
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత టీమిండియా వశమైంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను ముద్దాడింది. రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టగానే స్టేడియంలో ఉన్న భారత అభిమానలతో పాటు దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.
ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) ఆనందానికి అవధలు లేకుండా పోయాయి. ఫైనల్ పోరులో కామెంటేటర్‌గా వ్యవహరించిన గవాస్కర్.. టీమిండియా గెలిచిన వెంటనే మైదానంలో వచ్చి సందడి చేశాడు. 75 ఏళ్ల వయసులోనూ ఆయన చిన్నపిల్లాడిలా డ్యాన్స్ చేస్తూ టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
సహచర కామెంటేటర్లు వారి సెల్‌ఫోన్‌లలో అద్బుత క్షణాలను బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా ప్లేయర్లు కూడా ట్రోఫీని అందుకున్నాక తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ అలరించారు.
కాగా భారత్‌కు ఇది మూడో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కావడం విశేషం. 2002లో శ్రీలంకతో ట్రోఫీని సంయుక్తంగా పంచుకున్న భారత జట్టు.. ఆ తర్వాత 2013, 2025లో ఛాంపియన్స్‌గా నిలిచింది. అదేవిధంగా తొమ్మిది నెలల వ్యవధిలో భారత్‌కు ఇది రెండో ఐసీసీ టైటిల్ కావడం గమనార్హం.
ఇక ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Sunil Gavaskar after India won champions trophy 😂😂😂
I think now we can understand his harsh criticism of players pic.twitter.com/rWNsT8k47b— Chintan Patel (@Patel_Chintan_) March 9, 2025
Comments
Please login to add a commentAdd a comment