ముంబై: ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ రాజీనామా చేశాడు. అగార్కర్‌తో పాటు సెలక్షన్ కమిటీలో ఉన్న మరో ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేశారు. ముంబయి క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక కమిటీ సమావేశమైన కొద్ది గంటల్లోనే వీరు రాజీనామాలు ప్రకటించడం ప్రాధాన్యత ను సంతరించుకుంది.
దేశవాళీ టోర్నీల్లో ముంబయి జట్టు దారుణంగా పరాజయం పాలైంది. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో అంచనాలను అందుకోలేదు. దీంతో సెలక్షన్ కమిటీపై చర్యలు తీసుకునేందుకు ఎంసీఏ తాత్కాలిక కమిటీ సిద్ధమైంది. ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కసరత్తు చేస్తున‍్న సమయంలోనే సెలక్షన్ కమిటీ సభ్యులు మూకుమ్ముడిగా రాజీనామా చేయడం గమనార్హం. రాజీనామాలు చేసిన వారిలో అగార్కర్‌తో నీలేస్ కులకర్ణి, సునీల్ మోరే మరియు రవి ఠక్కర్‌లు ఉన్నారు. వీరంతా తమ రాజీనామా లేఖలను ఈ-మెయిల్‌లో ముంబయి క్రికెట్ అసోసియేషన్(ఎంసిఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సి.కె. నాయక్‌కు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment