వెస్టిండీస్ టూర్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారత జట్టు విజయ భేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో అరంగేట్ర ఆటగాడు యశస్వీ జైశ్వాల్(171) సెంచరీతో చెలరేగగా.. అశ్విన్ బౌలింగ్‌లో 12 వికెట్లతో సత్తాచాటాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సెంచరీ సాధించాడు.
వెస్టిండీస్‌కు వెళ్లనున్న అజిత్ అగర్కార్
ఇక తొలి టెస్టులో విజయం సాధించిన రోహిత్ సేన.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. జూలై 20 నుంచి ట్రినిడాడ్ వేదికగా రెండు టెస్టు ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. భారత కొత్త సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ వెస్టిండీస్‌కు వెళ్లనున్నాడు. అతడు నేరుగా ట్రినిడాడ్‌కు చేరుకుని భారత జట్టును కలవనున్నాడు.
అగార్కర్ ఛీప్ సెలక్టర్‌గా ఎంపికైన తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కలవలేదు. అతడు ఛీప్ సెలక్టర్‌గా ఎంపికైనప్పటికీ భారత జట్టు కరేబియన్ దీవుల్లో ఉంది. అదేవిధంగా ఐర్లాండ్ టూర్‌కు భారత జట్టు ఎంపిక గురించి రోహిత్, ద్రవిడ్‌తో అగార్కర్ చర్చించనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా విండీస్ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా ఐర్లాండ్‌కు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా అతిథ్య ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ పర్యటనకు భారత ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ పంపే అవకాశం ఉంది.
విండీస్‌తో టెస్టులకు భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (విసి), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్సర్ పటేల్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ
చదవండి: IND vs WI: 'అలా జరగనందుకు చాలా బాధగా ఉంది.. అతడు ఇండియన్ క్రికెట్‌ను ఏలుతాడు'
Comments
Please login to add a commentAdd a comment