Pakistan vs India- Shreyas Iyer Failure In Re Entry: సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేసిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో రీఎంట్రీ ఇచ్చిన అతడు.. 14 పరుగులకే అవుటయ్యాడు. స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ(11), విరాట్ కోహ్లి(4) విఫలమైన వేళ జట్టును ఆదుకుంటాడనుకుంటే పూర్తిగా నిరాశపరిచాడు.
దెబ్బకు బ్యాట్ విరిగింది
పాక్ పేసర్ హ్యారిస్ రవూఫ్ సంధించిన షార్ట్ బాల్‌ను షాట్ ఆడబోయిన అయ్యర్.. ఫఖర్ జమాన్ చేతికి దొరికిపోయాడు. మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జమాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా స్పీడ్‌స్టర్ రవూఫ్ పేస్ దెబ్బకు అయ్యర్ బ్యాట్ విరగడం గమనార్హం.
అప్పుడు 199.. ఇప్పుడిలా!
ఈ నేపథ్యంలో నిరాశగా అయ్యర్ మైదానాన్ని వీడిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇక ఆసియా కప్ సెలక్షన్‌కు ముందు ప్రాక్టీసులో అయ్యర్ 199 పరుగులు స్కోరు చేశాడంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అప్పుడు అదరగొట్టావు.. అసలు పోరులో విఫలమయ్యావు.. అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అయ్యర్‌ను ట్రోల్ చేస్తున్నారు.
చెలరేగుతున్న పాక్ పేసర్లు
కాగా పాక్ పేసర్ల ధాటికి టీమిండియా 27 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 10 పరుగులు చేశాడు. శ్రీలంకలోని పల్లెకెలెలో చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ మధ్య శనివారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
చదవండి: Ind Vs Pak: రోహిత్ అవుట్.. కోహ్లి రియాక్షన్ వైరల్! కొంపముంచారు..
Shreyas Iyer's bat broken on Haris Rauf's delivery. pic.twitter.com/CWs68vOGgC
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 2, 2023
Comments
Please login to add a commentAdd a comment