్షి, హైదరాబాద్‌ : ఎనిమిది వికెట్ల తేడాతో తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఓటమి పాలైన తర్వాత ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు ఆ రాత్రి పండుగ చేసుకుంది. ఎందుకో తెలుసా?. అదే రోజు రాత్రి అద్భుత పోరులో కొలంబియాపై నెగ్గిన ఇంగ్లండ్‌ జట్టు ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరడమే ఇందుకు కారణం. కాగా, ఇంగ్లండ్‌ క్రికెటర్ల ఆనంద హేల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

పెనాల్టీ షూటౌట్‌లో 4-3 తేడాతో ఇంగ్లండ్‌ జట్టు కొలంబియాను మట్టికరిపించింది. కాగా, తొలి ట్వంటీ-20లో భారతీయ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ధాటికి ఇంగ్లండ్‌ జట్టు కుదేలైంది. 54 బంతుల్లో సెంచరీ చేసిన కేఎల్‌ రాహుల్‌ ఛేజింగ్‌లో వార్వెవా అనిపించాడు.

ఓటమి తర్వాత ఫుట్‌బాల్‌ విన్‌తో ఆనందంలో మునిగిన ఇంగ్లండ్‌ జట్టు ఎలాంటి ఒత్తిడి లేకుండా రెండో ట్వంటీ-20లోకి బరిలోకి దిగొచ్చు. ఇప్పటికే కుల్దీప్‌ను ఎదుర్కొనేందుకు ఆ జట్టు బ్యాట్స్‌మన్లు మెషీన్లతో బంతులు వేయించుకుని మరీ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ గెలుపు అనంతరం ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు సభ్యుల సెలబ్రేషన్స్‌ను కింది వీడియాలో తిలకించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement