
ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రెడ్ బాల్ క్రికెట్‌లో పేలవ ఫామ్ కారణంగా ఈ సిరీస్‌కు దూరంగా ఉండాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రోహిత్ ఇప్పటికే బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం. అదేవిధంగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో విఫలమైన కోహ్లి మాత్రం ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడనున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌తో పాటు బీజీటీలోనూ దారుణ ప్రదర్శన కనబరిచాడు.
ఆసీస్‌తో సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్ మ్యాన్.. తర్వాత రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు. కానీ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. మూడు మ్యాచ్‌లలో అతను 6.20 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్‌గా కూడా రోహిత్ విఫలమయ్యాడు.
ఈ క్రమంలో సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు నుంచి రోహిత్ శర్మ తనంతట తానే తప్పుకున్నాడు. ఆ మ్యాచ్ అనంతరం రోహిత్ టెస్టులకు విడ్కోలు పలకనున్నాడని ఊహగానాలు వినిపించాయి. కానీ రోహిత్ మాత్రం ఇప్పటిలో నకు రిటైరయ్యే ఉద్దేశ్యం లేదని పుకార్లకు చెక్ పెట్టాడు. కానీ ఇప్పుడు కొన్ని రోజుల పాటు టెస్టులకు దూరంగా ఉండాలని రోహిత్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ హిట్‌మ్యాన్ అందుబాటులేకపోతే జస్ప్రీత్ బుమ్రా జట్టు పగ్గాలను చేపట్టే అవకాశముంది. అయితే మరి కొన్ని రిపోర్ట్‌లు మాత్రం రోహిత్ ఇంగ్లండ్ సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నాడని పేర్కొంటున్నాయి. రోహిత్ ఆడుతాడా, తప్పుకుంటాడా అన్నది మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.
ఇక భారత క్రికెట్ జట్టు ఏడాది జూన్ 20న ఇంగ్లాండ్ పర్యటనను ప్రారంభిస్తుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా జరుగనుంది. తదుపరి నాలుగు టెస్ట్‌లు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, కెన్నింగ్టన్ ఓవల్ వేదికలపై జరగనున్నాయి. అంతకంటే ముందు భారత-ఎ జట్టు రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
చదవండి: IPL 2025: రియాన్ పరాగ్ చెత్త రికార్డు.. తొలి ప్లేయర్‌గా