వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియాకు రెండో టెస్టులో విజయం రాకుండా వరుణుడు అడ్డుపడ్డాడు. మొత్తానికి 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన కోహ్లి సెంచరీతో మెరిసి ఎప్పటికి గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. డ్రా అయినప్పటికి కోహ్లితో పాటు రోహిత్, ఇషాన్ కిషన్‌లు మంచి టచ్‌లో కనిపించడం టీమిండియాకు సానుకూలాంశం.
టెస్టులు ముగియడంతో తాజాగా టీమిండియా వన్డేలపై దృష్టి సారించింది. మరో మూడు నెలల్లో వన్డే వరల్డ్‌కప్ జరగనుండడంతో ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారనుంది. వరల్డ్‌కప్‌కు సంబంధించి టీమిండియా జట్టును ఇంకా ప్రకటించలేదు. విండీస్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఆసియా కప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ద్వారా యువ ఆటగాళ్లకు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశముంది.
ఇక గురువారం(జూలై 27న) నుంచి విండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా ఆటగాళ్లు ధరించనున్న జెర్సీని రివీల్ చేసింది. డ్రీమ్ ఎలెవెన్(Dream 11) స్పాన్సర్‌గా ఉండడంతో జెర్సీ సెంటర్‌లో డ్రీమ్ 11 లోగో దానికింద ఇండియా అని రాసి ఉంది. కుడి పక్కన బీసీసీఐ లోగో ఉంది.
సూర్యకుమార్, యజ్వేంద్ర చహల్, హర్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, జంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, శుబ్‌మన్ గిల్ ఇలా యంగ్ క్రికెటర్లంతా ఒకరి తర్వాత ఒకరు వన్డే జెర్సీ ధరించి ఫోటోలకు ఫోజిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ బుధవారం ట్విటర్‌లో షేర్ చేసింది. మీరు ఒక లుక్కేయండి.
ఇక వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో జట్టులో సీనియర్లకే ఎక్కువ అవకాశముంది. విండీస్‌తో తొలి వన్డేకు తుది జట్టు అంచనాను ఒకసారి పరిశీలిస్తే.. ఓపెనర్లుగా రోహిత్, శుబ్‌మన్ గిల్.. వన్‌డౌన్‌లో కోహ్లి, సూర్యకుమార్, సంజూ శాంసన్‌లు నాలుగు, ఐదు స్థానాల్లో.. హార్దిక్ పాండ్యా, జడేజాలు ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు రానున్నారు.
ఇక బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్/ చహల్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, సిరాజ్‌లు ఉండే అవకాశం ఉంది. కాగా వికెట్‌కీపర్‌గా సంజూ శాంసన్ వైపే బీసీసీఐ మొగ్గు చూపే అవకాశముంది. దీంతో ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితమయ్యేలా కనిపిస్తున్నాడు. విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
విండీస్‌తో తొలి వన్డే టీమిండియా తుది జట్టు అంచనా:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/ చహల్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్
Test Cricket ✅
— BCCI (@BCCI) July 26, 2023
On to the ODIs 😎📸#TeamIndia | #WIvIND pic.twitter.com/2jcx0s4Pfw
చదవండి: 'హర్మన్‌ప్రీత్ ప్రవర్తన మరీ ఓవర్‌గా అనిపించింది'
Prabath Jayasuriya: లంక బౌలర్ సంచలనం.. బాబర్ ఆజం వీక్‌నెస్ తెలిసినోడు
Comments
Please login to add a commentAdd a comment