"Pagalpanti Nahi" - Rohit Sharma Comments Viral: ‘‘ఓపెనర్లు వాళ్ల స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. ఇక నంబర్ 3లో విరాట్ కోహ్లి ఫిక్స్. గాయం కారణంగా జట్టును వీడకముందు కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత ఆసియా కప్ టోర్నీలోనూ అదే చేస్తాడు.
హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో వస్తాడు. ఏడో స్థానం రవీంద్ర జడేజా కోసం. నంబర్ 4- 5 మధ్య కొన్నిసార్లు ఆటగాళ్ల ఆర్డర్ మారుస్తాం. దాని వల్ల ఎటువంటి సమస్యా ఉండదు. చివరాఖరికి జట్టు సమతూకంగా ఉందా లేదా అన్నది మాకు ముఖ్యం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
మేమేమీ పిచ్చోళ్లం కాదు..
బ్యాటింగ్ ఆర్డర్‌లో పదే పదే ప్రయోగాలు చేయడానికి పిచ్చోళ్లమేమీ కాదని విలేకరులకు కౌంటర్ ఇచ్చాడు. కాగా పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగష్టు 30 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్-2023కి బీసీసీఐ సోమవారం జట్టును ప్రకటించింది.
ఈ సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాల నేపథ్యంలో విలేకరులు హిట్‌మ్యాన్‌కు ప్రశ్నలు సంధించారు. సెప్టెంబరు 2న పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో టీమ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందని అడిగారు.
ఓపెనర్‌ను ఎనిమిదో స్థానంలో?
ఇందుకు పైవిధంగా స్పందించిన రోహిత్ శర్మ.. ఓపెనర్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడానికి తామేమీ పిచ్చోళ్లం కాదంట తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ‘‘నేను వన్డే జట్టులోకి వచ్చినపుడు యువకులకు ఫిక్స్‌డ్ బ్యాటింగ్ పొజిషన్ లేదు.
నేను లోయర్ ఆర్డర్ నుంచే మొదలుపెట్టాను. తర్వాత ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాను. అంతేగానీ.. ఓపెనర్‌ను ఎనిమిదో స్థానంలో పంపడం.. ఎనిమిదో నంబర్ ఆటగాడిని ఓపెనర్‌గా పంపడం వంటి పిచ్చి పనులు చేయము’’ అని రోహిత్ పేర్కొన్నాడు.
విండీస్ పర్యటనలో ప్రయోగాలు
కాగా విండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో యువకులను ప్రమోట్ చేసిన రోహిత్ శర్మ.. తాను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టును విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే.
ఇక మిగిలిన రెండు వన్డేల్లో రోహిత్, విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకోగా.. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ జట్టు వెస్టిండీస్‌తో సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఆసియా కప్-2023నకు ముందు రోహిత్, కోహ్లి వంటి ప్రధాన ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగి కాస్త తడబడ్డా.. ఆపై నిలదొక్కుకోవడం యువ జట్టులో ఆత్మస్థైర్యాన్ని నింపింది.
చదవండి: Asia Cup: వరల్డ్‌కప్‌లో వాళ్లకు చోటు! ఆ ముగ్గురికి రోహిత్ శర్మ గుడ్‌న్యూస్..
అందుకే చహల్‌పై వేటు.. ఇకపై: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు
Rohit in Press Conferences gotta be my fav genre 🤣🤣🤣#AsiaCup2023pic.twitter.com/H6FisJ81Td
— Shivani (@meme_ki_diwani) August 21, 2023
Comments
Please login to add a commentAdd a comment