Asia Cup, 2023 India vs Sri Lanka, Super 4 Updates:
ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 41 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. టార్గెట్ 214 పరుగుల లక్ష్యాన్ని చేదించలేక 172 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అర్థ సెంచరీతో (53: 48 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రీలంక బ్యాటర్లలో దునిత్ వెల్లలాగే (42: 46 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) అత్యధిక పరుగులు సాధించాడు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
స్కోర్లు: భారత్ 213(49.1), శ్రీలంక 172 (41.3)
ASIA CUP 2023. India Won by 41 Run(s) https://t.co/P0ylBAiETu #INDvSL
— BCCI (@BCCI) September 12, 2023
తొమ్మిదవ వికెట్ కోల్పోయిన శ్రీలంక
172 పరుగుల వద్ద శ్రీలంక తొమ్మిదవ వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రజిత ఔటయ్యాడు.
ఎనిమిదవ వికెట్ కోల్పోయిన శ్రీలంక
171 పరుగుల వద్ద శ్రీలంక ఎనిమిదవ వికెట్ కోల్పోయింది. పాండ్యా బౌలింగ్‌లో సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి మహేష్ తీక్షణ (2) ఔటయ్యాడు.
ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
162 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి ధనుంజయ్ డిసింగ్‌వా (41) ఔటయ్యాడు.
ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక
99 పరుగుల వద్ద శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి షనక (9) ఔటయ్యాడు.
ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
73 పరుగులకే శ్రీలంక సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్ పట్టడంతో అసలంక (22) ఔటయ్యాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక
శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రాహుల్ స్టంపింగ్ చేయడంతో సమరవిక్రమ (17) ఔటయ్యాడు. 19 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 73/4. అసలంక (22), ధనంజయ డిసిల్వ (5) క్రీజ్‌లో ఉన్నారు.
నాలుగు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయిన శ్రీలంక
స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక తడబడుతుంది. కేవలం 4 బంతుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి కుశాల్ మెండిస్ (15) ఔట్ కాగా.. సిరాజ్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి కరుణరత్నే (2) పెవిలియన్ బాటపట్టాడు. 7.2 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 25/3. బుమ్రా 2, సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.
టార్గెట్ 214.. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక
214 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి నిస్సంక (6) ఔటయ్యాడు.
తిప్పేసిన లంక స్పిన్నర్లు.. 213 పరుగులకే ఆలౌటైన భారత్
లంక స్పిన్నర్లు దునిత్ వెల్లలగే (5/40), చరిత్ అసలంక (4/18) ధాటికి భారత్ 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ (53) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆఖర్లో అక్షర్ పటేల్ (26) ఓ మోస్తరు స్కోర్ చేయడంతో భారత్ 200 పరుగుల మార్కును దాటింది.
వరణుడి ఆటంకం
సమయం సాయంత్రం 06:23 నిమిషాలు: టీమిండియా- శ్రీలంక మ్యాచ్‌కు వరణుడి ఆటంకం.
వర్షం కారణంగా ఆట నిలిపి వేసే సమయానికి 47 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీమిండియా 197 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ 15, సిరాజ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా
42.2: వరుసగా రెండో వికెట్ తీసిన అసలంక. కుల్దీప్ యాదవ్ డకౌట్
ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా
42.1: అసలంక బౌలింగ్‌లో బుమ్రా(5) బౌల్డ్
40 ఓవర్లలో టీమిండియా స్కోరు: 180-7
అక్షర్, బుమ్రా క్రీజులో ఉన్నారు.
ఏడో వికెట్ డౌన్
38.5:అసలంక బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా వెనుదిరిగిన జడేజా(4)
35.6:వెల్లలగేబౌలింగ్‌లో పాండ్యా(5) అవుట్
ఐదో వికెట్ కోల్పోయిన భారత్
34.2: అసలంక బౌలింగ్‌లో ఇషాన్ కిషన్(33) అవుట్. పాండ్యా, జడేజా క్రీజులో ఉన్నారు. స్కోరు: 172/5 (35.5)
FIFTY UP! 👏🏻😍
— Star Sports (@StarSportsIndia) September 12, 2023
Back to back half centuries for #TeaIndia skipper, @ImRo45! Will he notch up his 31st 💯 today? 👀
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/N9eImshbuf
29.6: నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
కేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న రాహుల్‌ను వెల్లలగే బౌల్డ్ చేశాడు. దీంతో 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు నిష్క్రమించాడు. ఇషాన్ కిషన్(24), హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నారు. స్కోరు: 154-4(30)
25 ఓవర్లలో టీమిండియా స్కోరు: 128-3
కేఎల్ రాహుల్18, ఇషాన్ కిషన్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.
20 ఓవర్లలో టీమిండియా స్కోరు: 109-3
రోహిత్ శర్మ అవుట్
15.1: లంక స్పిన్నర్ వెల్లలగే ఫుల్ జోష్‌లో ఉన్నాడు. కోహ్లి వికెట్ తీసిన తన మరుసటి ఓవర్‌లోనే రోహిత్(53)ను బౌల్డ్ చేశాడు. స్కోరు: 91/3. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
13.5: లంక యువ స్పిన్నర్ వెల్లలగే మరోసారి మెరిశాడు. తొలుత గిల్ వికెట్ తీసిన అతడు.. ఈసారి ఏకంగా కింగ్ కోహ్లిని అవుట్ చేశాడు. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి షనకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది.
రోహిత్ హాఫ్ సెంచరీ
12.2: బౌండరీతో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న రోహిత్ శర్మ. 44 బంతుల్లో 51 పరుగులు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
11.1: శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. వెల్లలగే బౌలింగ్‌లో గిల్(19) బౌల్డ్ అయ్యాడు. కోహ్లి, రోహిత్ క్రీజులో ఉన్నారు.
►10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 65/0
వారెవ్వా హిట్‌మ్యాన్
6.5: కసున్ రజిత బౌలింగ్‌లో సిక్స్ బాది రోహిత్ శర్మ వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
►6 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 31/0
రోహిత్ 17, గిల్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
►2 ఓవర్లలో టీమిండియా స్కోరు: 10-0.
రోహిత్ శర్మ 7, గిల్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.
అక్షర్‌కు పిలుపు.. అతడు అవుట్
ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. శార్దూల్ ఠాకూర్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో శార్దూల్ స్థానంలో అక్షర్‌కు చోటిచ్చినట్లు టీమిండియా సారథి రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
తుదిజట్లు:
టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
శ్రీలంక:
పాథుమ్ నిస్సాంకా, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లగే, మహీష్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరణ
15 గంటలలోపే మళ్లీ
పాకిస్తాన్‌తో రిజర్వ్ డే మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా తిరిగి 15 గంటలలోపై మళ్లీ మ్యాచ్‌కు సిద్ధమైంది. సూపర్-4లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో రోహిత్ సేన శ్రీలంకతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఎవరికైనా విశ్రాంతినిచ్చే అవకాశం ఉందా? భారత తుది జట్టులో ఎవరెవరుంటారు అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి.
కాగా భారత్- లంక మ్యాచ్ కొలంబోలో గల ఆర్. ప్రేమదాస స్టేడియంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. ఈసారి వన్డే ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో గ్రూప్-ఏ నుంచి టీమిండియా- పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 దశకు చేరుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment