'నన్ను జట్టు నుంచి తీసేయమన్నా' | you can drop me from team, says Jhulan Goswami | Sakshi
Sakshi News home page

'నన్ను జట్టు నుంచి తీసేయమన్నా'

Published Thu, Aug 10 2017 11:21 AM | Last Updated on Sun, Sep 17 2017 5:23 PM

'నన్ను జట్టు నుంచి తీసేయమన్నా'

'నన్ను జట్టు నుంచి తీసేయమన్నా'

న్యూఢిల్లీ:ఇటీవల ముగిసిన మహిళల వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఆరంభపు మ్యాచ్ లో తాను పెద్దగా ఆకట్టుకోలేకపోవడం తీవ్ర ఒత్తిడికి గురైన విషయాన్ని భారత పేసర్ జులన్ గోస్వామి వెల్లడించారు. ప్రధానంగా తొలి రెండు మ్యాచ్ ల్లో తనకు వికెట్ లభించకపోవడంతో నిరాశకు లోనయ్యానని, ఆ క్రమంలోనే జట్టు నుంచి తొలగించాలని కోచ్ తుషార్ అర్థోకు విజ్ఞప్తి చేసినట్లు గోస్వామి పేర్కొన్నారు.

 

'నా ప్రదర్శన బాగా లేదు. దయచేసి నన్ను తొలగించే ఆలోచన చేయండి' అని తుషార్ ను కోరినట్లు గోస్వామి తెలిపారు. అయితే అందుకు అతను అంగీకరించలేదని కచ్చితంగా జట్టులో ఉండాల్సిందేనని తేల్చిచెప్పారన్నాడుఅదే సమయంలో కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా తనకు అండగా నిలిచిన విషయాన్నిజులన్ గుర్తు చేసుకున్నారు. వీరి సహకారంతోనే తర్వాతి మ్యాచ్ ల్లో సక్సెస్ అయినట్లు పేర్కొన్న జులన్.. ఆ ఫలితం ఆసీస్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ లో కనబడిందన్నారు. ఆసీస్ ప్రధాన క్రికెటర్ లానింగ్ ను డకౌట్ గా పంపి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానన్నారు. ఆపై తమకు అన్ని కలిసి రావడంతో మ్యాచ్ ను సునాయసంగా గెలిచి ఫైనల్ కు చేరినట్లు జులన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement