
న్యూఢిల్లీ:vఇక టీ 20 ఫార్మాట్ నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వీడ్కోలు తీసుకునే సమయం ఆసన్నమైందంటూ వ్యాఖ్యానించిన అజిత్ అగార్కర్ పై మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు. ఇప్పటికే కొంతమంది పరోక్షంగా అగార్కర్ పై విమర్శలు చేయగా, తాజాగా భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అసలు ధోనిని విమర్శించే ముందు నీ స్థాయి ఏమిటో తెలుసుకొని సలహా ఇవ్వాలంటూ కిర్మాణి ధ్వజమెత్తాడు.
'ధోని దేశానికి ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. టీమిండియాలో ధోనిలాంటి అనుభవజ్ఞుడు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకట్రెండు మ్యాచ్ ల్లో విఫలమైతే ధోని రిటైర్మెంట్ తీసుకోవాలంటూ వ్యాఖ్యానించడం ఎంతవరకూ కరెక్ట్. అసలు ధోని ముందు అగార్కర్ ఎంత. ధోనిని అగార్కర్ విమర్శించడం వెనుక కారణమేమిటో అర్ధం కావడం లేదు. ఎప్పుడు తప్పుకోవాలో ధోనికి తెలుసు. ఇకనైనా అతని గురించి మాట్లాడటం ఆపండి' అని కిర్మాణి పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment