రోహిత్ శర్మతో అజిత్ అగార్కర్ (PC: Star Sports)
India's ODI World Cup 2023 Squad- Ajit Agarkar Comments: సొంతగడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఐసీసీ ఈవెంట్ ఆడనున్న 15 మంది సభ్యుల పేర్లు వెల్లడించాడు. అగార్కర్ ముందుగా చెప్పినట్లుగానే ఆసియా వన్డే కప్ ఆడుతున్న జట్టు నుంచే వరల్డ్‌కప్ టీమ్‌ను ఎంపిక చేశారు.
ఊహించినట్లుగానే యువ ఆటగాళ్లు పేసర్ ప్రసిద్ కృష్ణ, హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మకు మొండిచేయి ఎదురైంది. అంతేకాదు.. సంజూ శాంసన్‌కు కూడా చోటు దక్కలేదు. ఇక యజువేంద్ర చహల్‌కు కూడా ఈ వరల్డ్‌కప్ ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.
ఇదే ఫైనల్.. మార్పుల్లేవు.. కానీ
కాగా ఈ ప్రొవిజినల్ జట్టే ఫైనల్ అని, కేవలం గాయాల బెడద ఉంటే తప్ప ఈ జట్టులో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కుండబద్దలు కొట్టాడు. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే ఈ 15 మందిని ఎంపిక చేసినట్లు స్పష్టం చేశాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్ ఆరంభం కానుంది.
టైటిల్ వేటలో పది జట్లు
ఆతిథ్య టీమిండియాతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ తదితర పది జట్లు ఈ మెగా టోర్నీలో టైటిల్ కోసం తలపడనున్నాయి. ఇక 2011లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో ధోని సారథ్యంలోని భారత జట్టు ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే.
నాడు ధోని సిక్సర్‌తో..
ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు నాటి కెప్టెన్ ధోని. తద్వారా 28 ఏళ్ల తర్వాత మరోసారి భారత్ ఖాతాలో ఐసీసీ టైటిల్ చేరింది. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం కావాలని.. రోహిత్ సేన వరల్డ్‌కప్ గెలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
చదవండి: ODI WC 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. వారిద్దరూ ఔట్
కండలు పెంచితే సరిపోదు.. కాస్తైనా: టీమిండియా స్టార్లపై మాజీ బ్యాటర్ ఘాటు విమర్శలు
"Dhoni finishes off in style!" 🇮🇳🏆
— ICC Cricket World Cup (@cricketworldcup) July 7, 2018
Happy birthday to the man who hit the winning runs in the 2011 @cricketworldcup final, @msdhoni! pic.twitter.com/X0s7Jo7cWp
Comments
Please login to add a commentAdd a comment