పుణే: వరల్డ్‌కప్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడి సెమీఫైనల్ అవకాశాలు కోల్పోయిన తర్వాత ఇంగ్లండ్ టోర్నీలో తమ రెండో విజయాన్ని నమోదు చేసింది. టోర్నీ తొలి పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడి, అనంతరం బంగ్లాదేశ్‌పై నెగ్గిన ఇంగ్లండ్... ఆపై వరుసగా అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్, ఆ్రస్టేలియా జట్ల చేతిలో చిత్తయింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెన్ స్టోక్స్ (84 బంతుల్లో 108; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... డేవిడ్ మలాన్ (74 బంతుల్లో 87; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), క్రిస్ వోక్స్ (45 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఒకదశలో 133/1తో మెరుగైన స్థితిలో కనిపించిన ఇంగ్లండ్... తర్వాతి 15 ఓవర్లలో 59 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి 192/6 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో స్టోక్స్, వోక్స్ ఏడో వికెట్‌కు 13.3 ఓవర్లలోనే 129 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు.
అనంతరం నెదర్లాండ్స్ 37.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. తేజ నిడమనూరు (34 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... స్కాట్ ఎడ్వర్డ్స్ (38), వెస్లీ బరేసి (37), సైబ్రాండ్ (33) ఫర్వాలేదనిపించారు. తాజా విజయంతో ఏడో స్థానానికి చేరిన ఇంగ్లండ్ 2025 చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశాలను ప్రస్తుతానికి సజీవంగా ఉంచుకుంది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్‌స్టో (సి) మీకెరెన్ (బి) దత్ 15; మలాన్ (రనౌట్) 87; రూట్ (బి) వాన్ బీక్ 28; స్టోక్స్ (సి) సైబ్రాండ్ (బి) వాన్ బీక్ 108; బ్రూక్ (సి) అకెర్‌మన్ (బి) డి లీడ్ 11; బట్లర్ (సి) తేజ (బి) మీకెరెన్ 5; అలీ (సి) డి లీడ్ (బి) దత్ 4; వోక్స్ (సి) ఎడ్వర్డ్స్ (బి) డి లీడ్ 51; విల్లీ (సి) సైబ్రాండ్ (బి) డి లీడ్ 6; అట్కిన్సన్ (నాటౌట్) 2; రషీద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 339. వికెట్ల పతనం: 1–48, 2–133, 3–139, 4–164, 5–178, 6–192, 7–321, 8–327, 9–334. బౌలింగ్: ఆర్యన్ దత్ 10–0–67–2, వాన్ బీక్ 10–0–88–2, మీకెరెన్ 10–0–57–1, డి లీడ్ 10–0–74–3, వాన్‌డర్ మెర్వ్ 3–0–22–0, అకెర్‌మన్ 7–0–31–0.
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: వెస్లీ బరేసి (రనౌట్) 37; మ్యాక్స్ ఒ డౌడ్ (సి) అలీ (బి) వోక్స్ 5; అకెర్‌మన్ (సి) బట్లర్ (బి) విల్లీ 0; సైబ్రాండ్ (సి) వోక్స్ (బి) విల్లీ 33; ఎడ్వర్డ్స్ (సి) మలాన్ (బి) అలీ 38; డి లీడ్ (బి) రషీద్ 10; తేజ నిడమనూరు (నాటౌట్) 41; వాన్ బీక్ (సి) మలాన్ (బి) రషీద్ 2; వాన్‌డర్ మెర్వ్ (సి) రషీద్ (బి) అలీ 0; దత్ (బి) రషీద్ 1; మీకెరెన్ (స్టంప్డ్) బట్లర్ (బి) అలీ 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (37.2 ఓవర్లలో ఆలౌట్) 179. వికెట్ల పతనం: 1–12, 2–13, 3–68, 4–90, 5–104, 6–163, 7–166, 8–167, 9–174, 10–179. బౌలింగ్: వోక్స్ 7–0–19–1, విల్లీ 7–2–19–2, అట్కిన్సన్ 7–0–41–0, మొయిన్ అలీ 8.2–0–42–3, ఆదిల్ రషీద్ 8–0–54–3.
ప్రపంచకప్‌లో నేడు
న్యూజిలాండ్ x శ్రీలంక
వేదిక: బెంగళూరు
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment