India Asia Cup 2023 squad: ఆసియా కప్-2023 టోర్నీకి సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్ వేదికగా ఆగష్టు 30న ఈ ఈవెంట్ ఆరంభం కానుంది. ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో పాక్- నేపాల్ మ్యాచ్‌తో ఆసియా కప్‌నకు తెరలేవనుంది. ఇక హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్న ఈ వన్డే టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనున్న విషయం తెలిసిందే.
ధ్రువీకరించిన అగార్కర్
ఈ క్రమంలో సెప్టెంబరు 2న దాయాది పాకిస్తాన్‌తో పోటీతో భారత జట్టు ఈవెంట్‌లో తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. పల్లకెలె వేదికగా హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ కీలక పోరుకు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ధ్రువీకరించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ నాటికి రాహుల్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపాడు.
ఓ శుభవార్త కూడా!
అయితే, శ్రేయస్ అయ్యర్ విషయంలో మాత్రం శుభవార్త చెప్పాడు. ఆసియా కప్ జట్టు ప్రకటన సందర్భంగా అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు డిక్లరేషన్ వచ్చింది. టీమిండియాకు ఇదొక గొప్ప వార్త.
రాహుల్.. మళ్లీ అప్పుడే
ఇక కేఎల్ రాహుల్‌ను మాత్రం గాయం వెంటాడుతోంది. అయితే, ఆసియా కప్‌లో టీమిండియా రెండు లేదంటే మూడో గేమ్ నాటికి అతడు అందుబాటులోకి రావొచ్చు. వీళ్లిద్దరు టీమిండియాకు అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లన్న సంగతి మనకు తెలుసు కదా!’’ అని వ్యాఖ్యానించాడు.
కాగా ఐపీఎల్-2023 ద్వితీయార్థంలో గాయపడ్డ కేఎల్ రాహుల్.. జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన రాహుల్.. ఇంకా వంద శాతం ఫిట్‌నెస్ పొందలేదని తాజాగా అగార్కర్ మాటల్ని బట్టి అర్థమవుతోంది.
అందుకే సంజూ కూడా!
మరోవైపు.. అయ్యర్ సైతం వెన్నునొప్పికి చికిత్స చేయించుకున్నాడు. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను ట్రావెలింగ్ స్టాండ్‌బైగా బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే, అతడు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. కాగా పాకిస్తాన్ తర్వాత టీమిండియా సెప్టెంబరు 4న నేపాల్‌తో మ్యాచ్ ఆడనుంది.
చదవండి: Asia Cup: వరల్డ్‌కప్‌లో వాళ్లకు చోటు! ఆ ముగ్గురికి రోహిత్ శర్మ గుడ్‌న్యూస్..
Asia Cup 2023: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. తిలక్ వర్మకు ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment