Ind vs Pak: నెట్స్‌లో శ్రమించిన రాహుల్‌.. కోహ్లి, రోహిత్‌ డుమ్మా! | Ind Vs Pak: Kohli, Rohit Skip Optional Practice, KL Rahul Sweats It Out - Sakshi
Sakshi News home page

Ind vs Pak: నెట్స్‌లో శ్రమించిన రాహుల్‌.. ప్రాక్టీస్‌కు కోహ్లి, రోహిత్‌ డుమ్మా! అతడిపై ద్రవిడ్‌ ఫోకస్‌..

Published Thu, Sep 7 2023 3:08 PM | Last Updated on Thu, Sep 7 2023 6:18 PM

Ind Vs Pak: Kohli Rohit Skip Optional Practice KL Rahul Sweats It Out - Sakshi

Asia Cup 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆసియా కప్‌-2023లో అడుగుపెట్టిన టీమిండియాకు అడుగడుగునా వరణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా చిరకాల ప్రత్యర్థితో పోరులో 48.5 ఓవర్లలో రోహిత్‌ సేన 266 పరుగులకు ఆలౌట్‌ అయింది.

అయితే, ఎడతెరిపి లేని వర్షం కారణంగా పాకిస్తాన్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాలేదు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయడంతో దాయాదులకు చెరో పాయింట్‌ దక్కింది. ఈ నేపథ్యంలో.. అప్పటికే నేపాల్‌పై 238 పరుగులతో ఘన విజయం సాధించిన పాకిస్తాన్‌.. గ్రూప్‌-ఏ టాపర్‌గా నిలిచింది.

నేపాల్‌తో మ్యాచ్‌లోనూ
ఈ క్రమంలో టీమిండియా తమ రెండో మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడగా.. మళ్లీ వరుణుడు పలకరించాడు. వర్షం కారణంగా ఆగుతూ సా...గిన మ్యాచ్‌లో ఎట్టకేలకు డీఎల్‌ఎస్‌ పద్ధతిలో.. భారత జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సూపర్‌-4లో అడుగుపెట్టింది.

ఈసారి లోపాలు సవరించుకుని
ఈ నేపథ్యంలో ఆదివారం మరోసారి పాకిస్తాన్‌తో రోహిత్‌ సేన తలపడేందుకు సిద్ధమైంది. కొలంబోలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌కు ప్రేమదాస స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా తొలి మ్యాచ్‌లో పాక్‌ పేసర్ల నుంచి టీమిండియా బ్యాటర్లు గట్టి పోటీని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తదుపరి మ్యాచ్‌లో లోపాలు సవరించుకుని చిరకాల ప్రత్యర్థిపై మరోసారి పైచేయి సాధించాలని భారత్‌ పట్టుదలగా ఉంది. 

ప్రాక్టీస్‌ సెషన్‌.. వాళ్లిద్దరు డుమ్మా
ఈ నేపథ్యంలో.. టీమిండియా ఆటగాళ్లు గురువారం ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఫిట్‌నెస్‌ సమస్యల నుంచి కోలుకున్న కేఎల్‌ రాహుల్‌.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. లెఫ్టార్మ్‌, రైటార్మ్‌ పేసర్ల బౌలింగ్‌ను అతడు ఎదుర్కొన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే..  మిగతా వాళ్లు కూడా కాసేపు ప్రాక్టీస్‌ చేయగా.. ఈ ఆప్షనల్‌ సెషన్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. యువ ఆటగాళ్లు ప్రాక్టీసు​ చేస్తున్న సమయంలో వీరిద్దరు విశ్రాంతి తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అతడిపై స్పెషల్‌ ఫోకస్‌
మరోవైపు.. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ దగ్గరుండి మరీ పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ బ్యాటింగ్‌ను గమనించినట్లు తెలుస్తోంది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకు వీలుగా జట్టులోకి తీసుకున్న తరుణంలో అతడి బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ మీద దృష్టి పెట్టినట్లు సమాచారం. 

చదవండి: వరల్డ్‌కప్‌ తర్వాత ద్రవిడ్‌ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్‌గా అతడే?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement