'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్‌ చేయలేకపోయాం' | Ajit Agarkar Reveals Reason For Rinku Singhs Snub From T20 World Cup Squad | Sakshi
Sakshi News home page

రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్‌ చేయలేకపోయాం: అజిత్‌

Published Thu, May 2 2024 7:09 PM | Last Updated on Thu, May 2 2024 7:21 PM

Ajit Agarkar Reveals Reason For Rinku Singhs Snub From T20 World Cup Squad

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు ప్ర‌క‌టించిన భార‌త జట్టులో న‌యా ఫినిష‌ర్ రింకూ సింగ్‌కు చోటు ద‌క్క‌కపోయిన సంగ‌తి తెలిసిందే. 15 మంది స‌భ్యుల‌తో కూడిన ప్ర‌ధాన జ‌ట్టులో రింకూకు ఛాన్స్ ఇవ్వ‌ని సెల‌క్ట‌ర్లు.. నామ‌మాత్రంగా స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. 

ప్ర‌స్తుతం ఇదే విష‌యం క్రీడా వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.  అద్బుత ఫామ్‌లో రింకూను ఎంపిక చేయ‌క‌పోవ‌డాన్ని చాలా మంది మాజీ క్రికెట‌ర్లు త‌ప్పుబడుతున్నారు.

తాజాగా ఈ విష‌యంపై  బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జ‌ట్టులో అద‌న‌పు బౌల‌ర్ అవ‌స‌రం ఉండ‌టంతోనే రింకూను సెల‌క్ట్ చేయ‌లేద‌ని అగార్కర్ తెలిపాడు.

రింకూ సింగ్‌ అద్బుతమైన ఆటగాడని మాకు తెలుసు. దురుదృష్టవశాత్తూ రింకూను సెలక్ట్ చేయలేకపోయాం. అతడిని ఎంపిక చేయకపోవడానికి వెనుక ఓ కారణముంది. మేము ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఎంపిక చేయాలనుకున్నాం. 

అందుకే రింకూకు ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. మా నిర్ణయం రింకూను బాధపెట్టవచ్చు. కానీ జట్టు బ్యాలెన్స్ కారణంగా అతడిపై వేటు వేయక తప్పలేదు. అయినప్పటికి అతడు ట్రావెలింగ్ రిజర్వ్‌గా జట్టుతో పాటు వెళ్తాడని ప్రెస్‌ కాన్ఫ‌రెన్స్‌లో  అగార్కర్ పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement