
ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. గౌహతి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ పరాజయం పాలైంది. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ రాజస్తాన్‌ది ఇదే కథ.
ఈ మ్యాచ్‌లో44 పరుగుల తేడాతో రాయల్స్‌ను ఎస్ఆర్‌హెచ్ చిత్తు చేసింది. అయితే ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ రెగ్యూలర్ కెప్టెన్ సంజూ శాంసన్ లేని లోటు స్ఫష్టంగా కన్పించింది. శాంసన్ చేతి వేలి గాయం కారణంగా మొదటి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
అతడి స్ధానంలో యువ బ్యాటర్ రియాన్ పరాగ్ రాజస్తాన్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. సంజూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే వస్తున్నాడు. రియాన్ పరాగ్ మాత్రం కెప్టెన్సీ పరంగా పూర్తిగా తేలిపోయాడు. మైదానంలో వ్యూహత్మకంగా వ్యవహరించలేకపోతున్నాడు. ఈ క్రమంలో పరాగ్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఐపీఎల్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన తొలి రాజస్తాన్ కెప్టెన్‌గా పరాగ్ నిలిచాడు. ఇప్పటివరకు ఏ రాజస్తాన్ కెప్టెన్ కూడా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడలేదు. రాజస్తాన్ ఫ్రాంచైజీకి పరాగ్ ఏడువ కెప్టెన్ కావడం గమనార్హం.
పరాగ్ కంటే ముందు షేన్ వార్న్, షేన్ వాట్సన్, రాహుల్ ద్రవిడ్, స్టీవ్ స్మిత్, అజింక్య రహానే, సంజు శాంసన్ రాయల్స్‌కు కెప్టెన్‌లగా వ్యవహరించారు. మరో మ్యాచ్ తర్వాత సంజూ తిరిగి రాజస్తాన్ పగ్గాలు చేపట్టే అవకాశముంది.
చదవండి: 300 సాధ్యమే.. లక్నో బ్యాటింగ్ ఆర్డర్ కూడా ప్రమాదకరమైందే: SRH కోచ్